Showing posts with label శ్రీకృష్ణుడు. Show all posts
Showing posts with label శ్రీకృష్ణుడు. Show all posts

Monday, October 15

రాధాదేవి

శ్రీ రాధాదేవి ఉపాసన కృష్ణభక్తి సంప్రదాయంలో ప్రముఖమైనది. పురాణాలలో భాగవతం, విష్ణుపురాణం “రాధ” పేరు ప్రస్తావించకపోయినా, ఈ మహాదేవిని కల్పిత పాత్రగా అనుకోరాదు. ఉపాసకులకు ఈ తల్లి కృపా సాక్షాత్ సత్యం. విష్ణు ప్రాధాన్యాన్ని చెబుతూ రచించిన గ్రంధం కనుక విష్ణుపురాణం కృష్ణావతారాన్ని ఒక అవతారగాధగా ప్రస్తావిస్తూ రచించింది. ఆ కారణం చేత రాధ ప్రస్తాపన కనబడదు. అలాగే భాగవతంలో ఏ గోపిక పేరు కూడా చెప్పబడలేదు. అందుకే ప్రత్యేకించి “రాధ పేరు లేదు” అనడం సమంజసం కాదు. అయితే భాగవతం దశమ స్కంధంలో శుక మహర్షి “ అనయారాధితో నూనం” అనే  శ్లోకంలో రాధ పేరును సూచించారు.

రాధ ప్రస్తావన ప్రత్యేకించి దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం, పద్మ పురాణం. స్కాందపురాణం, గర్గ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, శివపురాణం, నారద పురాణం మొదలైన పురాణాలలో విస్తృతంగా ఉన్నది. ఊర్ధ్వామ్నాయ తంత్రము  మొదలైన మంత్ర శాస్త్రాలలో శ్రీరాధా దేవ్యుపాసన చెప్పబడినది. ఋగ్వేద, సామవేదాది వేద భాగాలలోనూ శ్రీరాధికోపనిషత్తు, శ్రీ రాధా తాపిన్యుపనిషత్తు, గోపాలతాపిన్యుపనిషత్తు లాంటి వేద వాఙ్ఞ్మయంలో రాధారాధన కనిపిస్తోంది.
 
తత్వపరంగా చూస్తే ...
ఈ అనంత ప్రకృతి స్వరూపిణీయిన పరాశక్తి యొక్క ప్రేమానంద స్వరూపమే రాధ. ఈ ప్రకృతి జీవులలో ఆ శక్తి  భక్తి రసమూర్తిగా స్ఫురిస్తే, పరమాత్మలో కృపారస స్పూర్తిగా మూర్తీభవిస్తే అదే “రాధాతత్వం”. విశ్వ ప్రకృతిలోని విద్యాశక్తి సరస్వతి, ఐశ్వర్య శక్తి లక్ష్మి, ఇచ్చాఙ్ఞానక్రియాత్మక శక్తి గౌరి, కాలస్వరూపం కాళి, ప్రతాపరూపం దుర్గ, జలరూపం గంగ, వేదస్వరూపం గాయత్రి. ఇలా విభిన్న శక్తుల విభిన్న రూపాలుగా ఆరాధింపబడి ఆ శక్తుల సమృద్ధి జగదంబకృపగా లభిస్తోంది. అలాగే భగవంతుని వైపు బుద్ధిని నిలిపి, సర్వ సమర్పణతో ఆ”రాధి"ంచే భక్తి శక్తి రాధ.
 
“సాత్మస్మిన్ పరమప్రేమరూపామృత స్వరూపా
కేవల అవిచ్చిన్న అనుభవరూపా”
 
అని నారదుడి భక్తి సూత్రాలలో వివరించిన భావనని రూపు కడితే అదే రాధా రూపం.
 
శ్రీకృష్ణుడు భూలోకాన తాను అవ్తరిస్తూ గోలోకాన్నే భూమికి అవతరింపచేసాడు. అదే బృందావన వ్రజభూమి. గోలోకరాణిగా శ్రీరాధాదేవి వృషభానుడనే గోపరాజు ఇంట ఆవిర్భవించింది. అనేక జన్మల పుణ్యాలున్న వారికే రాధోపాసన లభిస్తుంది. ఉత్తరాది, వంగదేశం మొదలైన చోట్ల రాధోపాసన ప్రసిద్ధి. అయితే తెలుగులో ప్రబంధ యుగం తరువాత అనుకరణ ప్రబంధాలుగా అశ్లీలాన్ని వెలువరించిన క్షుద్రులు రాధాకృష్ణ చరిత్రను తప్పుడు భావనలతో, స్వకపోల కల్పనలతో తప్పుదారి పట్టించారు. 
 
భాద్రపద శుద్ధ అష్తమినాడు శ్రీరాధాదేవి వ్రజభూమిలో “బర్సానా” అనే ప్రాంతంలో ఆవిర్భవించింది. కనుక ఆ రోజున “రాధాష్టమి”గా మహా వైభవంగా నిర్వహిస్తారు.

“శ్రీరాధా కృపాకటాక్ష స్తవరాజము” స్తోత్రాన్ని పూర్ణిమ, శుద్ధాష్టమి, దసమి, ఏకాదశి, త్రయోదశి నాడు పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి లభిస్తుంది.    

Thursday, June 14

శ్రీకృష్ణుని జననం గురించి కొన్ని అంశాలు (2)

మహాభారతంలో మౌసలపర్వం ఆధారంగా తేలే విషయం ఏమిటంటే, పరీక్షిత్తు పట్టాభిషేకం జరిగిన 36ఏళ్ళకి పూర్వమే “మహాభారత సంగ్రామం” జరిగింది. అదే సంవత్సరంలోఒక విశేషం జ్యోతిశ్శాస్త్ర రీత్యా సంభవించింది. ఒకే రోజులో మూడు తిధులు వచ్చాయి. రోజు ప్రారంభంలో త్రయోదశి ఉండి, అదే రోజు చివరికి అమావాస్య. ఇలా కొన్ని వందల సంవత్సరాలకి కాని సాధారణంగా సంభవించదు. ఇది జరిగినప్పుడు భయంకర యుద్ధాలు గాని, జననష్టం గాని జరగవచ్చు.

36 సంవత్సరాల తరువాత అంటే, శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన సంవత్సరంలోనూ ఇదే విపరీతం చూసి శ్రీకృష్ణుడు యాదవుల వినాశనాన్ని, రానున్న కలియుగాన్ని మహాభారతంలో తెలిపినట్లు కొన్ని శ్లోకాలు స్పష్టీకరిస్తున్నాయి.
అలాగే, భీష్మ నిర్యాణం శోభాకృత నామ సంవత్సరం. శుక్రవారం, రోహిణి నక్షత్రం, తృతీయ పాదం పగలు 2ఝాములకు జరిగింది.

మహాభారతం మొదలైన 67వ రోజు భీష్మ నిర్యాణం జరిగింది. అనగా కలి పూర్వం 36 వ సంవత్సరం (3138 బి.సి). ఆ సంవత్సరంలోనే ధర్మరాజు భారతవర్ష చక్రవర్తిగా పటాభిషిక్తుడయ్యాడు. ధర్మరాజు రాజ్యకాలం 64ఏళ్ళు. కలిపూర్వం 36సంవత్సరాలు..

ఈ ఆధారాలను బట్టి చూస్తే ఈ అంశాలన్ని సరిపోయే సంవత్సరం, నెల, తేది, ఖగోళ రీత్య లెక్కకట్టవచ్చు
ఇలా గణించి చూసినట్లైతే, శ్రీకృష్ణుడు జన్మించిన తేది 19.జూలై.3228 బి.సి(ఇప్పటి క్యాలెండర్ ప్రకారం) అని తెలుస్తుంది. తిధుల ప్రకారం ఆ రోజు అంటే జూలై 19, 3228 బి.సి నాటికి శ్రీముఖ నామ సంవత్సరం నడుస్తోంది. శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, చతుర్ధ చరణం

అనేక సంస్కృత మూల గ్రంధాలలో ఉన్న శాస్త్రాధారాలు అన్నింటిలోనూ తేడాలు లేకుండా ఈ కాలం సరిగ్గా సరిపోతోంది. ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి...శ్రీకృష్ణుడు మహాపురుషుడు అనడానికి మరియు ఆయన ఎంతకాలం క్రితం ఈ గడ్డపై నివసించాడో తెలుసుకోడానికి?

****************హరే కృష్ణ***************

Sunday, June 10

శ్రీకృష్ణుని జననం గురించి కొన్ని అంశాలు (1)

(శ్రీకృష్ణుని జననం పై వేదవ్యాస్ గారు వ్రాసిన ఆర్టికల్ నుండి సేకరించిన సంక్షిప్త వివరణ)

శ్రీకృష్ణుని చరిత్ర చదివిన, తెలిసిన వాళ్ళందరికీ అలాంటి మనిషి నిజంగానే పుట్టి ఉంటారా లేక కల్పితమా అన్న సందేహం కలుగక మానదు. కాని, శ్రీకృష్ణుడు కేవలం వ్యాసమహాముని ఊహాజనిత పాత్ర కాదని, చారిత్రక పురుషుడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి.
ఈ విషయాలన్నిటికంటే ముందు శ్రీకృష్ణుడు జీవించిన కాలం గురించి ప్రస్తావించుకోవాలి.
మహాభారతం ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటేనే చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా ఏర్పడిన ఇతివృత్తం గల గ్రంధం అని అర్ధం. కొందరు మహాభారతం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో రాసిందని, లేక 1000 బి.సి లో రాసిందని వాదిస్తారు. వాళ్ళంతా ఇంకా పాశ్చాత్యుల బానిసత్వం పోని చరిత్రకారులే. వారి వాదనకు ఖచ్చితమైన ఆధారాలు ఉండవు.

చరిత్రలో ఒక విషయానికి సంబందించి కాల నిర్ణయం చేయాలంటే కొన్ని శాస్త్రీయ పద్దతులు ఉన్నాయి. అందులో
రేడియొ ధార్మిక పద్దతి, పురావస్తు పరిశోధనలో ఉపయోగిస్తారు. అయితే, మహాభారతం ఈ శాస్త్ర పరిశోధన కిందకు రాదు. రెండోది, గ్రహస్థితులను బట్టి, ఖగోళ శాస్త్రం ఆధారంగా కూదా కాలనిర్ణయం చేయవచ్చు అని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నిరూపించారు.

ఈ విషయంలో అతి ప్రాచీనమైన ప్రమాణ గ్రంధాలు చరిత్రకి ఆధారంగా పనికి వచ్చేవి. సంస్కృత మహాభారతం, విష్ణు పురాణం (సంహిత), భాగవతం, హరివంశం. ఇందులో సంస్కృత భాగవత నుండి మనకు తెలిసే విషయం ఏమిటంటే, ఏ రోజైతే శ్రీకృష్ణుడు తనువు త్యజించారో, సరిగ్గా ఆ రోజునే "కలియుగం" ప్రారంభమైంది. ఆరోజు ఏదై ఉంటుంది?


ఇక రెండో విషయం, శ్రీకృష్ణుని జనన కాలనిర్ణయం, భాగవతం దశమస్కంధం 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజున "ప్రజాపతి" నక్షత్రం ఉన్నదని తెలుస్తోంది. ప్రజాపతి నక్షత్రం అంటే, రోహిణి నక్షత్రం. విష్ణుపురాణం ఆధారంగా శ్రీకృష్ణ భగవానుడు శ్రాణమాసంలో, బహుళపక్షంలో, అష్టమి తిధి ఉండగా జన్మించాడని తెలుస్తోంది. ఈ వివరాలు తిధి, వార, నక్షత్రాలను తెలుపుతున్నాయి. మరి సంవత్సరం మాటేంటి? హరి వంశం, విష్ణు పురాణం నుండి కొన్ని ఆధారాలను బట్టి చూస్తే, కృష్ణుని తిధి, వారం, నక్షత్రం అన్నీ కూడా సరిగ్గా సరిపోతాయి. భాగవతం ప్రకారం అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు.

“సప్తర్షీణాంతు యవ్ పూర్వే, దృశ్యే తేహ్యుదితేదివి

తేతుపారిక్షితే కలె మాఘాస్వాసన్ మహర్షయః”

ఆనాడు మరో ఖగోళ విశేషం ఏంటంటే, సప్తమహర్షుల నక్షత్రాలు. యుధిష్టురుడి కాలంలో మఖా నక్షత్రంలో ఉన్నట్లు, శతాబ్దకాలం అనగా యుధిష్టరుడు రాజ్యపాలన పూర్తి చేసే కాలం దాక నిలిచి ఉన్నట్లు ఈ శ్లోకం మనకు తెలుపుతుంది
ఇదే విషయం విష్ణుపురాణంలోనూ రుజువవుతోంది. శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన సంవత్సరమే పరీక్షిత్తు మహారాజు పట్టాభిషేకం జరిగింది. అదే ఏడు ధర్మరాజు రాజ్యపరిత్యాగం చేయడం జరిగింది

Saturday, September 3

మధురాష్టకం


అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం

హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం
వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం

చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం
వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ

నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం
గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం

రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం
కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం
వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం
గుంజా మధురా బాలా మధురా యమునా మధురా వీచీ మధురా

సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం
గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం

దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం
గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా

దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం
ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం

Saturday, August 20

శ్రీ కృష్ణాష్టకమ్

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్దురుమ్

అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్దురుమ్


కుటిలాలకసంయుక్తం - పూర్ణ చంద్రనిభాననం
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్దురుమ్

మన్దారగంధంసంయుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్దురుమ్


ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్దురుమ్

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్దురుమ్


గోపికానాం కుచద్వన్ద్వ కుంకుమాంకితవక్షసం
శ్రీ నికేతనం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్

శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్దురుమ్

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాత రుత్థాయ య: పఠేత్
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి

ఇతి శ్రీ కృష్ణాష్టకమ్

Friday, August 19

శ్రీకృష్ణాష్టమి

ద్వాపర యుగం, శుక్ల నామ సంవత్సరంలో, శ్రావణమాసం, బహుళపక్షం, రోహిణి నక్షత్రం. అష్టమినాడు, రెండు ఝాముల రాత్రివేళ, మేనమామ గండంతో చిన్నికృష్ణుడు జన్మించాడు. జయంతి అంటే రాత్రి అనే అర్ధాన్ని బ్రహ్మాండపురాణం తెలుపుతోంది. కృష్ణుడు జన్మించిన అష్టమికి కొందరు ప్రాధాన్యం ఇస్తే, మరికొంతమంది రోహిణి నక్షత్రానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ కారణాలవల్ల ఒకరోజు అటుఇటు కృష్ణాష్టమిని జరుపుకొంటారు.


కృష్ణాష్టమి రోజు చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వాలని, బంగారు లేదా వెండితో తయారుచేసిన చంద్రబింబాన్ని వెండి/బంగారు పాత్రలో ఉంచి పూజించి ఆర్ఘ్యమిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని పెద్దలంటారు. తరువాత శ్రీకృష్ణుని పూజ చేయాలి.
లీలామానుషధారుడైన ఆ బాలకృష్ణుని బాల్యక్రీడలను మాత్రమే భక్తులు ఎక్కువగా స్మరించుకొంటారు, అందుకు గుర్తుగా ఉట్లు కొట్టడం, చిన్నపిల్లలను కృష్ణునిలా అలంకరించి వారి పాదాలతో చిన్నిచిన్ని అడుగులు వేయించి, ఆ బాల కృష్ణుని అడుగులవలే భావించి, కృష్ణుడే తమ ఇంటికి వచ్చాడనే తీయ్యని అనుభూతిలో మునిగిపోతారు.

ఈ రోజున స్వామికి నైవేద్యంలో మినపపిండితో పంచదారను కలిపి చెసిన పదార్ధాన్ని పెడుతారు. మరికొందరు శొంఠి, బెల్లంపానకం, నెయ్యితో కలిపి చేసిన మిశ్రమాన్ని నైవేద్యంగా పెడ్తారు. ఆరో ఏట గోపికా వస్త్రాపహరణం, ఏడో ఏటనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం చేసిన కన్నయ్య జన్మించినది అర్ధరాత్రి కాబట్టి జన్మదినోత్సవాన్ని అర్ధరాత్రి జరుపుకోవడం పద్దతి. కృష్ణ విగ్రహాన్ని పొన్నపూలతో పూజ, 16 పిండివంటలతొ నైవెద్యం పెట్టడం ఆచారం.

కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానస రాజహంసః||
ప్రాణ ప్రయాణ సమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ||
ఓ కృష్ణా! మరణ సమయంలో నిన్ను స్మరిస్తూ నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది. కాని! ఆ వేళ కఫవాత పైత్యాలతో కంఠం మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజహంస'ను శత్రు అభేద్యమైన 'నీ పాద పద్మ వజ్రపంజర'మందు ఉంచుతున్నాను తండ్రీ...!