శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పలశ్రీలక్ష్మీనరసింహరాజ
జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యసుత శ్రీ చరణా
జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సవితృకాఠకచయన పుణ్యఫల భరధ్వాజఋషి గోత్రసంభవా
జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘనసంఖ్యాబోదిత శ్రీ చరణా
జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాతా
జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా
జయవిజయీ భవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమః తన్నో దత్తః ప్రచోదయాత్
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ దత్తాత్రేయాయనమః
శ్రీ గురుదేవదత్తా శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము, జై గురుదేవ్
సద్గురు / సిద్ధమంగళ స్తోత్రము, పఠించినయెడల అనఘాస్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు బోజనము పెట్టినంత ఫలితము లభిస్తుంది. మండల దీక్ష వహించి, ఏకభుక్తము చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రహ్మనులకు బోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును, మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా, కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు.
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment