Showing posts with label సుబ్రహ్మణ్యస్వామి. Show all posts
Showing posts with label సుబ్రహ్మణ్యస్వామి. Show all posts

Monday, March 16

దండాయుధపాణి స్తుతి

చణ్డ పాపహర పాదసేవనం
గణ్డశోభి వరకుండలద్వయం
దణ్డితాఖిల సురారిమండలం
దణ్డపాణి మనిశం విభావయే

కామనీయక వినిర్జితాంగజం
రామలక్ష్మణకరాంబుజార్చితం
కోమలాంగమతి సుందరాకృతిం
దణ్డపాణి మనిశం విభావయే

దండాయుధపాణి అయిన సుబ్రహ్మణ్యుని స్తుతి ఇది. పాదాలను సేవించు భక్తుల తీవ్ర పాపాలను హరించేవాడు, చెవుల కుండలాల కాంతుల చెక్కిళ్లలో ప్రతిఫలించి ప్రకాసిస్తున్న రమణీయ వదనం కలవాడు, సమస్త రాక్షస సమూహాన్ని దండించే దండపాణి నిరంతర విశేషంగా భావిస్తున్నాను. మన్మధుని మించిన మంగళత్వం కలవాడు, రామలక్ష్మణుల చేత పూజింపబడినవాడు, కోమలాంగుడు, అతిసుందరమైన ఆకృతి కలవాడు అయిన దణ్డపాణిని ఎల్లవేళలా భావిస్తున్నాను.      

Friday, October 28

నాగులచవితి

మన దేశంలో అతిప్రాచీనమైన పూజ నాగారాధన. ఇంద్రునికి శతృవైన వృత్రుడు నాగజాతివాడు, సర్పదేవతలకు రాజు సహస్రగుణుడైన అనంతుడు విష్ణువుకు శయనంగా అమరినవాడు, శివుడు నాగాభరణుడు, ఈ భూమికి ఆధారం వాసుకి అనే సర్పం, మన రాష్ట్రంలో శ్రావణ శుద్ధపంచమినాడు నాగపంచమి, కార్తీకశుద్ధ చవితినాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం.

ఆశ్లేషనక్షత్రానికి అధిష్టానదేవత సర్పం, నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది.
వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు
పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది.

వృశ్చికరాశిలో జ్యేష్టానక్షత్రం సర్పనక్షత్రం, ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భమే నాగులచవితి. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వార ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు, కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.

Monday, September 12

సుబ్రహ్మణ్య స్తోత్రం

నీల కంఠ వాహనం ద్విషద్ భుజం కిరీటినం
లోల రత్న కుండల ప్రభా అభిరామ షణ్ముఖం
శూల శక్తి దండ కుక్కుట అక్ష మాలికా ధరం
బాలం ఈశ్వరం కుమారశైల వాసినం భజే

వల్లి దేవయానికా సముల్లసంతం ఈశ్వరం
మల్లికాది దివ్య పుష్ప మాలికా విరాజితం |
ఝల్లరీ నినాద శంఖ వాదన ప్రియం సదా
పల్లవారుణం కుమారశైల వాసినం భజే

షడాననం కుంకుమ రక్త వర్ణం
మహా మతిం దివ్య మయూర వాహనం |
రుద్రస్య సూనుం సుర సైన్య నాథం
గుహం సదా శరణమహం భజే

మయూరాధి రూఢం మహా వాక్య గూఢం
మనోహారీ దేహం మహా చ్చిత్త గేహం |
మహీ దేవ దేవం మహా వేద భావం
మహాదేవ బాలం భజే లోకపాలం

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం సంపూర్ణం

Friday, May 20

వల్లిదేవి, సుబ్రహ్మణ్యస్వామి


తొండైనాడు దేశంలో "మేర్పట్టి" అనే గ్రామం ఉండేది. ఆ గ్రామ పొలిమేర్లలో వల్లిమలై [ వల్లికొండలు ] ఉన్నాయి. ఆ గ్రామంలోనే నంబి అనే పుళిందుడు ఉండేవాడు. [ పుళిందులు అంటే వేటాడి జీవనం సాగించేవారు అని ]. ఆ నంబికి మగపిల్లలు ఉన్నరు, కాని ఆడపిల్ల అంటే అతనికి చాలా ఇష్టము. ఒకరోజు నంబి, అతని భార్య ఆహార సంపాదనకై కొండల మధ్య తిరుగుతూండగా వారు, ఓ శిశువు దుప్పి పరిరక్షణలో ఉండటం చూసారు. ఆడపిల్లలు లేనిలోటు ఆ దేవుడు ఈ రూపంలో తీర్చాడు అనుకొని, ఆ బిడ్డని ఎత్తుకొని ముద్దాడి, తమ ఇంటికి తీసుకొని పోయారు. తమ జీవనాధారం ఐన వల్లికొండల మద్య దొరికింది కాబట్టి "వల్లి" అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచసాగారు. భగవంతునిపై భక్తి, పెద్దలపట్ల గౌరవము, వినయ విధేయతలతో వల్లి పెరిగింది.

Wednesday, May 4

శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రం


1.షాడాననం చందనలేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం
రుద్రస్య సూనుం సురులోకనాధం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే


2.జాజ్వల్యమానం సురబృంద వందం కుమారధారాతట మందిరస్థం
కందర్పరూపం కమనీయగాత్రం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే

3.ద్విషడ్భుజం ద్వాదశ దివ్యనేత్రం త్రయీ తనుం శూలమశిందధానం
శేషావతారం కమనీయ రూపం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే

4.సురారిఘ్నోరాహవ శోభమానం సురోత్తమం శక్తిధరం కుమారం

సుధారశక్త్యాయుధ శోభిహస్తం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే


5.ఇష్టార్ద సిద్దిరద మీశపుత్రం మిష్టాన్నదం భూసుర కామధేనుం
గంగోద్భవం సర్వజనానుకూలం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపద్యే

ఫలశ్రుతి య: శ్లోక పంచకమిదం పఠేత్ భక్త్యా శ్రీసుబ్రహ్మణ్యదేవ వినివేశిత్త్ మానస: సంప్రాప్నోతి బోగమజ్రులం భువి యద్యాదిష్టం అంతే చ గచ్చతి ముదాగుహ సామ్యమేవ

Tuesday, February 22

సుబ్రహ్మణ్య కవచం

సింధూరారుణ ఇందు కాంతి వదనం కేయూరహారాదిభిః
దివ్యైర్ ఆభరణై విభూషిత తనుం స్వర్గాది సౌఖ్య ప్రదం,

ఆంభోజాభయ శక్తి కుక్కట ధరం,రక్తాంగ రాగోజ్వలం,
సుబ్రహ్మణ్యం ఉపాస్మహే,ప్రణమతాం భీతి ప్రసోధ్యతం

సుబ్రహ్మణ్యో అగ్రత పాతు సేనాని పాతు పృస్థుతః
గుహోమాం దక్షిణే పాతు వహ్నిజ పాతుమామతః

శిరఃపాతు మహా సేన స్కంధో రక్షే లలాటకం,
నేత్రే మే ద్వాదశాక్షం చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్

ముఖం మే షణ్ముఖ పాతు నాసికం శంకరాత్మజ,
ఓష్ఠౌ వల్లీ పతి పాతు జిహ్వాంపాతు షడక్షకం

దేవసేనాధిపతి దంతన్ చుబకం బహుళాసుతః,
కంఠం తారక జిత పాతు బాహు ద్వాదశ బాహు మాన్

హస్తౌ శక్తి దరః పాతు వక్ష పాతు శరోద్ భవ,
హృదయం వహ్ని భూ పాతు కుక్షిం పాత్వంబికాసుత

నాభిం శంభు సుత పాతు కటింపాతు హరాత్మజ,
ఓష్టో పాతు గజారూఢో జహ్ను మే జాహ్నవీ సుత

జంఘో విశాకో మే పాతు పాదౌ మే శిఖి వాహన,
సర్వాంగణి భూతేశ సప్త ధాతుంశ్చ పావకి

సంధ్యా కాలే నిశీదిన్యాం దివ ప్రాతర్ జలే అగ్నేషు,
దుర్గమే చ మహారణ్యే రాజ ద్వారే మహా భయే

తుమలే అరణ్య మధ్యే చ సర్పదుష్టమృగాధిషు,
చోరాదిసాధ్యసంభేధే జ్వరాది వ్యాధి పీడనే

దుష్ట గ్రహాది భీతౌ చ దుర్నిమిత్తాది భీషణే,
అస్త్ర శస్త్ర నిపాతే చ పాతుమాంక్రౌంచరంధ్ర కృత్

య: సుబ్రహ్మణ్య కవచం ఇష్ట సిద్ధి ప్రద: పఠేత్,
తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహం

ధర్మర్ధీ లభతే ధర్మం ఆర్తార్థీ చ ఆర్త మాప్నుయాత్,
కామార్తీ లభతే కామం మోక్షర్థీ మోక్షమాప్నుయాత్

యత్ర యత్ర జపేత్ తత్ర తత్ర సన్నిహితో గుహ,
పూజా ప్రతిష్ఠ కాలేచ జపేకాలే పఠేత్ సదా

సర్వాభీష్టప్రదాం తస్య మహా పాతక నాశనం,
య:పఠేత్ శృణుయాత్ భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ

సుబ్రహ్మణ్య ప్రసాదేన హ్యపమృత్యు సో అంతే
ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్రపౌత్రభి వర్ధనం,
సర్వకామాన్ ఇహ ప్రాప్య సొంధే స్కంధ పురం వృజేత్

Tuesday, August 3

సుబ్రహ్మణ్యస్వామి

గౌరీ శంకరుల మంగళకర ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్యస్వామి. షణ్ముఖుడు, కార్తీకేయుడు, వేలాయుధుడు, కుమారస్వామి గా పేరు గడించిన స్వామి కారణజన్ముడు. తారకాసురుడు, సురావణుడు మరికొందరు రాక్షసులు ప్రజలను, దేవతలను హింసిస్తూ ఉండేవారు. అసురల బారి నుండి కాపాడమని బ్రహ్మను కోరగా, శివ పార్వతులకు జన్మించిన పుత్రుడు వారిని వధిస్తాడని చెప్పాడు. రకంగా పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో కుమారస్వామి పుట్టుక విలక్షణమైనది.

శివాంశతో జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి గంగాదేవి గర్భంలో పెరుగుతాడు.గంగాదేవి పుత్రుని భారం మోయలేక రెల్లు పొదల్లోకి జారవిడుస్తుంది. అప్పుడు
కృత్తికా దేవతలు ఆరుగురు తమ స్తన్యమిచ్చి పెంచుతారు. రెల్లు పొదల్లో పెరిగినందువల్ల శరవణుడు అని, కృత్తికా దేవతలు పెంచినందు వల్ల కార్తికేయుడని పేరు వచ్చినది అని పురాణాలు చెబుతున్నాయి. ఆరు ముఖాలు కలిగినందు వల్ల షణ్ముఖుడు అని అంటారు. నెమలి వాహనం కలిగిన స్వామి గణేశునికి సోదరుడు. ఆరు ముఖాలలో ఐదు పంచేంద్రియాలకు, ఒకటి మనసుకు ప్రతీక.

స్వామి
అనే నామధేయం సుబ్రహ్మణ్య స్వామి కి మాత్రమే సొంతం. సేనాపతిగా సకల దేవగణాల చేత పూజలు అందుకొనే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందితే గౌరిశంకరుల కటాక్షం లభిస్తుందని ప్రతీతి. తారాకాసురుడిని సంహరించిన కుమార స్వామి మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు జన్మించాడు. ఆరు ముఖాలు, పన్నెండు చేతులు సూర్య తేజస్సుతో జన్మించిన షణ్ముఖుని ఆరాధించడం వలన సమస్తదోషాలు తొలగి, శుభాలు కల్గుతాయని భక్తుల నమ్మకం. ఆషాడమాస శుక్ల పక్ష పంచమి, షష్టిని పర్వదినాలుగా జరుపుకొంటారు. శుక్ల పక్ష పంచమిని స్కంద పంచమని, షష్టిని కుమార షష్టి అని భావించి భక్తులు రెండు రోజుల విశేష పూజలు చేస్తారు.
పంచమి
నాడు ఉపవాసం ఉండి, షష్టి నాడు కుమారస్వామి ని పూజించినట్లైతే నాగ దోషాలు తొలగుతాయని, ఙ్ఞానం వృద్ధి కలుగుతుందని, కుజదోషాలు తొలగుతాయని, సంతానం కలుగుతుందని నమ్మకం.

హే స్వామినాధ కరుణాకర దీనబంధో
శ్రీ
పార్వతి సుముఖ పంకజ పద్మబందో
శ్రీ శాది దేవగణాధిత పాదపద్మ
వల్లీ
సనాధ మమదేహి కరావలంబం