Saturday, February 21

శివరాత్రి

పరమ శివునికి ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి... రోజు అర్ధరాత్రి సమయానికి లింగోద్భవం జరుగుతుంది.లింగోద్భవం శివ భక్తులకు పుణ్యకాలం.మహా శివరాత్రి ప్రతిఏటా మాఘ మాసంలో బహుళ చతుర్దశి తిథినాడు వస్తుంది.



'శివరాత్రి మహో రాత్రం నిరాహరో జతేన్ద్రియః

అర్చయేద్వా యథాన్యాయం యథాబలయవంచకః

యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరమ

తత్ఫలం లభతే సధ్యః శివరాత్రే మదర్చనాత్'అని శ్రుతి...


శివరాత్రి పుణ్యం దినంనాడు ఉపవాసం చేసి, కామ క్రోధాది ఇంద్రియ చాపల్యాలకు లోనుకాకుండా, నిగ్రహంతో వ్యవహరించి మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా పరమేశ్వరుడిని ఆరాధిస్తే ఏడాది అంతా శివార్చన చేసిన ఫలితం కలుగుతుందని మహేశుడు బ్రహ్మకు చెప్పాడు. మహా శివరాత్రి అని మనం ఇప్పుడు చేసుకునే శివరాత్రి జగన్మాత కాత్యాయని వర ప్రసాదం. ఆమె కఠోర తపఃఫలం వల్ల ఏర్పడిందే శివరాత్రి.

Thursday, February 12

నమకం చమకం

మహా శివుడిని అర్చించడం లో రుద్రం కి చాల ప్రాధాన్యత ఉంది. యజుర్వేదం నుండి రుద్రం సంగ్రహించబడినది. రుద్రం నమకం, చమకం అని రెండు భాగాలుగా ఉంది. యజుర్వేదం 16 అధ్యాయాన్ని నమకం అంటారు. "నమో" అనే పదం ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి నమకం గా పిలవటం జరిగింది. యజుర్వేదం 18అధ్యాయాన్ని చమకం అంటారు. ఇక్కడ "చమే" అనే పదం ఎక్కువగా ఉపయోగించారు. రుద్రం ని 11 అనువకాలు(విభాగాలు) గా విభజించారు.

తెలుగు లో స్పష్టం గా నమకం చమకం లింక్ లో చూడవచ్చు.

http://www.telugubhakti.com/telugupages/Siva/namakchamak1.htm








Sunday, February 1

రధ సప్తమి (02.02.09)

ఉష (చాయాదేవి ), ప్రత్యూష సమేత శ్రీ సూర్య నారాయణ స్వామి

ఉదయం బ్రహ్మ స్వరూపం
మధ్యాహ్నంతు మహేశ్వరం
సాయంకాలే స్వయం విష్ణుః
త్రిముర్తిస్తూ దివాకరః

సూర్య భగవానుడు ఉదయం వేళ బ్రహ్మ రూపంగాను, మద్యాహ్నం ఈశ్వరుని గాను, సాయంత్రం విష్ణు రూపుడిగా ఉంటాడు. త్రిసంద్యలలో మనం సూర్య దేవునిని ప్రార్దిస్తే త్రిమూర్తులకు పూజలు చేసినంత ఫలితం ఉంటుంది.

మాఘ శుద్ద సప్తమి రోజున రధసప్తమి గా జరుపుకొంటాము. సప్త అశ్వ రధారూడా....7 గుర్రాలతో ఉన్న రధా న్ని అధిరోహించే సూర్య భగవానుడు తన దిశా నిర్దేశమును ఈరోజు నుండే మార్చుకొంటాడు.


ఈరోజు మనం జిల్లేడు ఆకులను తలమీద, భుజాల మీద ఉంచుకొని అభ్యంగన స్నానం చేస్తాము. తర్వాత 7 చిక్కుడు ఆకులలో పరమాన్నం శ్రీ సూర్య భగవానుడికి నైవేద్యం గా సమర్పించి పూజిస్తాము. రోజు నుండి పగటి వేళ సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది.

రామాయణం లో ని ఆదిత్యహృదయం చదివితే మంచి ఫలితం ఉంటుంది.