Friday, November 20

సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం

సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన ప్రవచానాలు నాకు చాల ఇష్టం. ముఖ్యంగా లలిత సహస్రనామ ప్రవచనం చాల బాగుంది. ప్రస్తుతం శర్మ గారు చెప్పిన రుద్ర బాష్యం వీడియో ని పెడ్తున్నాను.

ఎవరికైన శర్మ గారు చెప్పిన లలిత భాష్యం లింక్స్ తెలిస్తే , నాకు తెలియపరచ గలరు. ధన్యవాదములు.









Friday, May 29

లింగాష్టకం

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
బ్రహ్మ = బ్రహ్మ దీవుడు
మురారి
= ముర + అరి = ముర అనే రాక్షసుడి శత్రువైన విష్ణు
సుర
= దేవతలు
అర్చిత
= పూజింపబడిన లింగం = శివ లింగం
బ్రహ్మ , విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం

నిర్మల భాషిత శోభిత లింగం
నిర్మల = నిర్మలమైన
భాషిత = మాట్లాడబడ్డ = మాట
శోభిత = అలంకరింపబడ్డ
లింగం = శివ లింగం
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం …


జన్మజ దుఃఖ వినాశక లింగం
జన్మ = భౌతిక్యమైన ఉజ = పుట్టిన దుఃఖ = బాధలు వినాశక = నాశనం చేసే
లింగం = శివ లింగం
జన్మ వల్ల పుట్టిన బాధల ను నాశనం చేసే లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
తత్ = నీకు
ప్రణమామి = నమస్కారం
సదా శివ లింగం = సదా శివ లింగం ..
ఓ సదా శివ లింగం నీకు నమస్కారం !


దేవముని
ప్రవరార్చిత లింగం
దేవముని = దేవ మునులు ( నారద , తుంబుర మొదలైన వారు )
ప్రవర = మహా పురుషులు ( మహా ఋషులు )
అర్చిత = పూజింప బడ్డ
లింగం = శివ లింగం
దేవమునులు , మహా ఋషులు పూజింప లింగం

కామదహన
కరుణాకర లింగం
కామ = మన్మథ
దహన = కాల్చడం
కరుణాకర = కరుణను చూపే
లింగం = శివ లింగం
మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం
(ఇంకొక అర్ధము .. కామా = తుచ్చమైన ఊరిక్యలను అంతం చేసే , కరుణను చూపే చేతులు అల
లింగం )

రావణ దర్ప వినాశక లింగం
రావణ = రావణుడి
దర్ప = గర్వాన్ని
వినాశక = నాశనం చేసినట్టి
లింగం = శివ లింగం
రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం

తత్ ప్రణమామి సద శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

సర్వ సుగంధ సులేపిత లింగం
సర్వ = అన్ని
సుగంధ = సుగంధాలు
సు = మంచి
లేపిత = పూసిన
లింగం = శివ లింగం
అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం

బుద్ధి వివర్ధన కారణ లింగం
బుద్ధి = జ్ఞానం
వివర్ధన = వికసించడానికి
ఆరన్ = కారణమైన
లింగం = శివ లింగం
మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన
శివ లింగం .

సిద్ధ సురాసుర వందిత లింగం
సిద్ధ
= సిద్ధులు
సుర = దేవతలు
అసుర = రాక్షసులు
వందిత = కీర్తింపబడ్డ
లింగం = శివ లింగం
సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

కనక మహామణి భూషిత లింగం
కనక = బంగారు
మహా మణి = గొప్ప మణులు
భూషిత = అలంకరింప బడ్డ
లింగం = శివ లింగం
బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగం
ఫణిపతి = నాగ రాజు
వేష్టిత = నివాసముండే
శోభిత = విరాజిల్లే , అలంకరింపబడ్డ , శోభించే
లింగం = శివ లింగం
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం ( అంటే శివుడి మెడ చుట్టూ పాము ఉంటుంది కదా .. అలా పాము వల్ల అలంకరింపబడ్డ అని .)


దక్ష సుయజ్ఞ వినాశక లింగం
దక్ష = దక్షుడి
సుయజ్ఞ = మంచిదైన యజ్ఞం
వినాక్షక = నాశనం చేసిన
లింగం = శివ లింగం
దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం ( ఈ సందర్భం లో శివుడి భార్య సతీ దేవి అగ్ని లో పది ఆత్మా హత్య చేసుకొని , పార్వతి గా మళ్ళీ అవతరిస్తుంది )


తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

కుంకుమ చందన లేపిత లింగం
కుంకుమ = కుంకుమ
చందన = గంధము
లేపిత = పూసిన
లింగం = శివ లింగం
కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం

పంకజ హార సుశోభిత లింగం
పంకజ = పద్మం , కమలం
హార = దండ
సు = మంచి గా
శోభిత = అలంకరింప బడ్డ
లింగం = శివ లింగం
కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం

సంచిత పాప వినాశక లింగం
సంచిత = సంక్రమించిన
పాప = పాపం
వినాశక = నాశనం చేసే
లింగం = శివ లింగం
సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

దేవగణార్చిత సేవిత లింగం
దేవగణ = దేవగణాల
అర్చిత = పూజింప బడ్డ
సేవిత = సేవించ బడ్డ
లింగం = శివ లింగం
దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం

భావైర్ భక్తీ భిరేవచ లింగం
భావైర్ భక్తీ = భావ సహితమైన భక్తీ
లింగం = శివ లింగం
చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం

దినకర కోటి ప్రభాకర లింగం
దినకర = సూర్య
కోటి = కోటి
ప్రభాకర = సూర్య
లింగం = శివ లింగం
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు ,ఓ సదా శివ లింగమా ..!

అష్ట దలోపరి వేష్టిత లింగం
అష్ట = ఎనిమిది
దళ = దళాల
ఉపరి = మీద
వేషిత = నివసించు
లింగం = శివ లింగ
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం

సర్వ సముద్భవ కారణ లింగం
సర్వ = అన్నీ
సమ = సమానంగా
ఉద్భవ = జన్మించు
కారణ = కారణం
లింగం = శివ లింగం
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం

అష్ట దరిద్ర వినాశక లింగం
అష్ట = ఎనిమిది
దరిద్ర = దరిద్రం
వినాశక = నాశనం చేసే
లింగం = శివ లింగం
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు ) నాశనం చేసే శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు ,ఓ సదా శివ లింగమా ..!

సురగురు సురవర పూజిత లింగం
సుర = దేవతలు
గురు = గురువు
సురవర = దేవతలు
పూజిత = పూజింప బడ్డ
లింగం = శివ లింగం
దేవ గురువు (బృహస్పతి ), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం

సురవన పుష్ప సదార్చిత లింగం
సుర = దేవతలు
వన = తోటలు
పుష్ప = పువ్వులు
సదా = ఎప్పుడూ
అర్చిత = పూజింప బడు
లింగం = శివ లింగం
దేవతల తోటల్లో పూచే పువ్వులు ( పారిజాతాలు ) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం

పరమపదం పరమాత్మక లింగం

పరమ పదం = చివరి చరణం , చివరి మజిలీ , స్వర్గము
పరమాత్మక = పరమాత్మ కు సంబంధించిన
లింగం = శివ లింగం
ఓ శివ లింగమా , నీ సన్నిధి ఏ ఒక స్వర్గము

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

లింగాష్టక మిదం పుణ్యం
లింగాష్టకం – లింగాష్టకం
ఇదం – ఇది
పుణ్యం - పుణ్యం
ఇది శ్రీ లింగాక్ష్టకం

యః పట్టేత్ శివ సన్నిధౌ
యః పట్టేత్ = ఎప్పుడు చదవబడుతుందో
శివ సన్నిధౌ = శివుడి సన్నిధిలో
ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది

శివ లోక మవాప్నోతి శివ లోకం లభిస్తుంది
శివేన సహమోదతే శివుడి లో నే ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది

అంటే , ఈ లింగాష్టకం అనేది శివుడి సన్నిధిలో ఎప్పుడు చదువుతామో , అప్పుడు మనకు శివ సాయుజ్యం దొరుకుతుంది అని అర్థం …!



Tuesday, March 24

ఉగాది , తెలుగు సంవత్సరాది.(మార్చి 27)

యుగము + ఆది...ఉగాది, తెలుగు సంప్రదాయం ప్రకారం మనం జరుపుకొనే నూతన సంవత్సరం. తెలుగు సంవత్సరం పేరు "విరోధినామ" సంవత్సరం. చైత్రశుద్ద పాడ్యమి రోజున ఉగాది గా తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది.

రామాయణ కాలం లో ఉత్తరాయణం మొదటి రోజును ఉగాదిగా జరుపుకొనే వారు. కొద్దికాలం తర్వాత వరాహమిహిరుడు అనే మహర్షి చైత్రశుద్ద పాడ్యమి నాడు ఉగాది ని జరపడం ప్రారంబించారు. అప్పటినుండి అదే ఆనవాయితి గా మారింది.
ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణం పండగ ప్రత్యేకత. పొద్దునే లేచి, తలంటు స్నానాలు చేసి, పూజ జరిపి, ఉగాది పచ్చడి తింటే కాని మరేది తినం. అలాగే పంచాంగం వింటాం. రాశిఫలాలు ఎలా ఉన్నాయి, పంటలు, వర్షాలు మొదలైన వాటి గురించి తెల్సుకొంటాం.
షడ్రుచుల
కలయకే ఉగాదిపచ్చడి. (బెల్లం/తీపి, వేప పువ్వు /చేదు, మిరపకాయ/కారం, చింతపండు/పులుపు, మామిడికాయ/వగరు, ఉప్పు) మన జీవితం లో వచ్చే ఎగుడు/దిగుడులు, శుఖ సంతోషాలను ఒకేలా తీసుకోవాలని ( సంతోషం వచ్చినపుడు పొంగిపోయే, దుఖం వస్తే కుంగిపోవడం లా కాకుండా ) ఉగాది పచ్చడి లో ని అంతరార్ధం.

Thursday, March 12

అన్నమాచార్య కీర్తనలు

రాగం: ఆభోగి
ప|| అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని ||

చ|| కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక ||

చ|| జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక ||

చ|| మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక ||

----------------------------------------------

రాగం: హిందోళం

ప|| అదివో అల్లదివో శ్రీహరివాసము |
పదివేల శేషుల పడగల మయము ||

చ|| అదె వేంకటాచల మఖిలోన్నతము |
అదివో బ్రహ్మాదుల కపురూపము |
అదివో నిత్య నివాసమఖిల మునులకు |
అదె చూడడదె మ్రొక్కుడా నందమయము ||

చ|| చెంగట నల్లదివో శేషాచలము |
నింగినున్న దేవతల నిజనివాసము |
ముంగిట నల్లదివో మూలనున్న ధనము |
బంగారు శిఖిరాల బహు బ్రహ్మమయము ||

చ|| కైవల్య పదము వేంకట నగమదివో |
శ్రీవేంకటపతికి సిరులైనది |
భావింప సకల సంపద రూపమదివో |
పావనములకెల్ల పావనమయము ||

-------------------------------------------------

ప|| అన్ని మంత్రములు నిందే యావహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ||

చ|| నారదుడు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము |
వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము ||

చ|| రంగగు వాసుదేవ మంత్రము ధౄవుండు జపించె
సంగవించె కౄష్ణ మంత్రము అర్జునుడును
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠియించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ||

చ|| ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరానాథుడె గురి
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము |
నన్ను గావ గలిగేబో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము ||


Saturday, February 21

శివరాత్రి

పరమ శివునికి ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి... రోజు అర్ధరాత్రి సమయానికి లింగోద్భవం జరుగుతుంది.లింగోద్భవం శివ భక్తులకు పుణ్యకాలం.మహా శివరాత్రి ప్రతిఏటా మాఘ మాసంలో బహుళ చతుర్దశి తిథినాడు వస్తుంది.



'శివరాత్రి మహో రాత్రం నిరాహరో జతేన్ద్రియః

అర్చయేద్వా యథాన్యాయం యథాబలయవంచకః

యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరమ

తత్ఫలం లభతే సధ్యః శివరాత్రే మదర్చనాత్'అని శ్రుతి...


శివరాత్రి పుణ్యం దినంనాడు ఉపవాసం చేసి, కామ క్రోధాది ఇంద్రియ చాపల్యాలకు లోనుకాకుండా, నిగ్రహంతో వ్యవహరించి మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా పరమేశ్వరుడిని ఆరాధిస్తే ఏడాది అంతా శివార్చన చేసిన ఫలితం కలుగుతుందని మహేశుడు బ్రహ్మకు చెప్పాడు. మహా శివరాత్రి అని మనం ఇప్పుడు చేసుకునే శివరాత్రి జగన్మాత కాత్యాయని వర ప్రసాదం. ఆమె కఠోర తపఃఫలం వల్ల ఏర్పడిందే శివరాత్రి.

Thursday, February 12

నమకం చమకం

మహా శివుడిని అర్చించడం లో రుద్రం కి చాల ప్రాధాన్యత ఉంది. యజుర్వేదం నుండి రుద్రం సంగ్రహించబడినది. రుద్రం నమకం, చమకం అని రెండు భాగాలుగా ఉంది. యజుర్వేదం 16 అధ్యాయాన్ని నమకం అంటారు. "నమో" అనే పదం ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి నమకం గా పిలవటం జరిగింది. యజుర్వేదం 18అధ్యాయాన్ని చమకం అంటారు. ఇక్కడ "చమే" అనే పదం ఎక్కువగా ఉపయోగించారు. రుద్రం ని 11 అనువకాలు(విభాగాలు) గా విభజించారు.

తెలుగు లో స్పష్టం గా నమకం చమకం లింక్ లో చూడవచ్చు.

http://www.telugubhakti.com/telugupages/Siva/namakchamak1.htm








Sunday, February 1

రధ సప్తమి (02.02.09)

ఉష (చాయాదేవి ), ప్రత్యూష సమేత శ్రీ సూర్య నారాయణ స్వామి

ఉదయం బ్రహ్మ స్వరూపం
మధ్యాహ్నంతు మహేశ్వరం
సాయంకాలే స్వయం విష్ణుః
త్రిముర్తిస్తూ దివాకరః

సూర్య భగవానుడు ఉదయం వేళ బ్రహ్మ రూపంగాను, మద్యాహ్నం ఈశ్వరుని గాను, సాయంత్రం విష్ణు రూపుడిగా ఉంటాడు. త్రిసంద్యలలో మనం సూర్య దేవునిని ప్రార్దిస్తే త్రిమూర్తులకు పూజలు చేసినంత ఫలితం ఉంటుంది.

మాఘ శుద్ద సప్తమి రోజున రధసప్తమి గా జరుపుకొంటాము. సప్త అశ్వ రధారూడా....7 గుర్రాలతో ఉన్న రధా న్ని అధిరోహించే సూర్య భగవానుడు తన దిశా నిర్దేశమును ఈరోజు నుండే మార్చుకొంటాడు.


ఈరోజు మనం జిల్లేడు ఆకులను తలమీద, భుజాల మీద ఉంచుకొని అభ్యంగన స్నానం చేస్తాము. తర్వాత 7 చిక్కుడు ఆకులలో పరమాన్నం శ్రీ సూర్య భగవానుడికి నైవేద్యం గా సమర్పించి పూజిస్తాము. రోజు నుండి పగటి వేళ సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది.

