Saturday, July 31

సంకటహర చతుర్ధి వ్రతం



ఏ కార్యం తలపెట్టిన, ఏ వ్రతం ఆచరించినా ముందుగా గణపతిని ఆరాధిస్తాము.విఘ్నాధిపతి ఐన వినాయకుడు సంకటాలను, సర్వ విఘ్నాలను పోగ్గొట్టి శుభాన్ని కలుగజేస్తాడు. అలాంటి గణపతి ని పలురకాలుగా పూజిస్తారు. అన్నింటిలోకి అంత్యంత మహిమాన్వితమైనది, కష్టాలను తొలగించి అనంత శుభాలను కలుగజేసేది సంకటహర చతుర్ధి వ్రతం. దీనినే శ్రీసంకస్టహర చతుర్ధీ మహాగణపతి వ్రతం అని కూడా అంటారు. స్కంద పురాణం లో, శ్రావణమాస మహత్యం లో వ్యాస భగవానుడు ఈ వ్రతం యొక్క విశిష్టతను తెలియపరిచాడు.
ఏమి చేయాలో పాలుపోక, ఏది చేసినా విజయవంతం కాక, సందిగ్ధావస్థ లో ఉన్న సమయంలో ఈ వ్రతం ఆచరించడం వలన సర్వ విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్ధి చంద్రోదయ సమయంలో పూజిచినట్లైతే శుభం కలుగుతుందని గణపతే స్వయంగా తల్లి ఐన పార్వతీదేవికి చెప్పినట్లు పురాణ కధనం.
మొదటిసారిగా ఈ వ్రతాన్ని శ్రావణ బహుళ చతుర్ధి నుండి ప్రారంభించాలి. లేని పక్షంలో ఏదో ఒక శుభామాసంలో బహుళ చతుర్ధి నుండి ఐన ప్రారంభించవచ్చు. ఈ వ్రతం చేయదలచిన వారు సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి గణపతిని పూజించాలి. ఒక పీటను సిధంచేసి దాని పైన ఒక మంచి వస్త్రం వేసి, బియ్యం పోసి, గంగా జలం, సుగంధ ద్రవ్యాలతో, పుష్పాలతో మామిడి ఆకులతో, టెంకాయ తో కూడిన కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఎర్రని వస్త్రాన్ని ఉంచి గణపతి విగ్రహాన్ని పెట్టి పూజ చేయాలి. ఉండ్రాళ్ళను వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. పూజ తర్వాత చంద్ర దర్శనం చేసుకొని చంద్రునికి ఆర్గ్యం వదలాలి. అనంతరం కుటుంభ సభ్యులతో కల్సి తీర్ధ ప్రసాదాలను తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే సంకటాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి.

Tuesday, July 13

పుణ్య తిధులు

మనం దేవతలను పలురకాలుగా, మనకు వీలైన రీతిలో పూజిస్తూ ఉంటాము. విధంగా చేసే పూజలు నియమ నిష్టలతో చేసినట్లైతే తగిన ఫలితం వస్తుంది. దీనికి సంబందించిన తిధులు, వాటి ప్రత్యేకత, రోజు దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందో అనే వివరణ మనకు వరాహ పురాణం లో వివరించ బడినది.వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు స్వయంగా తిధులు వాడి విశేషాల గురించి భూదేవి కి వివరించారు.

తిధులు వాటి విశిష్టత :
పాడ్యమి :
దేవతలలో ముందు పుట్టిన వాడు అగ్ని. కాబట్టి తిధులలో మొదటిదైన పాడ్యమి నాడు అగ్ని ని పూజించి, ఉపవాసం ఉండినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.

విదియ :
అశ్విని దేవతలను ఆరాధించాలి. వారు తిధి నాడు పుట్టినందు వల్ల, ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేస్తే శుభప్రదం.

తదియ :
గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియ నాడు జరిగినందు వల్ల, గౌరీ దేవికి తిధి అంటే ఇష్టం. ఇది ప్రత్యేకంగా స్త్రీ కోసం ఏర్పాటు అయినది.

చవితి:
వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాదే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు.

పంచమి:
పంచమి నాడు నాగులు జన్మించాయి. అందుకే నాగాదేవతలకు పంచమి తిధి / నాగుల చవితి అన్న చాల ఇష్టం. ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి నాగ పూజ చేస్తే నాగుల వల్ల భయం ఉండదు.

షష్టి :
కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి. రోజున అర్చన చేసినట్లైతే సుబ్రహమణ్య అనుగ్రహం పొందగలరు.

సప్తమి:
సూర్యుని జన్మ తిధి. రధసప్తమి నాడే కాకుండా ప్రతీ శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి.

అష్టమి:
దుర్గాదేవి అష్టమాకృతులు ఆవిర్భవించిన తిధి. అష్టమాకృతులను, దుర్గా దేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.

నవమి:
దుర్గాదేవి కి ప్రీతికరమైనది. తిధి నాడు దుర్గ ను పూజించి ఉపవాసం ఉంటే సంపదలు కలుగుతాయి.

దశమి:
దశమి నాడు దిక్కు
సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలు తొలగుతాయి.

ఏకాదశి:
కుబేరుడు పుట్టిన తిధి. తిధిన కుబేర పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది

ద్వాదశి:
విష్ణువు కి ఇష్టమైన తిధి. తిధి రోజే విష్ణు మూర్తి, వామన రూపం లో జన్మించారు. ద్వాదశి నాడు ఆవు నెయ్యి తో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది.

త్రయోదశి:
ధర్ముడు పుట్టిన తిధి. రోజున ఎవరికీ ఇష్టమైన దేవుడిని వారు తలచుకొని పూజిస్తే , ఫలం చేకూరుతుంది.

చతుర్దశి:
రుద్రుని తిధి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం. కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. తిధి శివుడికి ప్రీతికరం.

అమావాస్య:
పితృదేవతలకు ఇష్టమైన తిధి. దర్భలు, నువ్వులు, నీళ్ళతో పితృదేవతలకు తర్పనమిస్తే వారు సంతోషించి సంతాన సౌక్యం అనుగ్రహిస్తారు.

పౌర్ణమి:
పౌర్ణమికి చంద్రుడు అధిపతి. పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉంది రాత్రి కి చంద్రుడిని పూజించినట్లితే ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు సిద్దిస్తాయి.