Showing posts with label తెలుగు సంవత్సరాది. Show all posts
Showing posts with label తెలుగు సంవత్సరాది. Show all posts

Wednesday, April 6

ఖర నామసంవత్సర అర్ధం....

ఖర నామసంవత్సరం అనగానే చాలమంది గాడిద నామసంవత్సరం ఏంటి అని అనుకొంటున్నారు. ఖర అంటే గాడిద అని కూడ అర్ధం ఉంది కాని, ఈ సందర్భంలో గాడిద అని అర్ధంకాదు. చురుకైన / తీవ్రమైన అని భావం.
ప్రముఖులు, సాహితీవేత్త, కవి ఐన గరికపాటి నరసింహరావు గారు మనకు అర్ధమగు రీతిలో వివరించారు. ఈ క్రింది విడియో ను వీక్షించండి .


Monday, April 4

ఉగాది -- శ్రీ ఖర నామ సంవత్సరం


ముందుగా అందరికి శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు. ఖర అంటే చురుకైన / సూర్పణక సహోదరుడు / గార్దభం అని అర్ధం. 60 తెలుగు సంవత్సరాలలో 25వ సంవత్సరం ఖర. పురాణల ప్రకారం, శ్రీ మహా విష్ణువు మాయ వలన, నారద మహర్షి మానవ (స్త్రీ) రూపం పొంది ఈ జంఝాటకాలలో పడి వివాహము, పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కొనిపోతుంది, ఒక రాజుని వివాహమాడి 60మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి. కాలగమనంలో యుద్ద సమయమున ఆ పిల్లలను పోగ్గొట్టుకొంటుంది. ఈ మాయ నుండి బైట పడ్డ ఆ యువతి (నారదుడు) ఇది అంతా ఆ మాహా విష్ణు మాయ అని తెల్సుకొంటుంది. ఆ 60మంది కుమారులకు గుర్తుగా, 60 తెలుగు సంవత్సరాలు వారి పేర్లు తో సార్ధకమౌతాయని శ్రీ మహావిష్ణువు అనుగ్రహించారని పురాణాలలో చెప్పారు.

యుగాది కృద్యుగావర్థో నైకమాయో మహాశన:
ఆద్రుశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్
విష్ణువు కు యుగాది అను పేరు కూడ ఉంది. దానిని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు. యుగాది కృద్ అంటే యుగాలను సృష్టించేవాడు, యుగావర్తో అనగా యుగములను పునరావృతం చేయువాడు.
హిందూ సంప్రదాయం ప్రకారం తెలుగు సంవత్సరాది ఉగాది నాడు మొదలవుతుంది. యుగమునకు ఆది (మొదలు) అని అర్ధము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చైత్ర మాసం లో ని పూర్ణ చంద్రోదయ రోజున, శ్రీ కృష్ణుడు నిర్యాణం చెందినాడని, ఆ రోజునే కలియుగ ఆరంభంగా పరిగణించారు. ఆ విధంగా కలియుగం ఆరంభం ఐనది అని వారి భావము.
మన జీవితంలోని ఎగుడు దిగుడులను కూడా మనం సమంగా తీస్కోవాలని తెలిపేదే ఉగాది పచ్చడి. తీపి, వగరు, పులుపు, చేదు, ఉప్పు, కారం కలగలిసినదే ఉగాది పచ్చడి . జీవితం కూడా అంతే, అన్నింటిని ఆస్వాదించినపుడే సంతోషముగా ఉంటాము.

Tuesday, March 24

ఉగాది , తెలుగు సంవత్సరాది.(మార్చి 27)

యుగము + ఆది...ఉగాది, తెలుగు సంప్రదాయం ప్రకారం మనం జరుపుకొనే నూతన సంవత్సరం. ఈ తెలుగు సంవత్సరం పేరు "విరోధినామ" సంవత్సరం. చైత్రశుద్ద పాడ్యమి రోజున ఉగాది గా తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.

రామాయణ కాలం లో ఉత్తరాయణం మొదటి రోజును ఉగాదిగా జరుపుకొనే వారు. కొద్దికాలం తర్వాత వరాహమిహిరుడు అనే మహర్షి చైత్రశుద్ద పాడ్యమి నాడు ఉగాది ని జరపడం ప్రారంబించారు. అప్పటినుండి అదే ఆనవాయితి గా మారింది.
ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణం ఈ పండగ ప్రత్యేకత. పొద్దునే లేచి, తలంటు స్నానాలు చేసి, పూజ జరిపి, ఉగాది పచ్చడి తింటే కాని మరేది తినం. అలాగే పంచాంగం వింటాం. రాశిఫలాలు ఎలా ఉన్నాయి, పంటలు, వర్షాలు మొదలైన వాటి గురించి తెల్సుకొంటాం.
షడ్రుచుల
కలయకే ఉగాదిపచ్చడి. (బెల్లం/తీపి, వేప పువ్వు /చేదు, మిరపకాయ/కారం, చింతపండు/పులుపు, మామిడికాయ/వగరు, ఉప్పు) మన జీవితం లో వచ్చే ఎగుడు/దిగుడులు, శుఖ సంతోషాలను ఒకేలా తీసుకోవాలని ( సంతోషం వచ్చినపుడు పొంగిపోయే, దుఖం వస్తే కుంగిపోవడం లా కాకుండా ) ఈ ఉగాది పచ్చడి లో ని అంతరార్ధం.