రామాయణం లో ని ఆదిత్యహృదయం చదివితే మంచి ఫలితం ఉంటుంది.

Monday, January 12

సంక్రాంతి

సూర్యభగవానుడు దక్షిణాయనం (దేవతలకు రాత్రి సమయం) నుండి ఉత్తరాయణం (దేవతలకు పగలు) లో కి ప్రవేశించే సమయం లో మనం సంక్రాంతి పండగను జరుపుకొంటాము. సంక్రాంతి అనే సంస్కృత పదానికి అర్దము శుభ సమయము.
ఆంగ్ల సంవత్సరం ప్రకారం మనకు వచ్చే మొదటి పండగ. మేము ఐతే పండగను పెద్దపండ అని పిలుస్తాము.

సంక్రాంతి నాల్గురోజుల పండగ. మొదటి రోజు భోగి. తెలవార్జామునే లేచి ఇంటి ముంగిట భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఉన్నపాత / వాడని వస్తువులు, తాటాకులు బోగిమంటలో వేస్తారు. రైతులకు పంట చేతికి వచ్చి ఇల్లు చేరుస్తున్న సమయంలో ఇంటిని శుభ్రం చేస్తూ ఇంట్లో ఉన్నచెత్త అంతా భోగి మంటల రూపం లో వేసి ఇంటిని కొత్త ధాన్యానికి అనుగుణంగా మలుస్తారు. భోగిమంటలో కాల్చిన తేగలు ఎంత రుచిగా ఉంటాయి అంటే మాటలలో చెప్పలేను.
దారిద్ర్యాన్ని నశిం చేస్తూ శ్రీ మహా లక్ష్మి ని మన ఇంటికి ఆహ్వానిస్తున్నమనే భోగి యొక్క అర్ధము.
నాల్గు రోజులు పార్వతి దేవిని గొబ్బెమ్మ రూపంలో పూజిస్తారు. కనుమ పక్కరోజు గొబ్బెమ్మను గర్లో న్న నదిలో కాని చెరువులో కాని, వసతి లేకపోతే పెరటిలోని బావిలో కాని వాలాడిస్తారు ( నిమర్జనం చేయడం).

రెండవ రోజు సంక్రాంతి...సంక్రాంతి అనగానే మనకు ముందుగ గుర్తు వచ్చేది ముఖ్యంగా ....
కొత్త అల్లుళ్ళు ,తెలవార్జామున వచ్చే జంగమ దేవరులు (సంక్రాంతి నెలలో మాత్రమే వస్తారు) , రిదాసులు, బుడబుక్కలవాడు, గంగిరెద్దువాళ్లు ,కోడి పందేలు, గాలిపటాలు, పిండివంటలు ముఖ్యంగా అరిసెలు, మణుగుపూలు(జంతికలు ).

రైతులకు పంట చేతికి వచ్చి ధాన్యాని ఇంటికి చేర్చే వేళ అందరు సంతోషం తో పొద్దునే లేచి వాకిట్లో కళ్ళాపి చల్లి రంగుల ముగ్గుల మద్యలో గొబ్బెమ్మలను (పార్వతిదేవి) పెట్టి, తలంటు స్నానాలు చేసి, పాలు పొంగించి కొత్త ధాన్యం తో పొంగలి వండి, దేవుడికి నైవేద్యం పెడతారు. సంక్రాంతి రోజు బొమ్మలకొలువు పెట్టే సంప్రదాయం కూడా చాలామందికి ఉంది.

మూడవరోజు కనుమ. రైతులు తమ దగ్గర ఉన్నపశు సంపదకు (ఆవులు, ఎద్దులు ....) పూజ చేస్తారు. అవి తమ ధాన్య సంపాదనకు ఎంతగానో సహాయం చేసినందుకు వాటిని గౌరవిస్తూ పూజిస్తారు. నాల్గవరోజు ముక్కనుమగా జరుపుతారు.
కనుమ రోజు ఎటువంటి సందర్భం లోను ప్రయాణాలు చేయరు.