Thursday, August 26
దక్షిణామూర్తి స్తోత్రం
ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే |
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపం || 1||
అద్రాక్షమక్షీణదయానిధానమాచార్యమాద్యం వటమూలభాగే |
మౌనేన మందస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదంతం || 2||
విద్రావితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనాం |
నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధం || 3||
అపారకారుణ్యసుధాతరంగైరపాంగపాతైరవలోకయంతం |
కఠోరసంసారనిదాఘతప్తాన్మునీనహం నౌమి గురుం గురూణాం || 4||
మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః |
ఓంకారరూపాముపదిశ్య విద్యామావిద్యకధ్వాంతమపాకరోతు || 5||
కలాభిరిందోరివ కల్పితాంగం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిం |
ఆలోకయే దేశికమప్రమేయమనాద్యవిద్యాతిమిరప్రభాతం || 6||
స్వదక్షజానుస్థితవామపాదం పాదోదరాలంకృతయోగపట్టం |
అపస్మృతేరాహితపాదమంగే ప్రణౌమి దేవం ప్రణిధానవంతం || 7||
తత్త్వార్థమంతేవసతామృషీణాం యువాఽపి యః సన్నుపదేష్టుమీష్టే |
ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలైరాచార్యమాశ్చర్యగుణాధివాసం || 8||
ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః |
స్వజానువిన్యస్తకరః పురస్తాదాచార్యచూడామణిరావిరస్తు || 9||
ఆలేపవంతం మదనాంగభూత్యా శార్దూలకృత్త్యా పరిధానవంతం |
ఆలోకయే కంచన దేశికేంద్రమజ్ఞానవారాకరవాడవాగ్నిం || 10||
చారుస్మితం సోమకలావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపం |
ఉపాసతే కేచన యోగినస్త్వాముపాత్తనాదానుభవప్రమోదం || 11||
ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః |
తం దక్షిణామూర్తితనుం మహేశముపాస్మహే మోహమహార్తిశాంత్యై || 12||
కాంత్యా నిందితకుందకందలవపుర్న్యగ్రోధమూలే వస - న్కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః | మోహధ్వాంతవిభేదనం విరచయన్బోధేన తత్తాదృశా దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా || 13||
అగౌరగాత్రైరలలాటనేత్రైరశాంతవేషైరభుజంగభూషైః |
అబోధముద్రైరనపాస్తనిద్రైరపూర్ణకామైరమరైరలం నః || 14||
దైవతాని కతి సంతి చావనౌ నైవ తాని మనసో మతాని మే |
దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతం || 15||
ముదితాయ ముగ్ధశశినావతంసినే భసితావలేపరమణీయమూర్తయే |
జగదీంద్రజాలరచనాపటీయసే మహసే నమోఽస్తు వటమూలవాసినే || 16||
వ్యాలంబినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ |
పశ్యఁల్లలాటేన ముఖేందునా చ ప్రకాశసే చేతసి నిర్మలానాం || 17||
ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేందుభావం ప్రకటీకరోషి |
యదద్య తే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచంద్రకాంతః || 18||
యస్తే ప్రసన్నామనుసందధానో మూర్తిం ముదా ముగ్ధశశాంకమౌలేః |
ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యామంతే చ వేదాంతమహారహస్యం ||19||
|| దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణం ||
Friday, August 20
వరలక్ష్మి వ్రతం
శ్రావణమాసంలో అతిముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. లక్ష్మి దేవి ని ఆవాహనం చేసి , మన తాహత మేరకు ఆమెకు ఉపచారాలు చేసి, సౌభాగ్యం, సంపద, అందరి క్షేమం కోసం పూజ చేస్తాం. ఈ వ్రతం రోజు కొందరు కలిశం పెడతారు, ఆ పద్ధతి లేని వారు అమ్మవారి పటానికి పూజ చేస్తారు.
స్కంద పురాణం లో వరలక్ష్మి వ్రతం గురించి పరమశివుడు, పార్వతి దేవి కి వివరిస్తారు. చారుమతి యొక్క కథే ఈ వ్రత కథ. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి కి ముందే వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి.
ఏ పూజ మొదలు పెట్టాలన్న, ముందుగా గణపతి ని పూజించాలి. ఆ ప్రకారం ముందుగా పసుపు వినాయకుడికి పూజ చేసి, అమ్మణ్ణి ని ఆవాహనం చేయాలి. కలిశా పూజ చేసి అమ్మవారిని ఆహ్వానించాలి. లక్ష్మి అష్టోత్రం చేసాక, తొమ్మిది ముడులతో కూడిన తోరాలకు తోరపు పూజ చేయాలి. వరలక్ష్మి వ్రత కథ చదివి, అమ్మణ్ణి కి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి, పూజలో పెట్టిన తోరం కట్టుకొని, ముతైదువులకు తాంబూలం ఇవ్వాలి. అమ్మవారి ప్రసాదం అందరు తీసుకోవాలి.
వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా పసుపు కుంకుమలకు, సౌభాగ్యానికి ప్రతీక. అమ్మవారి దయను పొందాలని ప్రతీ ముతైదువ అమ్మవారిని ప్రార్ధిస్తుంది. మనం చేయడమే కాదు, వ్రతం తెలియని వారికి చెప్పి చేయిస్తే మంచిఫలితం ఉంటుంది.
అమ్మవారి పూజలో పెట్టిన తోరమే మనకు శ్రీరామ రక్షా గా ఉండి కాపాడుతుంది.
వరలక్ష్మి వ్రతం పూజ విధానం / వరలక్ష్మి వ్రతం ఆడియో
Sunday, August 15
శ్రావణమాసం / మంగళగౌరీ వ్రతం
శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది, "వరలక్ష్మి వ్రతం " మరియు "మంగళ గౌరీ వ్రతం".
ముందుగా మంగళ గౌరీ వ్రతం గురించి తెల్సుకొందాం. పార్వతి దేవి కి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసం లో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి ఐన పార్వతీదేవి ని పూజించాలి.
ముందుగా, ఒక శుభ్రమైన పీట ను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్ప లో పసుపుతో చేసిన గౌరి దేవిని అలకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశం పెట్టె సంప్రదాయం ఉన్నవారు కలశం పెట్టి, కలశ పూజ చేయాలి. వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి / ఫణి గౌరి దేవి అష్టోత్రం చదివి , అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు
, 5 పిండి దీపారాధనలు (బియ్యంపిండి, చక్కర/బెల్లం మిశ్రమం తో చేసిన దీపాలు ) పెట్టి పూజించాలి. పూజ ఐన తర్వాత అమ్మణ్ణి కి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం మనం కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా....ఒకటి అమ్మణ్ణి కి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తైదువలకు తాంబూలం తో పాటు ఇవ్వాలి. వ్రతం ఐన పక్కరోజు అమ్మణ్ణి కి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి " యధా స్థానం ప్రవేశాయామి, పూజార్ధం పునరాగామనాయచ " అని అమ్మణ్ణి కి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి, మళ్లీ పూజ కి మమ్మల్ని అనుగ్రహించు అని అర్ధం.
అంతటి తో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. ఈ విధంగానే మిగిలిన ౩ వారాలు వ్రతాన్ని కొనసాగించాలి.
ఈ దీపాల దగ్గర రెండు పద్దతులు ఉన్నాయి. (1) కొందరు 4 వారాలు, అమ్మణ్ణి దగ్గర 5 పిండి దీపారాధనలు ఉంచి పూజిస్తారు. (2)మొదటి సంవత్సరం ఐదు పిండి దీపారాధనలు మొదలై ప్రతీ ఏడు పెరుగుతూ అంటే రెండవ సంవత్సరం పది తాంబూలాలు అలా చివరికి ఇరవై ఐదు పిండి దీపారాధనలు ముగుస్తుంది. చివరి సంవత్సరం ఐన తర్వాత ఒక కొత్త పెళ్ళికూతురికి వాయనం ఇవ్వాలి.
