మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం, విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం భాష. [ ఇటీవల నమస్కారానికే అర్ధం మారిపోయింది, ఒక చేతిని పైకెత్తి నమస్తే అంటున్నారు, ఇంకొందరు వెటకారంగా కూడా ఉపయోగిస్తున్నారు ]
సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా "నమస్కారం / నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు. వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా తాకేలా గౌరవంగా చేయాలి.
- శివకేశవులకు నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి.[శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు ]
- హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించాలి.
- గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి
- తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి
- తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి
- యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.
2 వినదగు నెవ్వరు చెప్పిన..:
ఈ విషయాలకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే ఇంకా మంచిది. దొరికితే చెప్పండి.
ఈ విషయాలకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి. వాటికి కోడ్ చేస్తే మరింత ఉపయోగంగా ఉంటుంది. నమస్కారం అనే పదం ఎక్కడ నుంచి వచ్చిందో వికీ పీడియాలో కూడా ఉంది. దానికి పౌరాణిక, శాస్త్రీయ ఆధారాలను చేర్చగలరు.
Post a Comment