Showing posts with label అయ్యప్పస్వామి. Show all posts
Showing posts with label అయ్యప్పస్వామి. Show all posts

Friday, November 18

ధర్మశాస్త అయ్యప్ప

వర్ణనాతీతమైన దివ్యమైన ఙ్ఞానమంగళ విగ్రహం. హరిహరాత్మకమైన ఏక చైతన్యం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి మొదలైన మహా వాక్యాల ద్వార ప్రతిపాదింపబడుతున్న అద్వైత తత్వానికి సాకారం.
ధ్యానిస్తే చాలు సమస్త తత్వసారమూ సాక్షాత్కారమవుతుంది. అయ్యప్ప మహిమ జగద్విదితం. స్వామి లీలలు స్కాందాది (శివరహస్య ఖండాంతర్గత) పురాణగాధల్లో వర్ణించబడ్డాయి.
హరిహరాత్మకం
నారాయణుడు, శివుడు వేరు తత్వతః ఒక్కరే అని వేద, పురాణాలు సుస్పష్టంగా వక్కాణిస్తున్నయి.

యోహం సత్వం జగచ్చేదం
స దేవాసురమానుషం
అవిద్యా మోహితాత్మానః
పురుషా భిన్నదర్శినః

"శంకరా, నేను దేవాసుర మనుషాది సహితమైన ఈ జగత్తు నీ స్వరూపమే. అవిద్యామోహితులు భిన్నభిన్నంగా భావిస్తారు" అని విష్ణుపురాణంలో విష్ణువచనం,

అహం త్వం సర్వగోదేవ
త్వమేవాహం జనార్దన
ఆవయోరంతరం నాస్తి
శబ్దై రర్ధై ర్జగత్త్రైయే

"నేను సర్వగతుడవైన నీవే.
నీవే నేను. శబ్దాలచే గాని, అర్ధాలచే గాని మన ఉభయులకు భేదం లేదు" అని హరివంశంలో శంకరుడు విష్ణువుతో అన్నమాటలు. ఈ అభేద ప్రతిపత్తి అయ్యప్ప రూపంలో రూఢి అవుతోంది.
హరి, మోహిని రూపం ధరించగా, హరుడు మోహించాడని కథ. నారీవేషం ధరించిన విష్ణువు సాక్సాత్తు పరాశక్తి. "పుం రూపా విష్ణువిగ్రహా" అని లలితోపాఖ్యానం చెప్తోంది.

"లలితాదేవి ధరించిన పురుష రూపమే విష్ణువు" ఇద్దరిలో ఒకే లక్షణం ఉంది, అందుకే ఆమె వైష్ణవి. పద్మనాభ సహోదరి (విష్ణు సోదరి). ఏకలక్షణం చేత వారు సోదర స్థానీయులు.
ఉమాదేవి స్వయంగా విష్ణువు. ఇదే విషయాన్ని " శివానందలహరి"లో "బాణత్వ్"శంకరా, ఆ విష్ణువు నీకు భార్యగా అర్ధ భాగాన్ని స్వీకరించాడు" అని అన్నారు శంకర భగవత్పాదులు.
శివుడు అగ్ని తత్వం కాగా, నారాయణుడు జల తత్వం. ఈ విశ్వమంతా అగ్నిసోమాత్మకం(జలం). స్త్రీవాచకంగా చెప్పినప్పుడు సోమం-ఉమాదేవి. పురుష వాచకంగా - విష్ణువు.అగ్నిసోమంగా విశ్వవ్యాప్తమైన చైతన్యం పరమాత్మ. ఆ ఏకత్వ ప్రతిపాదకమైన పరమాత్మ శివ నారాయణాత్మక జ్యోతిస్వరూపంగా దర్శించారు. అదే అయ్యప్పమూర్తి.
అన్ని యోగ రహస్యాలు స్వామి మూర్తిలోనూ, తత్సన్నిధి కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫొటమవుతుంటాయి.

18 పరిపూర్ణతను సాదించిన ఙ్ఞానికి సంకేతం. ఆ ఙ్ఞాన సాధనే 18 మెట్లు ఎక్కడం.
అయ్యప్పకు మరో పేరు 'ధర్మశాస్తా. 'శాస్తా అంటే గురువు అని అర్ధం. ఆదిశంకరులు 'శాస్తారం ప్రణమామ్యహం' అంటూ ఆ
స్వామిని స్తుతించారు. " ఇది ధర్మం, ఇది యోగం" అని శాసించి ఆచరింపచేసేవాడు కనుకనే గురువును "శాస్త" అన్నారు.
స్వామి 'చిన్ము
ద్ర ధరించి ఉంటారు. అంటే "బొటనవేలు చూపుడు వేలు కలిపి" ఉంచే ముద్ర. మనం దక్షిణామూర్తి లో ఈ ముద్రను దర్శించవచ్చు. అయ్యప్ప కూడ చిన్ముద్ర ధారి.
మండలం పాటు దీక్ష గా ఉండి స్వామిని దర్శించాలన్నారు. దీక్షతో వెళ్ళిన వారికే "యాత్రా ఫలం" లభిస్తుంది.
40 రోజులనేది చాలా శాస్త్రీయమైన సంఖ్య. మన శరీరమానసిక చైతన్య వ్యవస్థగా రూపుదిద్దుకోడానికి 40రోజులు పడుతుంది. { ఆయుర్వేదంలో కూ
డ ఒక మందు మండలం రోజులు వాడితే కాని ఫలితం ఉండదు అంటారు } అందుకే మండలదీక్ష నిర్ణయించారు.
అయ్య, అప్ప - అనే దేశీయమైన పదాలు "ఆర్యా""పితా" అనే ఆర్ష శబ్దాల రూపాలే. గురువే ఆర్యుడు. ఆయనే పరమాత్మ. ఉపాసకుల కోసం ఒకే పరతత్వం వివిధ రూపాలుగా దర్శనమిస్తుంది. అలా ధరించిన యోగ ఙ్ఞానమయ మంగళమూర్తి - ధర్మశాస్త.
"స్వామియే శరణం అయ్యప్ప" అనే మాట పరమ మంత్రమై సాధకులకు సిద్ధిని ప్రసాదిస్తోంది.

" హరిహర సుతన్, ఆనంద చిత్తన్, అయ్యన్, అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్పా......"

{ఆధారం : షణ్ముఖశర్మగారి ప్రవచనం}

Monday, January 12

మకర జ్యోతి

శబరిమల ఆలయానికి మకరవిల్లకు పండుగ చాల ముఖ్యమైనది . మకరసంక్రాంతి నుండి 7 రోజులు ఈ పండుగ జరుపుతారు .

మకరసంక్రాంతి కంటే 3 రోజుల ముందు పండ
Jewelbox of Swamy Ayyappaలం అను ప్రాంతం లో ఉన్న వలియ కోయిక్కల్ శాస్త ఆలయం నుండి స్వామి వారి ఆభరణాలు తెస్కొని వస్తారు. ఆభరణాల పెట్టెను మోస్తున వ్యక్తి స్వామి నామస్మరణతో పారవశ్యం చెందుతూ , మద్యలో కొన్ని దేవాలయాల ముందు ఆగుతూ , శబరిమల చేరుతారు . సాయం సంధ్య వేళలో దీపాల వెలుగులో , బాజా బజంత్రీ లతో , స్వామి ఆభరణాలను సన్నిధానం లో కి చేరుస్తారు .ఆ సమయలో ఆకాసంలో ఒక గద్ద ఆ పెట్టె చుట్టూ ఓ ప్రదక్షణ చేసి వెళ్ళిపోతుంది .