వ్రత ఉద్యాపన :
ఈ వ్రతాన్ని పెళ్ళీ ఐన సంవత్సరం నుండి ప్రారంభించి 5సంవత్సరాలు చేయాలి, 5వ సంవత్సరం శ్రావణ మంగలవారం పగటివేళ మంగళగౌరిని యధావిధిగా పూజించాలి. దంపతులిద్దరు ఉపవాసం ఆచరించాలి. ఆ రోజున కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఇత్తడి గిన్నెలో 33జతల అరిసెలు పెట్టి, వాటి మీడ పసుపు గుడ్డకప్పి, పైన చీర, రవికె, తాంబూలం, నోముసూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు ఉంచి బొట్టు పెట్టి ఇవ్వాలి.
మంగళ గౌరీ వ్రతం ..video / మంగళ గౌరీ వ్రతం.....వ్రత విధానం
Monday, August 9
హరివాసరం ఏకాదశి
ఏ పని చేయాలన్నా, ఏకాదశి తిది చూడటం మనకి అలవాటు. కోర్కెలను ఫలింప చేసుకోడానికి, దైవారాధనకు చాల ముక్యమైన తిధి. ప్రతీ మాసం లో రెండు పక్షాలు (15 రోజులని పక్షం అంటారు ) ఉంటాయి. ప్రతీ పక్షంలో వచ్చే పదకొండవ తిధి ఏకాదశి. సంవత్సరం పొడవునా సాధారణంగా 24 ఏకాదశులు వస్తుంటాయి. అధికమాసం ఐతే ఒక ఏకాదశి ఎక్కువ.
ఈ తిధి లో హరినామస్మరణ చేయడం ముఖ్యం. హరికి ఇష్టమైన తిధి కనుకనే, హరివాసరం ఏకాదశి అంటారు.ఈరోజు నియమ నిష్టలతో కూడిన ఉపవాసం చేయాలి. వివిధ రకాల ఏకాదశులు, వాటికి గల పేర్లు, చేసే వ్రతాలు, వాటివలన కలిగే ఫలితాలను గురించి నారద పురాణం పద్యభాగం నాల్గవ పాదం 120 వ అధ్యాయం లో చెప్పబడినది. ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ప్రధమ ఏకాదశి అని, తొలి ఏకాదశి అని అంటాము. సతీ సక్కుబాయి ముక్తి ని పొందిన రోజుగా చెప్పుకొంటాము.
తొలిఏకాదశి నుండి సూర్యుడు దక్షిణం వైపు ఉన్నట్లు కనిపిస్తాడు. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని మోక్ష ఏకాదశి అని / వైకుంఠ ఏకాదశి అని / ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఏకాదశుల్లో చాల పవిత్రమైనవి ఇవి. ఈ సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఏకాదశులల్లో సూర్యుని సంచారానికి సంబంధించిన అంశాలు ఇమిడి ఉంటాయి.
ఏకాదశి / ఏకాదశి వ్రతాలు ప్రధానంగా హరిపూజ, దానధర్మాలు, ఇంద్రియ నిగ్రహానికి ప్రాధాన్యం ఇచ్చేవిగా ఉంటాయి.
ఆషాడం నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు నాలుగు నెలలపాటు చాతుర్మాస వ్రతం ఆచరిస్తారు. అలాగే కార్తీక శుక్ల ద్వాదశి వరకు గోపద్మ వ్రతం చేస్తారు. ఇంటి పరిసరాల పరిశుభ్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఈ వ్రతం లో కనిపిస్తుంది. పశువుల కొట్టాలు శుభ్ర పరిచి, పిండితో ముగ్గులు పద్మాలను వేసి పశువులను పూజచేస్తారు. పశువులు కనుమరుగు అవుతున్న ఈ తరుణంలో చాతుర్మాస వ్రతం ఆచరించిన సరిపోతుంది.
ఏకాదశి సమయాలలో నాలుగు నెలల పాటు విష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే శయన ఏకాదశి అనే పేరు కూడా ఉంది. తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడు. కాబట్టి దానిని ఉత్ధాన ఏకాదశి అంటారు. ఏకాదశి అవతరణ వరాహ పురాణం 30వ అధ్యాయంలో వివరించినట్లు తెలుస్తున్నది.
Wednesday, August 4
నవగ్రహాలు
ఆదిత్యుడు :
అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
మంగళ :
అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం. ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకి అధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగ విద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.
భార్య / పిల్లలు / అన్నదమ్ముల వల్ల సమస్యలు ఉండేవారు, స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటం వలన సత్ఫలితాలను పొందుతారు.
అధిదేవత : భూదేవి
ప్రత్యదిదేవత : క్షేత్ర పాలకుడు
వర్ణం: ఎరుపు
ధాన్యం : కందులు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
బుధుడు :
అధిదేవత : బ్రహ్మ
ప్రత్యధిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : శెనగలు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : శెనగల తో కూడిన అన్నం
శుక్రుడు :
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : బొబ్బర్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : బొబ్బర్లు తో కూడిన అన్నం
ప్రత్యధిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
పుష్పం : నల్లని తామర
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు :
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం : నలుపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం
కేతువు :
అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.
కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకే ఆదిత్యుడు అని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రధం అతని వాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ప్రతీకలు.
( మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆఙ్ఞ చక్రం , సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్య దోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యుని పూజించటం వలన ఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది. అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.
ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి
( మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆఙ్ఞ చక్రం , సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్య దోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యుని పూజించటం వలన ఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది. అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.
ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి
చంద్రుడు :
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకు కంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటి గుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రి కి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అని పేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు, ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమ తల్లి తారక.
అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారు చంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.
కర్కాటక రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకు కంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటి గుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రి కి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అని పేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు, ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమ తల్లి తారక.
అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారు చంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.
కర్కాటక రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.
అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
మంగళ :
అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం. ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకి అధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగ విద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.
భార్య / పిల్లలు / అన్నదమ్ముల వల్ల సమస్యలు ఉండేవారు, స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటం వలన సత్ఫలితాలను పొందుతారు.
అధిదేవత : భూదేవి
వర్ణం: ఎరుపు
ధాన్యం : కందులు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
బుధుడు :
తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్ర దోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధుని పూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి, సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలో రానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి.
మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు - ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసలు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసలతో కూడిన అన్నం
గురు :మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు - ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసలు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసలతో కూడిన అన్నం
బృహస్పతి అని కూడా అంటాము.. దేవతలకు, దానవుల గురువైన శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణ సంపన్నుడు. పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.
పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకు గురువు ని పూజించాలి
ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడై ఉంటాడు.పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకు గురువు ని పూజించాలి
అధిదేవత : బ్రహ్మ
ప్రత్యధిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : శెనగలు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : శెనగల తో కూడిన అన్నం
శుక్రుడు :
ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకు గురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణం తో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె / గుఱ్ఱము / మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.
అనుకోని పరిస్థితుల వల్లన కుటుంబాలు విడిపోవడం లేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారి మద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కర పరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయట పడే అవకాశం ఉంది.
వృషభ, తులరాశులకు అధిపతి.అనుకోని పరిస్థితుల వల్లన కుటుంబాలు విడిపోవడం లేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారి మద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కర పరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయట పడే అవకాశం ఉంది.
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : బొబ్బర్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : బొబ్బర్లు తో కూడిన అన్నం
శని :
ఛాయా దేవి, సూర్యభగవానుడి పుత్రుడు శని. నల్లని వర్ణం తో, నలుపు వస్త్రధారణతో, కాకి వాహనంగా కలిగి ఉంటాడు.
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలాoటి బాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టి కష్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసి వెళ్తాడు.
కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : యముడుఛాయా దేవి, సూర్యభగవానుడి పుత్రుడు శని. నల్లని వర్ణం తో, నలుపు వస్త్రధారణతో, కాకి వాహనంగా కలిగి ఉంటాడు.
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలాoటి బాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టి కష్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసి వెళ్తాడు.
కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.
ప్రత్యధిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
పుష్పం : నల్లని తామర
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం
రాహువు :
సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడే రాహువు ను ఒక పాము రూపం లో వర్ణిస్తారు. ఒక కత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటి గుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.
పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవి రాహు ప్రభావములే.
పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.
అదిదేవత : దుర్గపుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవి రాహు ప్రభావములే.
పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం : నలుపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం
కేతువు :
భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషం మొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.
ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.
ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.
Subscribe to:
Posts (Atom)