Monday, March 16

దండాయుధపాణి స్తుతి

చణ్డ పాపహర పాదసేవనం
గణ్డశోభి వరకుండలద్వయం
దణ్డితాఖిల సురారిమండలం
దణ్డపాణి మనిశం విభావయే

కామనీయక వినిర్జితాంగజం
రామలక్ష్మణకరాంబుజార్చితం
కోమలాంగమతి సుందరాకృతిం
దణ్డపాణి మనిశం విభావయే

దండాయుధపాణి అయిన సుబ్రహ్మణ్యుని స్తుతి ఇది. పాదాలను సేవించు భక్తుల తీవ్ర పాపాలను హరించేవాడు, చెవుల కుండలాల కాంతుల చెక్కిళ్లలో ప్రతిఫలించి ప్రకాసిస్తున్న రమణీయ వదనం కలవాడు, సమస్త రాక్షస సమూహాన్ని దండించే దండపాణి నిరంతర విశేషంగా భావిస్తున్నాను. మన్మధుని మించిన మంగళత్వం కలవాడు, రామలక్ష్మణుల చేత పూజింపబడినవాడు, కోమలాంగుడు, అతిసుందరమైన ఆకృతి కలవాడు అయిన దణ్డపాణిని ఎల్లవేళలా భావిస్తున్నాను.