ఉదయం బ్రహ్మ స్వరూపం
మధ్యాహ్నంతు మహేశ్వరం
సాయంకాలే స్వయం విష్ణుః
త్రిముర్తిస్తూ దివాకరః
సూర్య భగవానుడు ఉదయం వేళ బ్రహ్మ రూపంగాను, మద్యాహ్నం ఈశ్వరుని గాను, సాయంత్రం విష్ణు రూపుడిగా ఉంటాడు. త్రిసంద్యలలో మనం సూర్య దేవునిని ప్రార్దిస్తే త్రిమూర్తులకు పూజలు చేసినంత ఫలితం ఉంటుంది.
మాఘ శుద్ద సప్తమి రోజున రధసప్తమి గా జరుపుకొంటాము. సప్త అశ్వ రధారూడా....7 గుర్రాలతో ఉన్న రధా న్ని అధిరోహించే సూర్య భగవానుడు తన దిశా నిర్దేశమును ఈరోజు నుండే మార్చుకొంటాడు.
ఈరోజు మనం జిల్లేడు ఆకులను తలమీద, భుజాల మీద ఉంచుకొని అభ్యంగన స్నానం చేస్తాము. తర్వాత 7 చిక్కుడు ఆకులలో పరమాన్నం శ్రీ సూర్య భగవానుడికి నైవేద్యం గా సమర్పించి పూజిస్తాము. ఈ రోజు నుండి పగటి వేళ సమయం ఎక్కువగాను, రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది.
రామాయణం లో ని ఆదిత్యహృదయం చదివితే మంచి ఫలితం ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment