Showing posts with label అమ్మవారు. Show all posts
Showing posts with label అమ్మవారు. Show all posts

Wednesday, October 17

దుర్గా సప్తశ్లోకి

ఓం ఙ్ఞానికా మపి చేతాంసి దేవీ భగవతీ హి సా
బలదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి

ఓం దుర్గే స్మృతా హరసిభీతి మశేషజంతోః
స్వస్థైః స్మృతా మతి మతీవ శుభాం దదాసి
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ర్ధ చిత్తా

ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాద్కకే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే
 
ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే
 
ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్య స్త్రాహినోదేవి, దుర్గేదేవి నమోస్తుతే
 
ఓం రోగా నశేషా వపహంసి తుష్టా
రుష్టా తు కామాన్ సకలా నభీష్టాన్
త్వా మాశ్రితానాం న విపన్నరాణాం
త్రా మాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి
 
ఓం సర్వబాధా ప్రశమనం త్రయిలోక్య స్యాఖిలేశ్వరీ
ఏనమేవ త్వయాకార్య మస్మద్వైరి వినాశనం.  

**********జయహో మాతా**********

Friday, November 25

మణిద్వీప వర్ణన (2)

వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8దిక్కులలో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది. ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా, ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియచేస్తూంటాయి. ఇంకా ముందుకు వెళ్ళగా మరకత మణి ప్రాకారం తేజరిల్లుతూంటుంది. అక్కడ తూర్పుకోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతికోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లూతు ఉంతారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూంటారు. పశ్చిమకోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూంటారు. ఈశాన్యకోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరు అమ్మవారిని సేవిస్తూంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కద పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు, పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, క్రోధభువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశిభైరివి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే, మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది.

చింతామణి గృహానికి వేయి స్తంబాలు, శృంగార, ముక్తి, ఙ్ఞాన, ఏకాంత అనే నాలుగు మండపాలు ఉన్నాయి. అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూంటుంది. ఆ మండపాలు నాలుగు దిక్కులా కాష్మీరవనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పూదోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడగల మహాపద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీలలితాదేవి సింహాసనుపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఙ్ఞాన మండపంలో నుండి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణులతో కొలువైయుంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తుంటుంది. చింతామణి గృహంలో శక్తితత్త్వాత్మికాలైన పది సోపానాలతో దివ్య ప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి నాలుగు కోళ్ళుగా అమరి ఉంటారు. ఆ నాలుగు కోళ్ళపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీఅమ్మవారు ఆసీనులై ఉంటారు.

శ్రీలలితాదేవి ఙ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టినది. నాలుగు బాహువులు కలిగి, అనురాగమను పాశము, క్రోధమనే అంకుశము, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను (పంచతన్మాత్రలను) బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమణులచే ప్రకాసించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమినాటి చంద్రునివలె ప్రకాశితూంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణములవలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపలవంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుదక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటె అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొందపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీమంత్రమునందలి పదునారు బీజాక్షరముల జతవంటి తెల్లని పలువరుస కలిగియున్నది.

శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకూ వెదజల్లుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు, వంకీలతోనూ అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అఙ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది. సంపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది.

విశాఖపట్టణంలోని, లలితాపీఠంలో మణిద్వీప నిర్మాణం చేసి, అమ్మవారికి పూజలు అందిస్తున్నారు. నేను ఈ పీఠాన్ని దర్శించుకున్నాను. మణిద్వీపంలో అమ్మవారి అలంకారములు, కుంకుమార్చన చాలా బాగ చేస్తారు.
{ విషయసేకరణ : శ్రీలలిత సహస్రనామం, శ్రీలలితా పీఠం, విశాఖపట్టణం వారి ప్రచురణ }

Thursday, November 24

మణిద్వీప వర్ణన (1)

మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంతుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిలుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు అనేక వర్ణాలు గల జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆ ప్రదేశానికి అవతల ఏడుయోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీఅమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు, అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి.

ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి. పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీసప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కద లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు, చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత, సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తుంటుంది. దానిని పానము చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది.

సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణంగల పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్ని రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తుంటారు. దానికి తూర్పుగా అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూంతుంది. అక్కడ మహేద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయభాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతీ దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమదిశలో వరుణ దేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్యదిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. ఉత్తరదిశలో కుబేరుడు తన యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేకమంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో భాసిల్లుతూంటాడు.

పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుస్షష్టి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. రధాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూంటాయి. అక్కడ 32 శ్రీదేవీ శక్తులు ఉంటాయి. 32లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీఅమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీత్రిభువనేశ్వరీదేవి దాసదాసీ జనంతో నివసిస్తూంటారు.

Wednesday, June 15

శ్రీ దుర్గాస్తోత్రం

విరాటనగరం రమ్యం - గచ్ఛమానో యుధిష్ఠిరః
అస్తువ న్మనసా దేవీం - దుర్గాం త్రిభువనేశ్వరీం

యశోదాగర్భసంభూతాం - నారాయణవరప్రియాం
నందగోపకులే జాతాం మంగళాం కులవర్ధనీం

కంసవిద్రావణకరీం - అసురాణాం క్షయంకరీం
శిలాతటవినిక్షిప్తాం - ఆకాశం ప్రతి గామినీం

వాసుదేవస్య భగినీం - దివ్యమాల్యావిభూషితాం
దివ్యాంబరదరాం దేవీం - ఖడ్గఖేటక ధారీణీం

భారావతరణే పుణ్యే - యేస్మరంతి సదాశివాం
తా న్వై తారయతే పాపా - త్పంకేగా మివ దుర్బలాం

స్తోతుం ప్రచక్రమే భూయో - వివిధైః స్తోత్రసంభవైః
ఆమంట్ర్య దర్శనాకాంక్షీ - రాజా దేవీం సహానుజః

నమోస్తు వరదే కృష్ణే - కుమారి బ్రహ్మచారిణి!
బాలార్కసదృశాకారే - పూర్ణచంద్రనిభాననే

చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే
మయూరపంఛవలయే కేయూరాంగదధారిణి

భాసి దేవి యథా పద్మా - నారాయణపరిగ్రహః
స్వరూపం బ్రహ్మచర్యం చ - విశదం తవ ఖేచరి

కృష్ణచ్ఛవిసమా కృష్ణా - సంకర్షణసమాననా
బిభ్రతీ విపులై బాహూ - శక్రధ్వజసముచ్ఛ్రయౌ

పాత్రీ చ పంకజీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ యా భువి
పాశం ధను ర్మహాచక్రం వివిధా న్యాయుధాని చ

కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం - కర్ణాభ్యాం చ విభూషితాః!
చంద్రవిస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే

ముకుటేన విచిత్రేణ - కేశబంధేన శోభినా
భుజంగాభోగవాసేన - శ్రోణీసూత్రేణ రాజతా

భ్రాజసే చావబద్ధేన - భోగేనే వేహ మందరః
ధ్వజేన శిఖిపింఛానా - ముచ్ఛ్రి తేన విరాజసే

కౌమారం వ్రత మాస్థాయ - త్రిదివం పావితం త్వయా
తేన త్వం స్తూయసే దేవి - త్రిదశైః పూజ్యసే పి చ

త్రైలోక్యరక్షణార్థాయ - మహిషాసురనాశిని
ప్రసన్నా మే సుర జ్యేష్ఠే - దయాం కురు శివా భవ

జయా త్వం విజయా చైవ - సంగ్రామే చ జయప్రదా
మమా పి విజయం దేహి - వరదా త్వం చ సాంప్రతం

వింధ్యే చైవ నగశ్రేష్ఠే - తవ స్థానం హి శాశ్వతం
కాళి కాళి మహాకాళి - సీధుమాంసపశుప్రియే

కృపానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణీ
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః

ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి
న తేషాం దుర్లభం కించిత్ - పుత్రతో ధనతో పి వా

దుర్గా త్తారయస్తే దుర్గే త త్త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారే ష్వవసన్నానాం - మగ్నానాం చ మహార్ణవే

దస్యుభి ర్వా నిరుద్ధానాం - త్వం గతిః పరమా నృణాం
జలప్రతరణే చైవ కాంతారే ష్వటవీషు చ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తి శ్శ్రీర్ ధృతి స్సిద్ధిః - హ్రీ ర్వి ద్యా సంతతి ర్మతిః

సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా - జ్యోత్స్నాకాంతిః క్షమా దయా
నృణాం చ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం

వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సో హం రాజ్యా త్పరిభ్రష్టః - శరణం త్వాం ప్రపన్నవాన్

ప్రణత శ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి - సత్యే సత్యా భవస్వ నః

శరణం భవమే దుర్గే - శరణ్యే భక్తవత్సలే
ఏవం స్తుతా హిసా దేవీ - దర్శయామాస పాండవం

ఉపగమ్య తు రాజాన - మిదం వచన మబ్రవీత్
శృణు రాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో

భవిష్య త్యచిరా దేవ - సంగ్రామే విజయ స్తవ
మమ ప్రసాదా న్నిర్జిత్య హ్త్వా కౌరవవాహినీం

రాజ్యం నిష్కంటకం కృత్వా - భోక్ష్యసే మేదినీం పునః
భాత్రృభి స్సహితో రాజన్ - ప్రీతిం ప్రాప్స్యసి పుష్కాలాం

మత్ప్రసాదా చ్ఛ తే సౌఖ్య - మారోగ్యం చ భవిష్యతి
యే చ సంకీర్తయిష్యంతి - లోకే విగతకల్మషాః

తేషాం తుష్టా ప్రదాస్యామి - రాజ్య మాయు ర్వపు స్సుతం
ప్రవాసే నగరే చాపి - సంగ్రామే శత్రుసంకటే

అటవ్యాం దుర్గకాంతారే - గహనే జలధౌ గిరౌ
యే స్మరిష్యంతి మాం రాజన్ య థాహం భవతా స్మృతా

న తేషాం దుర్లభం కించి - దస్మిన్ లోకే భవిష్యతి
య ఇదం పరమ స్తోత్రం - శృణుయా ద్వా పఠేత వా

తస్య సర్వాణి కార్యాణి - సిద్ధిం యాస్యంతి పాండవాః
మత్ప్రసాదా చ్చ వ స్సర్వాన్ - విరాటనగరే స్థితాన్

న ప్రఙ్ఞాస్యంతి కురవో - నరా వా తన్నివాసినః
ఇత్యుక్త్వా వరదా దేవీ - యుధిష్ఠిర మరిందమం
రక్షాం కృత్వా చ పాండూనాం - తత్రై వాంతరధీయత

రాహుకాల పూజ

రాహుకాలం అనగానే, ఆ సమయంలో ఎదైన పని మీద బైల్దేరటంగాని, కొత్తగా ఎదైన పనిని మొదలెట్టడం గాని చెయ్యొద్దు అని మన ఇళ్ళలో అంటూంటారు. కాని అదే రాహుకాలంలో దుర్గమ్మని తలచుకొని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రతీరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరనివారు, మంగళ / శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాల మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా పూజాగదిని శుభ్రం చేసుకొని, దీపారాధన చేసి, శ్రీ దుర్గా స్తోత్రం చదివి నైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పెట్టే నైవెద్యం పసుపు రంగులో ఉండాలి అని కొందరు చెప్పారు, నేను ఒక గుడిలో చూసా కూడా. పసుపు రంగులో నైవేద్యం అంటే, ఓ రోజు నిమ్మకాయ పులిహొర మరో రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టారు ఆ గుడిలో పూజరి గారు. ఎదైన పని మనసులో అనుకొని రాహుకాలపూజ మొదలుపెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడ్తారు. ఇది కూడా చాలా మంచిది.

రాహుకాల సమయం :
సోమవారం - ఉ 7:30 -9:00
మంగళవారం - మ 3:00 -4:30
బుధవారం - మ 12.00 - 1:30
గురువారం - మ 1:30 - 3:00
శుక్రవారం - ఉ 10:30 - 12:00
శనివారం - ఉ 9:00 - 10:30
ఆదివారం - సా 4:30 - 6:00

Friday, April 22

శ్రీ దేవీపంచరత్న స్తోత్రం

శ్రీ దేవి పంచరత్నస్తోత్రం

ప్రాతస్స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృధులమౌక్తికశోభినాసం
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాడ్యాం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశం

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రత్నాంగుళీయల సదంగుళిపల్లవాఢ్యాం
మాణిక్య హేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషుసృణీన్ దధానాం

ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం
పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్యవిభవాం కరుణానవద్యాం
విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాజ్మనసో తిదూరాం

పాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి

ఇతి శ్రీ దేవీపంచరత్న స్తోత్రం

Wednesday, April 20

దశ మహావిద్యలు

మొదటిరూపం కాళి : మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతలనే మహావిద్యలంటారు. ఒకానొక సమయంలో హిమాలయములందు కల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతంగ వనితా రూపమున దర్శనమిచ్చింది. కాటుక వలె కృష్ణవర్ణమునందు ఉండుటవలన ఆమెకు కాళీ అనే పేరు వచ్చింది. శుంభనిశుంభలను సంహరించినది. కాళి నీలరూపము అగుటవలన తారానామము ఏర్పడినది. అనేక సంవత్సరాల కాలమునకు కాని ఫలించని యోగమార్గ సాధన, కొద్ది రోజులలోనో, మాసములలోనో సాధించాలి అని అనుకొనే వారు కాళి ఉపాసన చేస్తారు. ఐతే సాధనాకలం లో కాళీ శక్తి తమ శరీరములోకి ఆకర్షించినపుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశమైన మంటలను, బాధలను అనుభవించాల్సి ఉండును.

రెండువరూపం తార : తార సర్వదా మోక్షమును ప్రసాదించును. ఈమెకు నీలసరస్వతి అను పేరు కూడా ఉంది. భయంకరమైన విపత్తులనుండి భక్తులను కాపాడుతుంది కావున, ఈమెను ఉగ్రతార రూపమున కూడ యోగులు ఆరాధిస్తారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలుస్తారు. బుధగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మూడవరూపం ఛిన్నమస్త : దేవి ఒకానొక సమయమున తన సఖురాండ్రైన జయవిజయలతో మందాకిని నదికి స్నానార్ధము వెల్లింది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుధాగ్ని పీడితయై కృష్ణవర్ణ ఐనది. ఆమె సఖురాండ్రు ఆమెను భోజనవిషయమై అడిగిరి. కృపామయురాలు అయిన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామ హస్తమున పడింది. ఆమె కబంధం నుండి మూడు రక్తధారలు ప్రవహించినవి. రెండు రక్తధారలను ఆమె సఖురాండ్రు పానము చేయగా మూడవ రక్తధారను దేవియే స్వయముగా పానము చేసినది. ఆ రోజునుండి ఆమెకు ఛిన్నమస్తా నామము స్థిరపడినది. హిరణ్యకశ్యపాదులు ఈ ఛినమస్తాదేవి ఉపాసకులు.

నాల్గవరూపం షోడసీ : ఈ తల్లి చాలా దయామయురాలు. ఈమెను ఆశ్రయించినవారికి ఙ్ఞానమనునది కరతలామలకము. విశ్వములోని మంత్రతంత్రాదులన్ని ఈ అమ్మవారినే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడ వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి ఉపాసన వలన భోగమోక్షములు రెందూ సిద్ధిస్తాయి. బుధగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఐదవరూపం భువనేశ్వరీదేవి : సమస్తకోటి మహామంత్రములు ఎల్లపుడు ఈ దేవిని ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వము నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం దశస్థితులు ఉన్నయి. వాటినుండి అవ్యక్త భువనేశ్వరీ వ్యక్తమై బ్రహ్మాండరూపాన్ని ధరించకలుగుతుంది. ప్రళయవేళలో జగత్తునుండి క్రమముగా లయమై కాళీరూపములో మూలప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈ తల్లిని కాలుని జన్మదాత్రి అని కూడా అంటారు. చంద్రగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆరవరూపం త్రిపురభైరవి : సృస్టిలో పరివర్తన అనునది ఎల్లపుడునూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ, వికర్షణ అనునవే మూలకారణము. ఈ త్రిపురభైరవి నృసిం హభగవానుడి అబ్బిన్నశక్తిగా చెప్పబడినాడు.

ఏడవరూపం ధుమావతి : ఈమె కూడ ఉగ్రరూపమే. ఆగమములలో ఈమెని అభావసంకటాలను దూరం చేయునట్టి రూపంగా వర్ణించారు. ఐతే జీవుని దైన్యావస్థలైన క్షుత్పిపాసలూ, కలహదారిద్ర్యముల న్నింటికి ఈమే కర్త. ఆమె అనుగ్రహముంటే సకటములన్నీ దూరమవుతాయి. రాహుగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎనిమిదవరూపం భగళాముఖి : ఐహిక, దేశ, సమాజ, శత్రు శమనార్ధం ఈ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రధమముగా బ్రహ్మదేవుడు భగళామహా విద్యోపాసన చేసాడు. విష్ణువు, పరశురాముడు భగళాముఖీ దేవతా ఉపాసకులే. కుజ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి పూజ చేయడం మంచిది.

తొమ్మిదవరూపం మాతంగి : గృహస్థజీవితాన్ని సుఖవంతంచేసి పురుషార్ధములను సిద్ధింపచేసే శక్తి ఉన్న రూపం. ఈమెను మతంగముని కుమార్తెగా కూడా పిలుస్తారు.

పదవరూపం కమలాలయ : వస్తు సమృద్ధికి ప్రతీక. భార్గవులచేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అనే పేరు కూడ ఉంది. శుక్రగ్రహ దోషం ఉన్నవారు ఈ అమ్మవారి పూజవలన ఫలితాన్ని పొందుతారు

Monday, April 26

శ్రీ కామాక్షి దేవి కైవార గద్యము


నెల్లూరు జిల్లా "జొన్నవాడ "లో వెలసిన "శ్రీ కామాక్షి అమ్మణ్ణి "యొక్క కైవార గద్యము. ఇటీవల కాలం లో అచ్చటదొరుకుతున్న పుస్తకములలో కూడా ఈ గద్యము ప్రచురితము కావడంలేదు. మా అత్తయ్యగారి ద్వారా నేను ఈగద్యమును నేర్చుకొన్నాను. మీ అందరితో కూడా పంచుకొంటున్నాను.


శ్రీ కామాక్షి అమ్మణ్ణి కైవార గద్యము


శ్రీమన్ మహాదేవ హృద్పంజ శ్రీరమే మధ్యమే ఆదిశక్తి మహాకాళికే భక్త లోకేష్ట సంధాయికే, నిత్యబిందు, త్రికోణాష్టాది, షట్చక్ర, సింహాసనోద్యాత మానాత్మికే, పుణ్యమర్యోక్త రాభీల, దుర్వార గర్వ ప్రతిధ్వంసకే, మాతృకావర్ణ రూప, ప్రసిద్దోరుకూటాత్మికే, సర్వ మంత్రాత్మికే, సర్వ తంత్రాత్మికే, రత్న తాటంక యుగాన్వితే, ఆదియేతేశ, వాణీశ, నాగేశ, యక్షేశ, నానామునివ్రాత సంపూజితే, కాల ఖంఠాతరంగ, ప్రమోదపదే, శ్రీపదే, కృర సంభాది, సురాసుర కర్వ, ప్రవిధ్వంసకే, కామలోభాది, దుర్భావన, మూలవిచ్చేధిని, శిష్టసంరక్షిని, దుష్టసంహారిణి, సర్వవిద్రావిని, సర్వసంమాణిన్ని, భక్తసందోహ, వాంఛాఫల భవ్య చింతామణి, శ్రీ జనన్మోహిని, కామ సంజీవిని, శాంభవి, అంబ, శ్రీ రాజరాజేశ్వరి, గౌరీ, కారుణ్యరత్నాకరి, నీదు నామంబు , నీ భక్తుల్లెల్లప్పుడున్, కీర్తనల్ చేసి, సర్వార్ధముల్ పొందుచున్నారుగా, పాపరాహిత్యమున్గాంచుచున్నరుగా , పావనంబైన పెన్నానది తీర , సుశ్వేత గీర్యైంక, శ్రీమాన్ విరాజిల్లు, శ్రీయజ్ఞ వాటి ప్రదేశంబునన్, సుప్రసిద్దోతత్పల జన్మభూమిన్, జగత్ క్షేమం సంధాయినిగా నిల్చి, భక్తాలిన్ బ్రోచుచున్నావు గాదే, మాతంబ, సదా సర్వ రోగాదులన్, సర్వ కష్టాదులన్, సర్వ భూత గృహొద్విగ్ భాదల్, నివారించుచున్, జన్మ సాఫల్యమున్ చేయుచున్, పుత్రా వాంఛ ఫల వ్యాప్తియై, దూర దేశంబులందు ఉండి, భక్తాళి యేతెంచి, తత్భక్తి సేయంగ, నవ్వారి కోర్కెల్ దమిన్ తీర్చు, నిత్య కళ్యాణముల్, నిత్య నైవేద్యముల్, నిత్య కైంకర్యముల్, నిత్య సంసేవనంబుల్, సదా పొందుటల్, గాంచవో, దేవి, జొన్నాడ కామాక్షి, నీ భక్త వర్గంబులో, వీని పోపోవుచిత్తున్, నిక్రుస్టాంతరంగూన్, దురాచార, దుర్భావన నిష్టు, లోక ప్రవిష్టు, యొక భక్తుండుగా చేర్చి, దిక్కు లేనట్టి, దీనున్, అత్యల్ప భక్తిన్, వీక్షేపన్ గాంచి, యెట్లో భావాంభోది దాటింపగా చేయవే తల్లీ, దాస దాసన్, వోత్పాద, సాన్నిధ్య, సంసేవునిగా చేయవే, ఇష్ట కామ్యార్ధ సిద్దిగా జేయవే, తల్లీ, సర్వ యోగేశ్వరి, సర్వ లోకేశ్వరి, సర్వ భూతేశ్వరి, సర్వ సిద్దేశ్వరి, సర్వ భాష్యమయి, మృడాని నమస్తే నమః.




జొన్నవాడ (నెల్లూరు జిల్లా)
లో
శ్రీ కామాక్షి అమ్మణ్ణి ఆలయం