చీకటి పడే వేళకి, భక్తుల చూపు అంతా ఉత్తర -తూర్పు దిక్కుల మధ్యకి కేంద్రీకృతం అవుతుంది . అది మకర జ్యోతి ఆస్సన్నం అయ్యే సమయం .జ్యోతి దర్శనం ....శరణు ఘోష తో శబరిమల మారు మ్రోగి పోతుంది . భక్తుల కి చెప్పలేని సంతోషం , ఆనందం . ఆ జ్యోతి ని కళ్లారా చూసి జన్మ తరింప చేస్కొంటారు .




మనిమందపం దగ్గర , మెట్ల పూజ నిర్వహిస్తారు . పూజ తర్వాత మాలికాపురతమ్మ ఏనుగు అంబారి పైన , మేళ్ళ తాళాలతో పతినేట్టంపడి గుండా ప్రధాన ఆలయం చేరుతుంది .



7 రోజుల ఉత్యవాలు "గురుతి "అనే ఉత్యవం తో ముగుస్తాయి .

Thursday, November 13

అయ్యప్ప స్వామి దీక్ష / మాల ధారణ

ఈ సమయం లో నల్లని పంచలు, మెడ లో రుద్రాక్ష మాలలు, నుదుట గంధం విభూది ల తో మనకు అయ్యప్ప భక్తులు కనిపిస్తారు. 40 రోజుల దీక్ష తీస్కోని, అయ్యప్ప ని పూజించే భక్తులను మనం "స్వామి " గా సంభోదిస్తాం. ఈ అయ్యప్ప దీక్ష అనునది మళయాళ నెలల లో వృశ్చికం ( నవంబర్ 14/15/16 ) నుండి మొదలవుతుంది. మండల పూజ
( సుమారు25 dec ), మకర సంక్రాంతి ( సుమారు 14jan ) ఈ రెండు రోజలలో అయ్యప్ప స్వామి దర్శనం చేస్కొంటారు. ఈ రెండు రోజలలో మకర సంక్రాంతి రోజు దర్శనం ప్రదానమైనది. ఆ రోజు జ్యోతి దర్శనం జరుగుతుంది. జ్యోతి రూపం లో అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తారు.
శబరిమల ఆలయం, మళయాళ నూతన సంవత్సర మొదటి రోజు, ప్రధాన పండగల రోజు తెరుస్తారు. ఉదా : ఓనం, విశు. 41రోజుల దీక్ష తప్పనిసరిగా తీస్కొని అయ్యప్ప దర్శనం చేయవలెను. ఈ అయ్యప్ప దీక్ష అనునది తల్లి ద్వారా కానీ, గురువుగారి ద్వారా కాని, గురుస్వామి ద్వారా కానితీస్కొనవలెను. ఆ రుద్రాక్ష మాల మెడలో పడిన దగ్గర నుండి " స్వామి " అని అందరి చేత పిలువబడుతాడు. అమ్మాయిలు ఈ దీక్ష తీసుకోడానికి నిబంధనలు ఉన్నాయి. అమ్మాయి 1 -9 వయస్సు లోపు వారు, 50 వయస్సు దాటినా వారు దీక్షకు అర్హులు. దీక్ష తీసుకొన్న ఆడువారిని "మాలికాపురం" గా పిలుస్తారు. ( అయ్యప్ప యొక్క శక్తి స్వరూపం).
దీక్ష తీసుకొన్న వారు ఖచ్చితంగా నియమ నిభంధనలను పాటించాలి. తెల్లవారక ముందే లేచి, చన్నీటి స్నానం చేసి, శరణు ఘోష చేసి, నైవేద్యం పెట్టాలి. చెప్పులు, బూట్లు ధరించకూడదు. నలుపు / కాషాయం రంగు మాత్రమే ధరించాలి. జుట్టు కత్తిరింపు, ధూమపానం, మందు తాగటం, మాంసాహారం భుజించడం చేయకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండ పాటించాలి. వేరే వారిని పిలిచేటప్పుడు కూడా స్వామి అనే సంభోదించాలి. ఈ నియామాలు పాటించకుండా శబరిమల దర్శనం వ్యర్ధం.
" ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప "