Friday, August 20
వరలక్ష్మి వ్రతం
శ్రావణమాసంలో అతిముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. లక్ష్మి దేవి ని ఆవాహనం చేసి , మన తాహత మేరకు ఆమెకు ఉపచారాలు చేసి, సౌభాగ్యం, సంపద, అందరి క్షేమం కోసం పూజ చేస్తాం. ఈ వ్రతం రోజు కొందరు కలిశం పెడతారు, ఆ పద్ధతి లేని వారు అమ్మవారి పటానికి పూజ చేస్తారు.
స్కంద పురాణం లో వరలక్ష్మి వ్రతం గురించి పరమశివుడు, పార్వతి దేవి కి వివరిస్తారు. చారుమతి యొక్క కథే ఈ వ్రత కథ. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి కి ముందే వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి.
ఏ పూజ మొదలు పెట్టాలన్న, ముందుగా గణపతి ని పూజించాలి. ఆ ప్రకారం ముందుగా పసుపు వినాయకుడికి పూజ చేసి, అమ్మణ్ణి ని ఆవాహనం చేయాలి. కలిశా పూజ చేసి అమ్మవారిని ఆహ్వానించాలి. లక్ష్మి అష్టోత్రం చేసాక, తొమ్మిది ముడులతో కూడిన తోరాలకు తోరపు పూజ చేయాలి. వరలక్ష్మి వ్రత కథ చదివి, అమ్మణ్ణి కి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి, పూజలో పెట్టిన తోరం కట్టుకొని, ముతైదువులకు తాంబూలం ఇవ్వాలి. అమ్మవారి ప్రసాదం అందరు తీసుకోవాలి.
వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా పసుపు కుంకుమలకు, సౌభాగ్యానికి ప్రతీక. అమ్మవారి దయను పొందాలని ప్రతీ ముతైదువ అమ్మవారిని ప్రార్ధిస్తుంది. మనం చేయడమే కాదు, వ్రతం తెలియని వారికి చెప్పి చేయిస్తే మంచిఫలితం ఉంటుంది.
అమ్మవారి పూజలో పెట్టిన తోరమే మనకు శ్రీరామ రక్షా గా ఉండి కాపాడుతుంది.
వరలక్ష్మి వ్రతం పూజ విధానం / వరలక్ష్మి వ్రతం ఆడియో
Subscribe to:
Post Comments (Atom)
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment