Tuesday, February 22

సుబ్రహ్మణ్య కవచం

సింధూరారుణ ఇందు కాంతి వదనం కేయూరహారాదిభిః
దివ్యైర్ ఆభరణై విభూషిత తనుం స్వర్గాది సౌఖ్య ప్రదం,

ఆంభోజాభయ శక్తి కుక్కట ధరం,రక్తాంగ రాగోజ్వలం,
సుబ్రహ్మణ్యం ఉపాస్మహే,ప్రణమతాం భీతి ప్రసోధ్యతం

సుబ్రహ్మణ్యో అగ్రత పాతు సేనాని పాతు పృస్థుతః
గుహోమాం దక్షిణే పాతు వహ్నిజ పాతుమామతః

శిరఃపాతు మహా సేన స్కంధో రక్షే లలాటకం,
నేత్రే మే ద్వాదశాక్షం చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్

ముఖం మే షణ్ముఖ పాతు నాసికం శంకరాత్మజ,
ఓష్ఠౌ వల్లీ పతి పాతు జిహ్వాంపాతు షడక్షకం

దేవసేనాధిపతి దంతన్ చుబకం బహుళాసుతః,
కంఠం తారక జిత పాతు బాహు ద్వాదశ బాహు మాన్

హస్తౌ శక్తి దరః పాతు వక్ష పాతు శరోద్ భవ,
హృదయం వహ్ని భూ పాతు కుక్షిం పాత్వంబికాసుత

నాభిం శంభు సుత పాతు కటింపాతు హరాత్మజ,
ఓష్టో పాతు గజారూఢో జహ్ను మే జాహ్నవీ సుత

జంఘో విశాకో మే పాతు పాదౌ మే శిఖి వాహన,
సర్వాంగణి భూతేశ సప్త ధాతుంశ్చ పావకి

సంధ్యా కాలే నిశీదిన్యాం దివ ప్రాతర్ జలే అగ్నేషు,
దుర్గమే చ మహారణ్యే రాజ ద్వారే మహా భయే

తుమలే అరణ్య మధ్యే చ సర్పదుష్టమృగాధిషు,
చోరాదిసాధ్యసంభేధే జ్వరాది వ్యాధి పీడనే

దుష్ట గ్రహాది భీతౌ చ దుర్నిమిత్తాది భీషణే,
అస్త్ర శస్త్ర నిపాతే చ పాతుమాంక్రౌంచరంధ్ర కృత్

య: సుబ్రహ్మణ్య కవచం ఇష్ట సిద్ధి ప్రద: పఠేత్,
తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహం

ధర్మర్ధీ లభతే ధర్మం ఆర్తార్థీ చ ఆర్త మాప్నుయాత్,
కామార్తీ లభతే కామం మోక్షర్థీ మోక్షమాప్నుయాత్

యత్ర యత్ర జపేత్ తత్ర తత్ర సన్నిహితో గుహ,
పూజా ప్రతిష్ఠ కాలేచ జపేకాలే పఠేత్ సదా

సర్వాభీష్టప్రదాం తస్య మహా పాతక నాశనం,
య:పఠేత్ శృణుయాత్ భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ

సుబ్రహ్మణ్య ప్రసాదేన హ్యపమృత్యు సో అంతే
ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్రపౌత్రభి వర్ధనం,
సర్వకామాన్ ఇహ ప్రాప్య సొంధే స్కంధ పురం వృజేత్

Friday, February 18

ప్రాత:గణేష స్తోత్రం

ప్రాతః స్మరామి గణ నాధ మనాధ బంధుం
సింధూర పూర పరిశోభిత గంధ యుగ్మం
ఉద్దండ విఙ్ఞ పరిఖండన చండ దండ
మఖండలాది సుర నాయక వృంద వంద్యం


ప్రాతః : తెల్లవారుజ్హామున
స్మరామి : స్మరించడం ( పూజించడం)
గణనాదం : గణాలకు అధిపతి (వినాయకుడు)
అనాధ బంధుం : భక్త రక్షకుడు
సింధూర పూర : సింధూరం తో అలకరించబడిన
పరిశోభిత : శోభిల్లుచున్న ( ప్రకాశించుచున్న )
గంధ యుగ్మం : చెక్కిళ్ళ ద్వయం ( రెండు బుగ్గలు)
ఉద్దండ : పేరు గడించిన, తిరుగులేని

విఘ్న : ఆటంకాలు
పరిఖండన : రక్షించడం (ఆటంకాలు కల్పించి, రక్షించడం ద్వార మన యొక్క బుద్ది కుశలతను, మనస్సును సన్మార్గంలొ నడిపించడం)

చండ దండ : కోరిక ను(మనలో ని అహంకారము)దండించడం

అఖండలాది సురనాయక : దేవతలందరికీ నాయకుడు (ఇంద్రుడు)
వృంద : బృందంతో కూడి (దేవతలు, తమ నాయకుడైన ఇంద్రుని తో సహా)
వంద్యం : స్తుతించుచున్నారు

ప్రాతర్నమామి చతురానన వంధ్యమాన
మిచ్చానుకూలం అఖిలం వరం దదానం
తం తుండిలం ద్విరాసనాధిప యజ్ఞ సూత్రం
పుత్రం విలస చతురం శివయో శివాయ

ప్రాతః నమామి : ప్రాతః సమయమున నమస్కరించుచున్నాను
చతురానన : బ్రహ్మ (నాలుగుతలలు కలిగినవాడు)
వంద్య మాన : స్తుతించు సమయము
()ఇఛ్చ : కోరిక
అనుకూలం : తగినట్లు
అఖిలంచ : భక్తగణం
వరం : వరాలు
దదానం : ప్రసాదించుట
తం : తన యొక్క

తుం
డిలం : నిండిన బొజ్జ

ద్వి రసనాధిప : రెండు నాలుకలు కల పాము ను

యజ్ఞ సూత్రం : జంధ్యం గా కలవాడు
పుత్రం : కుమారుడు
విలాస చతురం : విలాసాలలో ( సృష్టి అనబడు క్రీడను నడిపించు) చతురత (నైపుణ్యం కలవారు)
శివాయో: : మహా శివుడు
శివాయ : శివాణి (పార్వతీ దేవి)

ప్రాతర్ జామ్యభయదాం ఖలు భక్త శోక
దావానలం గణ విభుం వరకుంజరస్యం
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహ
ముత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య

ప్రాతః భజామి : ప్రాతః కాలమున చేయు ప్రార్ధన
అభయదాం : అభయము ఇచ్చును
ఖలు : ఎటువంటి సంశయం లేకుండా
భక్తా శోక : భక్తుల యొక్క కష్టములు తొలగించును
దావానలం : దట్టమైన అడవులలో వచ్చే మంటలు వలె
వినాశన హవ్యవాహ : హవ్యవాహనుడి చే (అగ్ని) వినాశనం చేయడం
అజ్గ్యాన ఖనన : అజ్గ్యానాన్ని నిర్మూలించడం
గణవిభుం : గణములకు విభుడు
వరకుంజరస్యం : కుంజర(ఏనుగు) ముఖము కలవాడు
ఉత్సాహ : ఉత్సాహము/నమ్మకము
వర్ధనమహం : ఎదుగుదల కు ప్రోద్భలం ఇచ్చువాడు
సుతమీశ్వరస్య : శివుని
కుమారుడు

శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్య దాయకం :
పై మూడు శ్లోకములు చదవడం వలన సామ్రాజ్యం కలుగుతుంది (కష్టాల కడలినుండి కడతేరడం)

ప్రాతురుద్దాయ సతతం యః పఠేత్ పుమాన్ :
ప్రాతః కాలమున చదివనచో సంకల్పం సిద్దిస్తుంది

Thursday, February 17

శ్రీ లలితా సహస్రనామం (ప్రతి పద అర్ధము) (162-182)

అజాక్షయ వినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ
అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖసుదుర్లభా

అజా : పుట్టుక లేనిది
క్షయ వినిర్ముక్తా : మాయాతేతమైనది
ముగ్ధా : 12 - 16 సంవత్సరముల బాలికా రూపము కలిగినది
క్షిప్రప్రసాదినీ : వెంటనే అనుగరించునది
అంతర్ముఖసమారాధ్యా : అంతర్ దృష్టి గల యోగులచే ఆరాధింపబడునది
బహిర్ముఖసుదుర్లభా : ప్రాపంచిక దృష్టి కలవారికి లభింపనిది

త్ర యీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురమాలినీ
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతి:

త్ర యీ : వేదస్వరూపిణి
త్రివర్గ నిలయా : ధర్మార్ధ కామములకు నిలయం ఐయ్నది
త్రిస్థా : మూడు విధములుగా ఉండునది
త్రిపురమాలినీ : త్రిపురములను మాలికగా ధరించినది
నిరామయా : ఏ బాధలూ లేనిది
నిరాలంబా : ఆలంబనము అవసరము లేనిది
స్వాత్మారామా : తన ఆత్మయందే ఆనందించునది
సుధాసృతి: : అమృతమును కురిపించునది

సంసారపంకనిర్మగ్న సముద్ధరణపండితా
యఙ్ఞప్రియా యఙ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి

సంసారపంకనిర్మగ్న : సంసారము అను ఊబిలో కూరుకొనిపొఇన జనలను
సముద్ధరణపండితా : ఉద్ధరించుతకు సామర్ధ్యము కలిగినది
యఙ్ఞప్రియా : యఙ్ఞములయందు ప్రీతి కలిగినది
యఙ్ఞకర్త్రీ : యఙ్ఞము చేయునది
యజమానస్వరూపిణి : యఙ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ
విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణీ

ధర్మాధారా : ధర్మమునకు ఆధారభూతమైనది
ధనాధ్యక్షా : సర్వసంపదలకు అధికారిణి
ధనధాన్యవివర్ధినీ : ధనము, ధాన్యము వర్ధిల్లచేయునది
విప్రప్రియా : వేదాధ్యయన సంపన్నులైన వారియందు ప్రీతి కలిగినది
విప్రరూప : వేదవిదులైనవారి యెందు ఉండునది
విశ్వభ్రమణకారిణీ : విశ్వమును నడిపించునది

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ
అయోని ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ

విశ్వగ్రాసా : విశ్వమే ఆహారముగా కలిగినది
విద్రుమాభా : పగడము వలె ఎర్రనైన కంతి కలిగినది
వైష్ణవీ : వైష్ణవీ దేవి రూపమున అవతరించినది
విష్ణురూపిణీ : విష్ణురూపమున జగత్తును రక్షించునది
అయోని: : పుట్టుక లేనిది
యోనినిలయా : సమస్త సృష్టి కి జన్మస్థానము
కూటస్థా : మూలకారణ శక్తి
కులరూపిణీ : కుండలినీ రూపిణి

వీరగోష్టేప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ
విఙ్ఞాన కలానా కల్యా విదగ్ధా బైందవాసనా

వీరగోష్టేప్రియా : వీరభక్తులు చేయు తీవ్రసాధన యెందు ప్రీతి కలిగినది
వీరా : వీరత్వము కలిగినది
నైష్కర్మ్యా : కర్మబంధము లేనిది
నాదరూపిణీ : ఓంకారస్వరూపిణి
విఙ్ఞాన కలానా : విఙ్ఞాన స్వరూపిణి
కల్యా : మూలకారణము
విదగ్ధా : గొప్ప సామర్ధ్యము కలిగినది
బైందవాసనా : బిందువు ఆసనముగా కలిగినది

తత్త్వాధికా తత్త్వమైయీ తత్త్వమర్ధస్వరూపిణీ
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ

తత్త్వాధికా : సమస్త తత్వములకు అధికారిణి
తత్త్వమైయీ : తత్వస్వరూపిణి
తత్త్వమర్ధస్వరూపిణీ : తత్ = అనగా నిర్గుణ నిరాకర స్వరూపము , త్వం = ప్రత్యగాత్మ, తత్+త్వం స్వరూపముగ ఉన్నది
సామగానప్రియా : సామగానమునందు ప్రీతి కలిగినది
సౌమ్యా : సౌమ్యస్వభావము కలిగినది
సదాశివకుటుంబినీ : సదాశివుని అర్ధాంగి

సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా

సవ్యాపసవ్యమార్గస్థా : వామ, దక్షిణ మార్గములలో పూజింపబడునది
సర్వాపద్వినివారిణీ : అన్ని ఆపదలను నివారించునది
స్వస్థా : మార్పులేకుండా ఉండునది
స్వభావమధురా : సహజమైన మధురస్వభావము కలది
ధీరా : ధైర్యము కలది
ధీరసమర్చితా : ధీరస్వభావము కలవారిచే ఆరధింపబడునది

చైతన్యార్ఘ్య సమారాధ్యా చైతన్య కుసుమప్రియా
సదొదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా

చైతన్యార్ఘ్య సమారాధ్యా : ఙ్ఞానులచే పూజింపబడునది
చైతన్య కుసుమప్రియా : ఙ్ఞానము అనెడి పుష్పముల యెందు ప్రీతి కలిగినది
సదొదితా : సత్యస్వరూపిణీ
సదాతుష్టా : ఎల్లప్పుడూ సంతొషముతో ఉండునది
తరుణాదిత్యపాటలా : ఉదయసూర్యుని వంటి కాంతి కలిగినది

దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా
కౌలినీకేవలా నర్ఘ్య కైవల్యపదదాయినీ

దక్షిణా : దాక్షిణ్యము కలిగినది
దక్షిణారాధ్యా : దక్షిణాచారముచే పొజింపబదుచున్నది
దరస్మేరముఖాంబుజా : చిరునవ్వుతొ కూదిన ముఖపద్మము కలిగినది
కౌళినీ : కౌళమార్గమున ఉపాసించబదుచున్నది
కేవలా : సమస్తమునకు తాను ఒక్కటియే మూలమైనది
అనర్ఘ్య కైవల్యపదదాయినీ : అత్యుత్తమమైన మోక్షము ప్రసాదించును

స్తోత్రప్రియా స్తుతిమతే శ్రుతిసంస్తుతవైభవా
మనస్వినీ మానవతీ మహేశే మంగాళాకృతి:
స్తోత్రప్రియా : స్తోత్రములు అనిన ఇస్టము కలిగినది
స్తుతిమతే : స్తుతించుట అనిన ఇస్టము కలిగినది
శ్రుతిసంస్తుతవైభవా : వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది
మనస్వినీ : మనస్సు కలిగినది
మానవతీ : అభిమానము కలిగినది
మహేశే : మహేశ్వర శక్తి
మంగాళాకృతి: : మంగలప్రదమైన రూపము కలిగినది

విశ్వమాతా జద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ
ప్రగల్భా పరమోదారా మరామోదా మనోమయీ

విశ్వమాతా : విశ్వమునకు తల్లి
జద్ధాత్రీ : జగత్తును రక్షించునది
విశాలాక్షీ : విశాలమైన కన్నులు కలది
విరాగిణీ : దేనిథోనూ అనుభందము లేనిది
ప్రగల్భా : సర్వసమర్ధురాలు
పరమోదారా : మిక్కిలి ఉదారస్వభావము కలిగినది
మరామోదా : పరమానందము కలిగినది
మనోమయీ : మనశ్శే రూపముగా కలిగినది

వ్యోమకెశే విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ
పంచయఙ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ

వ్యోమకెశే : అంతరిక్షమే కేశముగా కలది
విమానస్థా : విమానము (సహస్రారము) నందు ఉండునది
వజ్రిణీ : వజ్రము ఆయుధముగా కలిగినది
వామకేశ్వరీ : వామకేశ్వరుని శక్తి
పంచయఙ్ఞప్రియా : నిత్యము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది
పంచప్రేతమంచాధిశాయినీ : పంచప్రేతములచే ఏరడిన మంచముపై కూర్చుని ఉండునది

పంచమే పంచభూతేశే పంచసంఖ్యోపచారిణి
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ

పంచమే : పంచకృత్యపరాయణి
పంచభూతేశే : పంచభూతములను ఆఙ్ఞాపించునది
పంచసంఖ్యోపచారిణి : శ్రీవిద్యోపాసకులచే 5 విధములుగా ఆరధింపబడునది
శాశ్వతీ : శాశ్వతముగా ఉండునది
శాశ్వతైశ్వర్యా : శాశ్వతమైన ఐశ్వర్యము కలది
శర్మదా : ఓర్పు ను ఇచ్చునది
శంభుమోహినీ : ఈశ్వరుని మోహింపజేయునది

ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా

ధరా : ధరించునది
ధరసుతా : సమస్త జీవులను తన సంతానముగా కలిగినది
ధన్యా : పవిత్రమైనది
ధర్మిణీ : ధర్మస్వరూపిణి
ధర్మవర్ధినీ : ధమమును వర్ధిల్ల చేయునది
లోకాతీతా : లోకమునకు అతీతమైనది
గుణాతీతా ; గుణములకు అతీతమైనది
సర్వాతీతా : అన్నిటికీ అతీతురాలు
శమాత్మికా : క్షమాగుణము కలిగినది

బంధూకకుసుమప్రఖ్యా బాలాలీలావినోదినీ
సుమంగళి సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ

బంధూకకుసుమప్రఖ్యా : మంకెనపూలవంటి కాంతి కలిగినది
బాలా : 12సంవత్సరముల లోపు బాలిక,,,,బాల
లీలావినోదినీ : బ్రహ్మాండములను సృస్టించు అను లీల యందు వినోదమును కలిగినది
సుమంగళి : మంగళకరమైన రూపము కలిగినది
సుఖకరీ : సుఖమును కలిగించునది
సువేషాఢ్యా : మంచి వేషము కలిగినది
సువాసినీ : సుమంగళి

సువాసిన్యర్చనప్రీతా శోభనా శుద్ధమానసా
బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా

సువాసిన్యర్చనప్రీతా : సువాసినులు చేయు అర్చన యెందు ప్రీతి కలిగినది
శోభనా ; శోభ కలిగినది
శుద్ధమానసా : మంచి మనస్సు కలిగినది
బిందుతర్పణ సంతుష్టా : అమృత బిందు తర్పణము చే సంతృప్తి పొందినది
పూర్వజా : అనాదిగా ఉన్నది
త్రిపురాంబికా : త్రిపురములందు ఉండు అమ్మ

దశముద్రాసమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ
ఙ్ఞానముద్రా ఙ్ఞానగమ్యా ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ

దశముద్రాసమారాధ్యా : 10 రకముల ముద్రలచే ఆరాధింపబదునది
త్రిపురా : త్రిపురసుందరీ
శ్రీవశంకరీ : సంపదలను వశము చేయునది
ఙ్ఞానముద్రా : బొతనవ్రేలును చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3వ్రేళ్ళను నిటారుగా ఉంచుట
ఙ్ఞానగమ్యా : ఙ్ఞానము చే చేరదగినది
ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ : ఙ్ఞాన చే తెలియబడు స్వరూపము కలిగినది

యోనిముద్రా త్రికండేశీ త్రిగుణాంబా త్రికోణగా
అనఘాద్భుత చారిత్రా వాంఛితార్ధప్రదాయినీ

యోనిముద్రా : యోగముద్రలలో ఓకటి
త్రికండేశీ : 3ఖండములకు అధికారిణి
త్రిగుణా : 3గుణములు కలిగినది
అంబా : అమ్మ
త్రికోణగా : త్రికోణమునందు ఉండునది
అనఘాద్భుత చారిత్రా : పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది
వాంఛితార్ధప్రదాయినీ : కోరిన కోర్కెలు ఇచ్చునది

అభ్యాసాతియఙ్ఞాతా షడధ్వాతీతరూపిణీ
అవ్యాజకరుణామూర్తి రఙ్ఞానధ్వాంతదీపికా

అభ్యాసాతియఙ్ఞాతా : అభ్యాసము చేసిన కొలది బొధపడును
షడధ్వాతీతరూపిణీ ; 6మార్గములకు అతీతమైన రూపము కలిగినది
అవ్యాజకరుణామూర్తి : ప్రతిఫలాపేక్షలేని కరుణ కలిగినది
రఙ్ఞానధ్వాంతదీపికా : అఙ్ఞానమును అంధకారమునకు దీపము వంటిది

ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్ త్రిపురసుందరీ

ఆబాలగోపవిదితా : సర్వజనులచే తెలిసినది
సర్వానుల్లంఘ్యశాసనా : ఎవరునూ అతిక్రమించుటకు వెల్లులేని శసనము కలిగినది
శ్రీచక్రరాజనిలయా : శ్రీ చక్రము నివాసముగా కలిగినది
శ్రీమత్ త్రిపురసుందరీ : మహా త్రిపుర సుందరి

శ్రీశివా శివశక్తైక్యరూపిణీ లలితాంబికా

శ్రీశివా : సుభములను కల్గినది
శివశక్తైక్యరూపిణీ : శివశక్తులకు ఏకమైన రూపము కలిగినది
లలితాంబికా : లలితానామమునా ప్రసిద్ధమైన జగన్మాత

ఏవం శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రం సంపూర్ణం .




శ్రీ లలితా సహస్రనామం (ప్రతి పద అర్ధము) (131-161)

అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైత వర్జితా

అష్టమూర్తి: : 8రూపములు కలిగినది (పంచేంద్రియాలు, చిత్తము, బుద్ధి,అహంకారము)
అజా : పుట్టుకలేనిది
జైత్రీ : సర్వమును జయించినది
లోకయాత్రావిధాయినీ : లోకములను నియమించునది
ఏకాకినీ : ఏకస్వరూపిణీ
భూమరూపా : భూదేవిరూపము ధరించునది
నిర్ద్వైతా : అద్వైతము కలిగినది (రెందవది అనునది లేకుండుట)
ద్వైత వర్జితా : ద్వైతభావము లేనిది

అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మత్మైక్యస్వరూపిణీ
బృహతి బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా

అన్నదా : సర్వజీవులకు ఆహారము ఇచ్చునది
వసుదా : సంపదలిచ్చునది
వృద్ధా : ప్రాచీనమైనది
బ్రహ్మత్మైక్యస్వరుపినీ : ఆత్మ, పరమాత్మల ఐక్యస్వరూపిణి
బృహతీ : అన్నిటికన్న పెద్దది
బ్రాహ్మణీ : బ్రహ్మఙ్ఞాన స్వరూపిణీ
బ్రాహ్మీ : సరస్వతీ
బ్రహ్మానందా : బ్రహ్మానందస్వరూపిణీ
బలిప్రియా : బలి(త్యాగము) యందు ప్రీతి కలిగినది

భాషారూపా బృహత్సేనా భావాభావ వివర్జితా
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభా గతి:

భాషారూపా : సమస్తభాషలు తన రూపముగా కలిగినది
బృహత్సేనా : గొప్ప సైన్యము కలిగినది
భావాభావ వివర్జితా : భావము, అభావము రెండింటినీ లేనిది
సుఖారాధ్యా : సుఖులైనవారిచే(నిత్యతృప్తులు) ఆరాధింపబడునది
శుభంకరీ : శుభములను కలిగినది
శోభనా : వైభవములను కలిగినది
సులభాగతి: : తేలికగా చేరతగినది

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా
రాజత్కృపా రాజపీథ నివేశితనిజాశ్రితా

రాజరాజేశ్వరీ : ఈశ్వరుని హృదయేశ్వరీ
రాజ్యదాయినీ : రాజ్యములను ఇచ్చునది
రాజ్యవల్లభా : రాజ్యమునకు అధికారిణీ
రాజత్కృపా : అధికమైన కరుణ కలది
రాజపీఠనిశేవితనిజాశ్రితా : తనను ఆశ్రయించినవారిని సిం హాసనము పైన కూర్చొండపెట్టునది

రాజ్యలక్ష్మి: కోశనాధా చతురంగబలేశ్వరీ
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా

రాజ్యలక్ష్మి: : రాజ్యలక్ష్మీ రూపిణీ
కోశనాధా : కోశాగారముకు అధికారిణీ
చతురంగబలేశ్వరీ : చతురంగ బలాలకు (రధ,గజ,తురగ,పదాదులు) అధిపతి
సామ్రాజ్యదాయినీ : సామ్రాజ్యమును ఇచ్చునది
సత్యసంధా : సత్యస్వరూపిణి
సాగరమేఘలా : సముద్రములే వడ్డాణముగా కలిగినది

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ
సర్వార్ధదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ

దీక్షితా : భక్తులను రకించుట యెందు దీక్ష వహించినది
దైత్యశమనీ : రాక్షసులను సం హరించునది
సర్వలోకవశంకరీ : సమస్తలోకములను వశము చేసుకొనునది
సర్వార్ధదాత్రీ : కోరిన కోర్కెలన్నిటినీ తీర్చునది
సావిత్రీ : గాయత్రీ మాత
సచ్చిదానందరూపిణీ : సత్,చిత్, ఆనందములే రూపముగా కలిగినది

దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ

దేశకాలపరిచ్ఛిన్నా : దేశకాలములచే మార్పు చెందినది
సర్వగా : సర్వవ్యాపిని
సర్వమోహినీ : అందరిని మోహింప చేయునది
సరస్వతీ : విద్యాస్వరూపిణి
శాస్త్రమయీ : శాస్త్రస్వరూపిణి
గుహాంబా : కుమారస్వామి తల్లి
గుహ్యరూపిణి : రహస్యమైన రూపము కలిగినది

సర్వోపాధి వినిర్ముక్తా సదాశివపతివ్రతా
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ

సర్వోపాధివినిర్ముక్తా : ఏరకమైన శరీరము లేనిది
సదాశివపతివ్రతా : శివుని భార్య
సంప్రదాయేశ్వరీ : అన్ని సంప్రదాయములకు అధీశ్వరి
సాధ్వీ : సాధుస్వభావము కలిగినది
గురుమండలరూపిణీ : గురుప్రంపరాస్వరూపిణి

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా

కులోత్తీర్ణా : సుషుమ్నా మార్గమున పైకిపోవునది
భగారాధ్యా : త్రికోణ యంత్రమును ఆరాధింపబడునది
మాయా : మాయాస్వరూపిణీ
మధుమతీ : మధురమైన మనస్సు కలది (ఆనందస్వరూపిణీ)
గణాంబా : గణములకు తల్లి
కుహ్యకారాధ్యా : గుహ్యాదులచే ఆరాధింపబడునది
కోమలాంగీ : మృదువైన శరీరము కలిగినది
గురుప్రియా : గురువునకు ప్రియమైనది

స్వతంత్రా సర్వతంత్రేశే దక్షిణామూర్తి రూపిణీ
సనకాదిసమారాధ్యా శివఙ్ఞానప్రదాయినీ

స్వతంత్రా : తన ఇష్టప్రకారము ఉండునది
సర్వతంత్రేశీ : తాను ఉపదేసించిన తంత్రమునకు తానె దేవతైయున్నది
దక్షిణామూర్తిరూపిణీ : దక్షిణామూర్తి రూపము ధరించినది
సనకాది సమారాధ్యా : సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాత సనాతనులు అను దేవఋషులచే ఆరాధింపబడునది
శివఙ్ఞానప్రదాయినీ : ఆత్మఙ్ఞానమును ఇచ్చునది

చిత్కళానందకలికా ప్రేమరూపా ప్రియంకరీ
నామపారాయణాప్రీతా నందివిద్యా నటేశ్వరీ

చిత్కళానందకలికా : ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణీ
ప్రేమరూపా : ప్రేమమూర్తి
ప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునది
నామపారాయణప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినది
నందివిద్యా : అమ్మవారికి సంబందించిన ఓక మంత్ర విశెషము
నటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి

మిధ్యాజగదధిష్తాన ముక్తిదా ముక్తిరూపిణీ
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా

మిధ్యాజగదధిష్టానా : మాయాజగత్తునందు చైతన్యరూపిణియై యుండునది
ముక్తిదా : విముక్తి నిచ్చునది
ముక్తిరూపిణీ : మోక్షరూపిణీ
లాస్యప్రియా : లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది
లయకరీ : జగత్తును లయము చేయునది
లజ్జా : లజ్జాస్వరూపిణీ
రంభాదివందితా : రంభ మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకొనునది

భవదావసుధావృష్టి: పాపారణ్యదవానలా
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా

భవదావసుధావృష్టి: : జన్మపరంపరలు అను దావాగ్నిని చల్లార్చుటకు అమృతవర్షము వంటిది
పాపారణ్యదవానలా : పాపములు అనెడి అరణ్యమునకు కార్చిచ్చు వంటిది
దౌర్భాగ్యతూలవాతూలా : దారిద్ర్యము, దురదృష్టము అనెడి పక్షి ఈకలకు హోరుగాలి వంటిది
జరాధ్వాంతరవిప్రభా : ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది

భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా
రోగపర్వతదంభొళి ర్మృత్యుదారుకుఠారికా

భాగ్యాబ్ధిచంద్రికా : సంపద అనెడి సముద్రమునకు వెన్నెల వంటిది
భక్తచిత్తకేకిఘనాఘనా : భక్తుల మనస్సులు అనే నెమళ్ళకు వర్షాకాలపు మేఘము వంటిది
రోగపర్వతదంభొళి : పర్వతములవంతి రోగములకు వజ్రాయుధము వంటిది
ర్మృత్యుదారుకుఠారికా : మృత్యువనెడి వృక్షమునకు గొడ్డలి వంటిది

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా
అపర్ణా చండికా చండముండాసురనిషూదిని

మహేశ్వరీ : మహేశ్వరుని ప్రియురాలు
మహాకాళీ : కాళికాదేవిరూపము దాల్చినది
మహాగ్రాసా : అధికమైన ఆహారమును కోరునది
మహాశనా : లయకారిణి
అపర్ణా : పార్వతీ దేవి
చండికా : చండికాస్వరూపిణి
చండముండాసురనిషూదిని : చండుడు, ముండుడు అను రాక్షసులను సమ్హరించినది

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా

క్షరాక్షరాత్మికా : నశించునట్టి జగత్తు, శాశ్వతమైన చిన్మయ తత్వము రెండూను తానె రూపంగా ఐనది
సర్వలోకేశీ : అన్ని లొకములకు అధీశ్వరి
విశ్వధారిణీ : విశ్వమును ధరించినది
త్రివర్గదాత్రీ ; దర్మ, అర్ధ, కామములను ఇచ్చునది
సుభగా : సౌభాగ్యవతి
త్ర్యంబకా : మూడు కన్నులు కలది
త్రిగుణాత్మికా : సత్వ, రజో, తమో గుణములను ఇచ్చునది

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్ప నిభాకృతి:
ఓజోవతీ ద్యుతిధరా యఙ్ఞరూపా ప్రియవ్రతా

స్వర్గాపవర్గదా : స్వర్గమును, మోక్షమును కూడా ఇచ్చునది
శుద్ధా : పరిశుద్ధమైనది
జపాపుష్ప నిభాకృతి: : జపాపుష్పములవలె ఎర్రని ఆక్ర్తి కలది
ఓజోవతీ : తేజస్సు కలిగినది
ద్యుతిధరా : కాంతిని ధరించినది
యఙ్ఞరూపా : యఙ్ఞము రూపముగా కలిగినది
ప్రియవ్రతా : ప్రియమే వ్రతముగా కలిగినది

దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా

దురారాధ్యా ; కష్ట సాధ్యమైన ఆరాధన కలిగినది
దురాధర్షా : చుచూటకు కష్ట సాధ్యమైనది
పాటలీకుసుమప్రియా : పాటలీపుష్పమునందు ప్రీతి కలిగినది
మహతీ : గొప్పదైనది
మేరునిలయా : మేరుపర్వతము నివాసముగా కలిగినది
మందారకుసుమప్రియా : మందారపువ్వులు అంటే ప్రీతి కలిగినది

వీరారాధ్యా విరాద్రూపా విరజా విశ్వతోముఖీ
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రణదా ప్రాణరూపిణీ

వీరారాధ్యా : వీరులచే ఆరాధింపబదునది
విరాద్రూపా : అన్నింతికీ మూలమైనది
విరజా : రజోగుణము లేనిది
విశ్వతోముఖీ : విశ్వం అంతటినీ ఒకేసారి చూడగల్గిన ముఖము కలిగినది
ప్రత్యగ్రూపా : నిరుపమానమైన రూపము కలిగినది
పరాకాశా : భావనామాత్రమైన ఆకాశ స్వరూపిణి
ప్రణదా : సర్వజగత్తుకూ ప్రాణము ను ఇచ్చునది
ప్రాణరూపిణీ : జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్య స్తరాజ్యధూ:
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా

మార్తాండభైరవారాధ్యా : మార్తాండభైరవునిచే ఆరాధింపబడునది (శివుని యొక్క ఒకరూపం మార్తాండభైరవుడు)
మంత్రిణీ : శ్యామలాదేవి
న్య స్తరాజ్యధూ: రాజ్యాధికారము ఇచ్చునది
త్రిపురేశీ ; త్రిపురములకు అధికారిణి
జయత్సేనా : అందరినీ జయించగల సైన్యము కలది
నిస్త్రైగుణ్యా : త్రిగుణాతీతురాలు
పరాపరా : ఇహము, పరము రెండునూ తానై యున్నది

సత్యఙ్ఞానానందరూపా సామరస్యాపరాయణా
కపర్ధినీ కళామాలా కామధుక్ కామరూపిణీ

సత్యఙ్ఞానానందరూపా : సచ్చిదానందరూపిణీ
సామరస్యాపరాయణా : జీవుల యెడల సమరస భావముతో ఉండునది
కపర్ధినీ : జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు కలదు)
కళామాలా : కళల యొక్క సమూహము
కామధుక్ : కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది
కామరూపిణీ : కోరిన రూపము ధరించునది

కళానిధి: కావ్యకళా రసఙ్ఞా రసశేవధి:
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా
కళానిధి: : కళలకు నిధి వంటిది
కావ్యకళా : కవితారూపిణి
రసఙ్ఞా : సృష్టి యందలి సారము తెలిసినది
రసశేవధి: : రసమునకు పరాకాష్ట
పుష్టా : పుష్ఠి కలిగించునది
పురాతనా ; అనాదిగా ఉన్నది
పూజ్యా ; పూజింపదగినది
పుష్కరా : పుష్కరరూపిణి
పుష్కరేక్షణా ; విశాలమైన కన్నులు కలది

పరంజ్యోతి: పరంధామ పరమాణు: పరాత్పరా
పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదినీ

పరంజ్యోతి: : దివ్యమైన వెలుగు
పరంధామ : శాశ్వతమైన స్థానము కలిగినది
పరమాణు: : అత్యంత సూక్ష్మమైనది
పరాత్పరా : సమస్తలోకములకు పైన ఉండునది
పాశహస్తా : పాశమును హస్తమున ధరించినది
పాశహంత్రీ : జీవులను సంసార బంధము నుంది విడిపించునది
పరమంత్ర విభేదినీ : శత్రువుల మంత్రప్రయోగములను పటాపంచలు చేయునది

మూర్తామూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ

మూర్తామూర్తా : రూపం కలది, రూపం లేనిది రెందూ తానే ఐనది
నిత్యతృప్తా : ఎల్లప్పుదు తృప్తితో ఉండునది
మునిమానసహంసికా : మునుల మనస్సులనెడి సరస్సులందు విహరించెడి హంసరూపిణి
సత్యవ్రతా : సత్యమే వ్రతముగా కలిగినది
సత్యరూపా : సత్యమే రూపముగా కలిగినది
సర్వాంతర్యామినీ : సృష్టీ అంతటా వ్యాపించినది
సతీ : దక్షప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి ఐన సతీదేవి

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా
ప్రసవిత్రీ ప్రచండాఙ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి:

బ్రహ్మాణీ : సరస్వతీ దేవి (బ్రహ్మదేవుని భార్య)
బ్రహ్మజననీ : బ్రహ్మడేవుడిని సృస్టించినది
బహురూపా : సమస్త రూపములు తానై ఉన్నది
బుధార్చితా : ఙ్ఞానులచే పూజింపబదునది
ప్రసవిత్రీ : జగజ్జనని
ప్రచండాఙ్ఞా : తీవ్రమైన ఆఙ్ఞ కలది
ప్రతిష్టా : కీర్తియే రూపముగా కలిగినది
ప్రకటాకృతి: : బహిరంగమైన ఆకారము కలిగినది

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూ:

ప్రాణేశ్వరీ : ప్రాణములకు అధీశ్వరి
ప్రాణదాత్రీ : ప్రాణములు ఇచ్చునది
పంచాశత్పీఠరూపిణీ : శక్తిపీఠముల రూపమున వెలసినది
విశృంఖలా : యధేచ్ఛగా ఉండునది
వివిక్తస్థా : ఏకాంతముగా ఉండునది
వీరమాతా : వీరులకు తల్లి
వియత్ప్రసూ: : ఆకాశమును సృష్టించినది

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ
భావఙ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ

ముకుందా : విష్ణు రూపిణీ
ముక్తినిలయా : ముక్తికి స్థానమైనది
మూలవిగ్రహరూపిణీ : అన్నింటికీ మూలమైనది
భావఙ్ఞా : సర్వజీవుల మానసిక భావములను తెల్సినది
భవరోగఘ్నీ : జన్మపరంపర అను రోగమును పోగొట్టునది
భవచక్రప్రవర్తినీ : లోకచక్రమును నదిపించునడి

ఛంద:సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ
ఉదారకీర్తి రుద్దమవైభవా వర్ణరూపిణీ

ఛంద:సారా : వేదముల సారము
శాస్త్రసారా : వేదాంతాది సమస్త శాస్త్రముల సారము
మంత్రసారా : మంత్రముల యొక్క సారము
తలోదరీ : పలుచని ఉదరము కలిగినది
ఉదారకీర్తి : గొప్ప కీర్తి కలిగినది
రుద్దమవైభవా : అధికమైన వైభవము కలిగినది
వర్ణరూపిణీ : అక్షరరూపిణి

జన్మమృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయినీ
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా

జన్మమృత్యుజరాతప్త : చావు, పుట్టుకలు, ముసలితనము మొదలైన వాటితో బాధపడు
జన : జనులు
విశ్రాంతిదాయినీ : విశ్రాంతి ని ఇచ్చునది
సర్వోపనిషదుద్ఘుష్టా : అన్ని ఉపనిషత్తులచే చాటిచెప్పబడినది
శాంత్యతీతకళాత్మికా : శాంతికంటే అతీతమైన చిదానందస్వరూపిణి (సంకల్ప, వికల్ప, రాగద్వేషములు లేని మానసిక స్థితి "శాంతి", ఆనందము దానిని మించినది)

గంభీరా గగనాంతస్తా గర్వితా గానలోలుపా
కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధ విగ్రహ

గంభీరా : లోతైనది (అమ్మణ్ణి తత్వము తెల్సుకొనుట కష్టము)
గగనాంతస్తా : ఆకాశమునందు ఉండునది
గర్వితా : గర్వము కలిగినది
గానలోలుపా : సంగీతమునందు ప్రీతి కలిగినది
కల్పనారహితా : ఎట్టి కల్పన లేనిది
కాష్ఠా : కాలపరిగణన లో అత్యంత స్వల్పభాగము (రెప్పపాటుకన్న తక్కువ సమయం)
కాంతా : కాంతి కలిగినది
కాంతార్ధ విగ్రహ ; కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము

శ్రీ లలితా సహస్రనామం ( ప్రతిపద అర్ధం) (91-130)

తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్ఠితా
నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ

తత్త్వాసనా : తత్వమే అసనంగా కలిగినది
తత్
: పరమాత్మ
త్వం : జీవాత్మ
యీ : ఐక్యత
పంచాకోశాంతరస్థితా : పంచకోశములు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విఙ్ఞాన మయ, ఆనందమయ ) లో ఉండునది
నిస్సీమమహిమా : హద్దులు లేని మహిమ కలిగినది
నిత్యయౌవనా : ఎల్లప్పుడు తరుణ వయస్సులో ఉండునది
మదశాలినీ : ఆనంద తన్మయత్వమున ఉండునది

మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూ:
చందనద్రవదిగ్దాంగీ చాంపేయకుసుమప్రియా

మదఘూర్ణిత రక్తాక్షీ : యోగసమాధి వలన ఎర్రనైన కన్నులు కలిగినది
మదపాటలగండభూ: : యోగసమాధి వలన ఎర్రనైన చెక్కిళ్ళు కలది
చందనద్రవదిగ్ధాంగి : చందన తైలము పూయబడిన శరీరము కలది
చాంపేయకుసుమ ప్రియా : సంపెంగ పూలయందు ఇష్టము కలది

కుశలాకోమలాకారా కురుకుళ్ళా కుళేశ్వరీ
కుళకుండలయా కౌళమార్గతత్పరసేవితా

కుశలా : నేర్పు కలది
కోమలాకారా : మృదువైన రూపము కలిగినది
కురుకుళ్ళా : సుషుమ్నా మార్గమున విహరించు కుండలినీ శక్తి
కుళేశ్వరీ : కుండలినీ శక్తీ
కుళకుండాలయా : మూలాధారము నివాసంగా కలిగినది
కౌళమార్గతత్పరసేవితా : కౌళమార్గ తత్పరులచే సేవించబడినది
(కౌళమార్గము, సమయమార్గము అను రెండు పూజా విధములు కలవు)

కుమారగణనాధాంబా తుష్టి: పుష్టి ర్మతి ర్ద్ధృతి:
శాంతి: స్వస్తిమతీ కాంతి ర్నందినీ విఘ్ననాశినీ

కుమారగణనాధాంబా : కుమారస్వామి, గణపతుల యొక్క తల్లి
తుష్టి: : తృప్తి
పుష్టి: : శక్తి
మతి: : బుద్ధి
ధృతి: : ధైర్యము
శాంతి: : మనశ్శాంతి
స్వస్తిమతీ : నిర్వికల్పమైన మనస్సు
కాంతి: : వెలుగు
నందినీ : ఆనందపరచునది
విఘ్ననాశినీ : విఘ్నము లేకుండా చేయునది

తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ

తేజోవతీ : తేజస్సు కలిగినది
త్రినయనా : మూడు కన్నులు కలది
లోలాక్షీకామరూపిణీ : కదులుచున్న కన్నులతో కోరిన రూపం ధరించకలిగినది
మాలినీ : పుష్పమాలికలను ధరించునది
హంసినీ : జీవుల ఉచ్చ్వాస నిశ్వాసాల రూపిణి
మాతా : సర్వోకములకు తల్లిమలయాచల నివాసినీ : మలయ పర్వతములను నివాసంగా చేసుకొన్నది

సుముఖీ నళినీ సుభ్రూ: శోభనా సురనాయికా
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ

సుముఖీ : మంచి ముఖము కలది
నళినీ : పద్మమునందు నివసించునది
సుభ్రు: : అందమైన కనుబొమ్మలు కలది
శోభనా : వైభవము కలిగినది
సురనాయికా : దేవతలకు అధీశ్వరి
కాలకంఠీ : కాలమును కంఠము ధరించునది
కాంతిమతీ : కాంతి కలిగినది
క్షోభిణీ : కష్టములు కలుగచేయునది (రాక్షసులను బాధించునది)
సూక్ష్మ రూపిణీ : సూక్ష్మరూపం కలది

వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్ఠా వివర్జితా
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ

వజ్రేశ్వరీ : వజ్రాయుధమును ధరించినది
వామదేవి : వామదేవుని శక్తి
వయోవస్థా వివర్జితా : వయసుచే కలుగు మార్పులు లేనిది (నిత్యయవ్వనవతి)
సిద్దేశ్వరీ : సిద్దులచే ఆరాదింపబడునది
సిద్ధమాతా : సిద్ధులకు తల్లివంటిది
యశస్వినీ : కీర్తి కలిగినది.

విశుద్ధిచక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనా
ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా

విశుద్ధచక్ర నిలయా : విశుద్ధ చక్రమున నివసించునది
రక్తవర్ణ : ఎర్రని రంగు కలది
త్రిలోచనా : మూడు కన్నులు కలది ( ఈశ్వరీ)
ఖట్వాంగాది ప్రహరణా : ఖట్వాంగము మొదలైన ఆయుధములు ధరించినది
వదనైక సమన్వితా : ఒకే ముఖము కలిగినది

పాయసాన్నప్రియా త్వక్ స్థా పశులోకభయంకరీ
అమృతాదిమహాశక్తి సంవృతా డాకినీశ్వరీ

పాయస్సన్నప్రియా : పాయసము (పరమాన్నము) అంటే ఇష్టం కలిగినది
త్వక్ స్థా : చర్మము నందు ఉండునది
పశులోక భయంకరీ : పశులోకమునకు (అజ్గ్యానులకు ) భయమును కలిగించునది
అమృతాదిమహాశక్తి సంవృతా : అమృతము మొదలగు శక్తి గుణములచే కూడియున్నది
డాకినీశ్వరీ : విశుద్ధ చక్రముకు అధిదేవత "డాకినీ" దేవత

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా
దం ష్ట్రోజ్జ్వలా క్షమాలాదిధరా రుధిర సంస్థితా

అనాహతాబ్జనిలయా : అనాహత చక్రము నందు ఉండునది
శ్యామాభా : చామనఛాయ కాంతి కలది
వదనద్వయ : రెండు ముఖములు కలది
దంష్ట్రోజ్జ్వలా : కాంతి కలిగిన దంతములు (కోరలు) కలది
అక్షమాలాదిధారా : జపమాల ధరించినది
రుధిరసంస్థితా : రక్తము స్థానముగా కలిగినది

కాలరాత్రాది శక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్రవరా రాకిన్యాంబస్వరూపిణీ

కాళరాత్ర్యాది శక్త్యౌ ఘవృతా : కాళరాత్రి మొదలైన శక్తుల సమూహముచే పరివేష్టింపబడునది
స్నిగ్దౌదనప్రియా : నేతి అన్నం అంటే ఇష్టపడేది
మహావీరేంద్రవరదా : మహావీరులకు వరములు ఇచ్చునది
రాకిన్యంబాస్వరూపిణీ : రాకిని అమ్మణ్ణి స్వరూపం కలిగినది

మణిపూరాబ్జనిలయా వదనత్రయసమ్యుతా
వజ్రాదికాయుధొపేతా డామర్యాదిభిరావృతా

మణిపూరాబ్జ నిలయా : మణిపూరక చక్రం (నాభి స్థానం) నందు నివసించునది
వదనత్రయ సంయుతా : మూడు ముఖములు కలది
వజ్రాదికాయుదోపేతా : వజ్రము మొదలగు ఆయుధములు ధరించినది
డార్యాదిభిరావృతా : డామరి మొదలగు శక్తులచే పరివేష్టించబడినది

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా
సమస్తభక్త సుఖదా లాకిన్యాంబస్వరూపిణీ

రక్తవర్ణా : ఎర్రనిరంగు కలిగినది
మాంసనిష్ఠా : మాసమునందు ఉండునది
గూడాన్నప్రీతమానసా : చక్కెరపొంగలి ఇష్టముగా కలిగినది
సమస్తభక్తసుఖదా : భక్తులకు సమస్త సుఖములను ఇచ్చునది
లాకిన్యాంబస్వరూపిణీ : లాకిన్యాంబస్వరూపము కలిగినది

స్వాధిష్టానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాతిగర్వితా

స్వాదిష్ఠానంబుజగతా : స్వాధిష్టా పద్మమున ఉండునది
చతుర్వక్త్ర మనోహరా : అందమైన నాలుగు ముఖములు కలది
శూలాద్యాయుధ సంపన్న : త్రిశూలము మొదలగు ఆయుధములు కలిగినది
పీతవర్ణా : పసుపుపచ్చని రంగు
అతిగర్వితా : గర్వము (ఠీవి) ఎక్కువగా కలది

మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా
దధ్యన్నసక్తహృదయా కాకినీరూపధారిణీ

మేధోనిష్ఠా : నిష్టపరాయణురాలు
మధుప్రీతా : తేనె ని ఇష్టపడేది
బందిన్యాదిసమన్వితా : "బందిని" మొదలగు శక్తులచే కూడియున్నది
దధ్యన్నా సక్త హృదయా : పెరుగన్నం(దద్దోజనం) అన్న ఇష్టముగా ఉండునది
కాకినీ రూపధారిణీ : కాకినీ రూపం ధరించినది

మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థిసంస్థితా
అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా

మూలాధారాంబుజారూఢా : మూలాధార చక్రమునండు స్థిరముగా ఉండునది
పంచవక్త్రా : ఐదు ముఖములు కలిగినది
అస్థిసంస్థితా : ఎముకల యందు ఉండునది
అంకుశాదిప్రహరణా : అంకుశము మొదలగు ఆయుధములను ధరించునది
వరదాదినిషేవితా : వరద మొదలగు శక్తుల చే సేవించబడునది

ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యాంబస్వరూపిణీ
ఆఙ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా

ముద్గౌదనాసక్త చిత్తా : పెసరపప్పు పులగం మొదలైన వాటి యందు ఇష్టము కలిగినది
సాకిన్యాంబస్వరూపిణీ : శాకిని అమ్మణ్ణి రూపం ధరించినది
ఆజ్గ్యాచక్రాబ్జ నిలయా : భ్రూమధ్యమున కల ఆజ్గ్యా చక్రమున నివసించునది
శుక్లవర్ణా : తెల్లని రంగు కలిగినది
షడాననా : ఆరు ముఖమూ కలిగినది

మజ్జసంస్ఠా హంసవతీ ముఖ్యశక్తిసమన్వితా
హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ

మజ్జాసంస్థా : ఎముకలలోని మూలుగు నందు ఉండునది
హంసవతీముఖ్యశక్తి సమన్వితా : హంసవతి మొదలగు శక్తులతో కూడినది
హరిద్రాన్నైక రసికా : పులిహోర అనిన ఇష్టము కలిగినది
హాకినీరూపదారిణీ : హాకినీరూపము ధరించునది

సహస్రదళపద్మస్ఠా సర్వవర్ణోపశోభితా
సర్వాయుధదరా శుక్ల సంస్ఠితా సర్వతోముఖీ

సహస్రదళ పద్మస్థా : సహస్రార చక్రమను పద్మమున నివసించునది
సర్వవర్ణోప శోభితా : అనేక రంగులతో శోభిల్లుచున్నది
సర్వాయుధధరా : అన్ని ఆయుధములను ధరించినది
శుక్లసంస్థితా : శుక్ల దాతువునందు ఉండునది
సర్వతోముఖీ : అన్నివైపులా ముఖము కలిగినది

సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యాంబాస్వరూపిణీ
స్వాహా స్వధా మతిర్మేధా శ్రుతి: స్మృతి రనుత్తమా

సర్వౌదన ప్రీతచిత్తా : అన్నిరకముల అన్నములందు ప్రీతీ కలిగినది (పాయసాన్నము,చిత్రాన్నము మొదలగున్నవి)
యాకిన్యంబాస్వరూపిణీ : యాకినీ అమ్మవారి రూపం కలిగినది
స్వాహా : స్వాహా దేవి (అగ్ని దేవుని భార్య)
స్వధా : స్వధారూపిణీమతి: : మనస్సు
మేధా : బుద్ధి
శ్రుతి: : ఙ్ఞాపకము
స్మృతి: : వేదముల యెందు సూత్రప్రాయంగా వివరించు ధర్మములను, వివరించు గ్రంధములు
అనుత్తమ : శ్రేష్టురాలు

పుణ్యకీర్తి: పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలుకా

పుణ్యకీర్తి: : పుణ్యకార్యములు చేయువానిచే కీర్తించపడునది
పుణ్యలభ్య : పుణ్యముచే లభించునది
పుణ్యశ్రవణ కీర్తన : పుణ్యప్రదమైన శ్రవణ కీర్తనలు కలది
పులోమజార్చితా : పులోముని కుమర్తె సచీదేవి చే పూజింపబడునది
బంధమోచనీ : భవబంధములనుండి విడిపించునది
బంధురాలకా : దట్టమైన కురులు కలది

విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూ:
సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ

విమర్శరూపిణీ : విమర్శనాత్మకమైన రూపము కలది
విద్యా : శ్రీ విద్య
వియదాది జగత్ర్పసూ: : పంచభూతాత్మికమైన ఈ జగత్తుకు తల్లి
సర్వవ్యాధి ప్రశమనీ : అన్ని వ్యాధులను పొగ్గొట్టునది
సర్వమృత్యు నివారిణీ : జన్మపరంపర లేకుండ చేయునది

అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా

అగ్రగణ్యా : అందరికన్నా ముందు పూజింప దగునది
అచింత్యరూప : ఊహకు అందని రూపు కలిగినది
కలికల్మషనాశిణీ : కలియుగం లో ని పాపములను నాశనము చేయునది
కాత్యాయని : పార్వతీ దేవి
కాలహంత్రీ : కాలప్రభావమునకు లోనుకానిది
కమలాక్షనిషేవితా : మహా విష్ణువు చే పూజింపబడుచున్నది

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ

తాంబూలపూరిత ముఖీ : తాంబూలముతో కూడిన నోరు కలది
దాడిమీకుసుమప్రభా : దాన్నిమ్మ పువ్వు కంటే యెర్రని కాంతి కలది
మృగాక్షి : సోగ కన్నులు కలది
మోహినీ : మొహింపచేయునది
ముఖ్యా : ముఖ్యురాలు
మిత్రరూపిణీ : భక్తుల యెడల మిత్రభావము కలది

నిత్యతృప్తా భక్తనిద్ధి ర్నియంత్రీ నిఖిలేశ్వరీ
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ

నిత్యతృప్తా : ఎల్లప్పుడూ తృప్తిగా ఉండునది
భక్తనిధి: : భక్తులకు నిధి వంటిది
నియంత్రి : దేవాధిదేవతలను తన ఆధీనములో ఉంచుకొనునది
నిఖిలేశ్వరీ : అన్నింటికి అధికారిణీ
మైత్ర్యాదివాసనాలభ్యా : ఆప్తభావముచే లభించునది
మహాప్రళయ సాక్షిణీ : మహాప్రళయమందు బ్రహ్మాది దేవతలతో పాటు సమస్త సృష్టి అంతరించుటను చూసిన ఏకైక సాక్షి

పరాశక్తి: పరానిష్టా ప్రఙ్ఞాన ఘనరూపిణీ
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ

పరాశక్తి : మూలకారణశక్తి
పరానిష్టా : పరతత్వమునందలి నిష్ట
ప్రఙ్ఞానఘనరూపిణీ : ఆత్మ ఙ్ఞానస్వరూపిని
మాధ్వీపానాలసా : సమాధి స్ఠీతి ఎందు దేహభావము నశించి ఆత్మభావము కలిగినది
మత్తా : బ్రహ్మానందమును పొందునది
మాతృకావర్ణరూపిణీ : "ఆ"నుండి "క్ష" వరకు కల అక్షరములను మాతృకలు అంటారు. అమ్మణ్ణి అక్షరరూపిణీ

మహాకైలాసనిలయా మృణాళమృదుదోర్లతా
మహనీయా దయామూర్తి ర్మహాసామ్రాజ్యశాలినీ

మహాకైలాసనిలయా : సహస్రారమే (కైలాసము) నివాసముగా కలది
మృణాళమృదుదోర్లతా : తామరతూడులు వంటి మృదువైన బాహువులు కలది
మహనీయా : మహిమ కలది
దయామూర్తి: : రూపుదాల్చిన దయ
మహాసామ్రాజ్యశాలినీ : గొప్ప సామ్రాజ్యము కలది

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా
శ్రీ షోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా

ఆత్మవిద్యా : వేదాంత విద్య
మహావిద్యా : బ్రహ్మవిద్య
శ్రీవిద్యా : శ్రీవిద్యా స్వరూపిణీ
కామసేవితా : మన్మధుని చే సేవించబడుచున్నది
శ్రీషోడశాక్షరీవిద్యా : 16అక్షరములు కల శ్రీవిద్యా మంత్రమే స్వరూపముగా కలది
త్రికూటా : మూడు కూటములు కలిగినది (వాగ్భవ, మధ్య, శక్తి)
కామకోటికా : మోక్షమునందు కోరిక కలిగినది

కటాక్షకింకరీభూత కమలాకోటిసేవితా
శిర:స్థితా చంద్రనిభా ఫాలస్థేంద్ర ధను:ప్రభా

కటాక్షకింకరీభూత : అమ్మవారి క్రీకంతి చుపుకై ఎదురుచుస్తున్న కోటిమంది లక్ష్మీ దేవులచే సేవించబదుచున్నది
శిర:స్థితా : శిరస్సునందు ఉండునది
చంద్రనిభా : చంద్రునివంటి కాంథి కలిగినది
ఫాలస్థా : నుదుటి యెందు ఉండునది
ఇంద్రధను:ప్రభా : ఇంద్రధనుస్సు వంటి కాంతి కలిగినది

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా
దాక్ష్యాయణీ దైత్యహంత్రీ దక్షయఙ్ఞవినాశినీ

హృదయస్ఠా : హృదయస్ఠానమున ఉండునది
రవిప్రఖ్యా : సూర్యుని కాంతి కలిగినది
త్రికోణాంతరదీపికా : మూలాధార చక్రమును వెలిగించునది
దాక్ష్యాయణీ : దక్ష్యప్రజాపతి కూతురు
దైత్యహంత్రీ : రాక్షసులను సం హరించునది
దక్షయఙ్ఞ వినాశినీ : దక్షుడి యఙ్ఞ వినాశమునకు కారకురాలు

దరాందోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ
గురుమూర్తి ర్గుణనిధి ర్గోమాత గుహజన్మభూ:

దరాందోళితదీర్ఘాక్షీ : ఒక కొననుండి మరొక కొన కు కదులుచున్న విశాలమైన నేత్రములు కలది
దరహాసోజ్వలన్ముఖీ : చిరునవ్వుచే ప్రకాశవంతమైన ముఖము కలిగినది
గురుమూర్తి : జగత్తునకు గురుస్ఠానమైనది
గుణనిధి: : అన్ని గుణములకు నిధివంటిది
గోమాతా : గోమాత
గుహజన్మభూ: : సుబ్రహ్మణ్యేశ్వరుని తల్లి

దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ
ప్రతిపన్ముఖ్యరాకాంత తిధి మండలపూజితా

దేవేశీ : దేవతలకు అధికారిణి
దండనీతిస్ఠా : దండనీతి యెందు ఉండునది
దహరాకాశరూపిణీ : దహరాకాశమే రూపముగా కలిగినది
ప్రతిపన్ముఖ్యరాకాంతతిధిమండల పూజితా : కృష్ణపాడ్యమి నుండి పూర్ణిమ వరకు గల అన్ని తిధులలొ పూజింపబడునది

కళాత్మికా కళానాధా కావ్యాలాపవినోదినీ
సచామరారమావాణీ సవ్యదక్షిణ సేవితా

కళాత్మికా : షోడశకళాప్రపూర్ణమైనది
కళానాధా : కళలకు అధికారిణి
కావ్యాలాపవినోదినీ : కావ్యములు చదువుట, వినుటయందు ఆసక్తి కలిగినది
సచామర : వింజామర
రమావాణీ : లక్ష్మీదేవి, సరస్వతీదేవి
సవ్యదక్షిణసేవితా : ఇరుప్రక్కలా విసురుచుండగా సేవించబడుచున్నది

ఆదిశక్తి రమేయాత్మా పరమాపావనాకృతి :
అనేకకోటి బ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా

ఆదిశక్తి: : సృష్టి ఆరంభమునకు మూలకారణమైన శక్తి
అమేయ : అనంతమైనది
ఆత్మా : ఆత్మస్వరూపిణె
పరమా : సర్వాధికురాలు
పావనాకృతి: : పవిత్రమైన రూపము కలిగినది
అనేకకోటిబ్రహ్మండ జననీ : కోటానుకోట్ల బ్రహ్మండములకు తల్లి
దివ్య విగ్రహా : దివ్యమైన రూపము కలిగినది

క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి స్త్రి దశేశ్వరీ

క్లీంకారీ : క్లీం అనే బీజాక్షర రూపిణి
కేవలా : సమస్త సృష్టి లయమైనను మిగిలియున్నది
గుహ్యా : గుప్తమైనది
కైవల్యపదదాయినీ : మోక్షమును ఇచ్చునది
త్రిపురా : త్రిపురసుందరి
త్రిజగద్వంద్యా : ముల్లోకములచే పూజింపబడుచ్చున్నది
త్రిమూర్తి: : త్రిమూర్తిస్వరూపిణీ
త్రిదశేశ్వరీ : బ్రహ్మాది దేవతలకు అధికారిణి

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచింతా
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వ సేవితా

త్ర్యక్షరీ : ఐం, హ్రీం, శ్రీం అను బీజాక్షర స్వరూపిణి
దివ్యగంధాఢ్యా : దివ్యమైన వాసన కలిగినది
సిందూరతిలకాంచితా : ఎర్రని తిలకమును ధరించునది
ఉమా : పార్వతీదేవి
శైలేంద్రతనయా : శైలపుత్రి (పార్వతి)
గౌరీ : గౌరవర్ణము కలిగినది (పార్వతి)
గంధర్వసేవితా : గంధర్వులచే పూజింపబడుచ్చున్నది

విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ
ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా ఙ్ఞానదా ఙ్ఞానవిగ్రహా

విశ్వగర్భా : విశ్వమును గర్భమునందు ధరించినది
స్వర్ణగర్భా : బంగారమును గర్భమున ధరించినది
వరదా : వరములు ఇచ్చునది
వాగధీశ్వరీ : వాక్కులకు అధీశ్వరీ
ధ్యానగమ్యా : ద్యానముచే చేరదగినది
అపరిచ్చేద్యా : భాగింపరానిది
ఙ్ఞానదా : ఙ్ఞానమును ఇచ్చునది
ఙ్ఞానవిగ్రహా : ఙ్ఞానమే స్వరూపముగా కలిగినది

సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ
లోపాముద్రార్చితా లీలాక్లుప్తబ్రహ్మాండమండలా

సర్వవేదాంతసంవేద్యా : సమస్త వేదాంతములచే తెలియబడునది
సత్యానందస్వరూపిణీ : సత్యము, ఆనందము స్వరూపముగా కలిగినది
లోపాముద్రార్చితా : అగస్త్యుని భార్యైన లోపాముద్రచే పూజింపబడునది
బ్రహ్మాండమండలా: బ్రహ్మాండములను సృస్టించి లయము చేయుటయే క్రీడగా కలిగినది

ఆదృశ్యాదృశ్యరహితా విఙ్ఞాత్రీ వేద్తవర్హుతా
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా

ఆదృశ్యా : కంటికి కనపడునది
దృశ్యరహితా : ఆకారము లేనిది
విఙ్ఞాత్రీ : సమస్తమూ తేలిసినది
వేదవర్జితా : సర్వమూ తెలిసినది
యోగినీ : యోగమున ఉండునది
యోగదా : యోగములను ఇచ్చునది
యోగ్యా : యోగమే రూపముగా కలిగినది
యోగానందా : యోగమునందు లభించు ఆనందము
యుగంధరా : యుగములను ధరించునది

ఇచ్ఛా శక్తి ఙ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ
శర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ

ఇఛ్చాశక్తి : చేయవలెను అనే సంకల్పము
ఙ్ఞానశక్తి : ఙ్ఞానము (ఆలోచన) కలిగిన
క్రియాశక్తి : ఆచరించే సామర్ధ్యము
స్వరూపిణీ : స్వరూపంగా కలది
సర్వాధారా : అన్నింటికీ ఆధారభూతమైనది
సుప్రతిష్టా : స్ఠిరముగా ఉండునది
సదసద్రూపధారిణీ : బ్రహ్మపదార్ధము, జగత్తూ తానై ఉన్నది