Showing posts with label అక్షయతృతీయ. Show all posts
Showing posts with label అక్షయతృతీయ. Show all posts

Sunday, May 16

అక్షయ తృతీయ

అక్షయం అంటే క్షయము లేనిది. జీవితంలో అన్నింటిని అక్షయం చేసే పర్వదినం కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ నాడు ఈ పండుగను జరుపుకొంటాము. ఈ పండుగ గురించి, ఆచరించాల్సిన విధి విధానాలను గురించి భవిష్య, శివ పురాణాలలో వివరించారు. వైశాఖ శుద్ధ తదియ నాడు కృతయుగం, కార్తీక శుక్ల నవమినాడు త్రేతాయుగం, భాద్రపద బహుళ త్రయోదశి నాడు ద్వాపరయుగం, మాఘబహుళ అమావాస్య నాడు కలియుగం ఆరంభమైనదని విష్ణు పురాణం చెబుతోంది. కృతయుగం ప్రారంభమైన రోజున అక్షయతృతీయగా జరుపుకొంటారు. బదరి నారాయణస్వామి ఆలయాన్ని ఈ రోజున తెరుస్తారు. ఉత్తర భారతంలో ఈ పండుగనాడు లక్ష్మీదేవి పూజ చేస్తారు. అక్షయతృతీయ నాడు బంగారం కొనుగోలు చేసి ఇంటికి తెచుకొంటే లక్ష్మీదేవి ఆయా గృహాల్లో స్థిరనివాసం ఏర్పరచుకొంటుందని పలువురి నమ్మకం.