Saturday, February 18

మహా శివరాత్రి

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే
శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
ప్రతీ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి, పరమేశ్వరునికి అతి ప్రీతికరమైనది. అందుకే ఆ రోజును మాస శివరాత్రిగా పిలుస్తారు. అంతేగాక మాఘ బహుళ చతుర్దశి, శివునికి మరీ మరీ ఇష్టం. కావున ఆ రోజును మహా శివరాత్రిగా పాటిస్తాము.

శివాలయంలో ప్రదక్షిణా విధానం :

నందికి ఏ పక్కనుండి లోపలికి వెళ్తామో, అదే పక్కనుండి మాత్రమే వెనక్కు రావాలి
శివలింగం, నంది మధ్య నుండి లోపలికి వెళ్ళకూడదు.
నంది కొమ్ముల మధ్య నుండి చూస్తు శివుడిని స్మరించాలి.

జాగారం ఎందుకు?

శివరాత్రి అర్ధరాత్రి జ్యోతిర్మయమైన మహాలింగంగా శివుడు అవతరించాడు. అంతటి పుణ్య ఘడియలలో నిద్ర కు చోటివ్వడం తగదు.
నైవేద్యం చిమ్మిలి, విప్పనూనెతో దీపం పెట్టాలి. బిల్వ పత్రాలతో పూజ చేయాలి.
శివపంచాక్షరి జపంతో సర్వసిద్ధులను పొందవచ్చు. గురువు ఉపదేశాన్ని పొంది, సుఖాసనంపై కుర్చొని జపం చేయాలి.
శివుడు అభిషేక ప్రియుడు. మంచినీటితో అభిషేకం చేసినా భక్తుల కోర్కెలు తీర్చే భోలా శంకరుడు. విభూది అభిషేకం కూడ మంచిది.

మారేడు...

"మారేడు నీవని ఏరేరి తేనా, మారేడు దళములు నీ పూజకు" మనందరికి ఈ పాట విదితమే. దానధర్మాలు. యఙ్ఞ, యాగాలు చేయలేకపోయినా ఒక్క మారేడు దళముతో ఆ శివుడిని పూజిస్తే అంతకంటే మించినది లేదు. "త్రిదళం త్రిగుణాకరం, త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం". మారేడు వృక్ష మూలంలో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణువు, అగ్రభాగంలో ఈశ్వరుడు ఉంటారు.

మారేడు మహిమ

ఇంట్లో ఫ్రిడ్జ్ లేనివారు 10మారేడు ఆకులను బిందెడు నీటిలోవేస్తే, సరిగ్గా 10నిమిషాలలో నీరు చల్లబడుతాయి.

2 వినదగు నెవ్వరు చెప్పిన..:

శేఖర్ (Sekhar) said...

Thanks for letting know
Will try the last one :)

siva ganesh said...

Excellent.I am proud to be siva devotee.Thanks for this.

siva ganesh