సంవత్సరంలో 12నెలలు సాధారణంగా వస్తాయి. అయితే ఈ మాసాలు కాకుండా అధికంగా ఒక మాసం వస్తుంటుంది. దాన్నే అధికమాసం అంటాము. మాసాల గణన ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉంటుంది. దక్షిణాదిన చాంద్రమానాన్ని, ఉత్తరాదిన సూర్యమానాన్ని అనుసరిస్తారు. చాంద్రమానంలో ప్రతినెల అవధిగా అమావాస్యను పరిగణిస్తే, సూర్యమానంలో పౌర్ణమిని నెల అవధిగా తీసుకుంటారు. చాంద్రమానంలో సంవత్సరానికి 354 రోజులు, సూర్యమానంలో ఏడాదికి 365 రోజులు. సూర్యమానానికంటే 11రోజులు తక్కువగా చాంద్రమానం ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసినదే అధికమాసం. ఈ ఏడాది ఆగష్టు 18న మొదలై సెప్టంబరు 16 వరకు ఉంటుంది.
అధికమాస నిర్ణయం సౌరమాసానుసారంగా జరుగుతుంది. సూర్యుడు ప్రతిమాసంలోనూ ఒక రాశి నుండి మరొకరాశిలోకి మారుతాడు. దీనినే సూర్యసంక్రమణం అంటారు. చాంద్రమానంలోనూ సూర్యసంక్రమణ జరుగుతుంది. అయితే ఒక మాసంలో మాత్రం సూర్యుడు రాశి మారడు. అంటే సంక్రమణ జరగదు. దీనినే అధికమాసం అంటారు. ఈ ఏడాది భాద్రపద మాసంలో అధికమాసం వస్తున్న కారణంగా దీనిని అధిక భాద్రపద మాసం అంటారు. మాములుగా 2/3 సంవత్సరాలకొకసారి అధికమాసం వస్తుంది. సూర్య, చాంద్రమానాల మధ్య సమన్వయం చేయడానికి అధికమాసాన్ని వేదకాలంలోనే ఏర్పాటు చేసారు.
సూర్య సిద్ధాంతం ప్రకారం, సూర్యుడు చుట్టు భూమి తిరగడానికి పట్టే కాలం 365 రోజుల, 6 గంటల, 12 నిమిషాల, 26 సెకండ్లు. దీనిని నక్షత్రిక గణనము అంటారు. ఆధునిక శాస్త్రపరంగా గాని, సూర్య సిద్ధంతపరంగా గాని చంద్రుడు భూమి చుట్టు 29.53 రోజులలో తిరుగుతాడు. దీనిని రెండు మాసాలుగాను, ఒక్కో పక్షాన్ని 15 తిధులుగాను విభజించబడినది. ఒక్కో తిధి కనిష్టంగా 21 గంటల నుండి గరిష్టంగా 26 గంటల వ్యవధి కల్గి ఉంటుంది. దీని ప్రకారం 354 రోజులలో 12 మాసాలు పూర్తి అవుతాయి. ఈ నందన నామ సంవత్సరంలో వచ్చే అధిక భాద్రమాసంలో రవి ఆగష్టు 17 ఉదయం 8.05 గంటలకు సింహరాశిలో ప్రవేశించి సెప్టంబరు 17 ఉదయం 8.23 వరకు ఉంటాడు. ఈ మాసం శుభకార్యాలకు పనికిరాదు. అధికమాసంలో సంధ్యావందనం, దేవతార్చన వంటి నిత్య కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించుకోవచ్చు. అలాగే ఏకాదశి, మాసశివరాత్రి వంటి వ్రతాలను జరుపుకోవచ్చు. ఆబ్ధికాలు మాత్రం అధిక మాసంలోను, నిజమాసంలోనూ రెండుసార్లు చేయాల్సి ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment