Sunday, August 1

చాతుర్మాస వ్రతం

వర్షాకాలం లోని నాలుగు నెలలు అత్యంత నిష్టతో పాటించే వ్రతం చాతుర్మాస వ్రతం. జూలై నుండి అక్టోబర్ వరకు అనగా ఆషాడమాసం శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలల పాటు ఈ వ్రతాని ఆచరించడం సంప్రదాయం. అందుకే దీనికి చాతుర్మాస వ్రతం అని పేరు వచ్చింది. సాక్షాతూ శ్రీ మహావిష్ణువే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలిగే పుణ్యం గురించి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. వైకుంటం లో మహాలక్ష్మి సమేతుడై ఉన్న విష్ణువు వద్దకు వచ్చిన నారదుడు లోకాలు అతలాకుతలం అవుతున్నాయి అని, నరులు పున్యవ్రతాలు చేయక, విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపక ఎవరి తీరున వారు ఉన్నారని, లోకాన్ని రక్షించమని వేడుకొంటాడు. లోక సంరక్షణార్ధం, ధర్మ సముద్ధరణ కోసం శ్రీ మహా విష్ణువు లక్ష్మీ సమేతుడై భూలోకయానం చేస్తూ నైమిశారణ్యానికి వచ్చిన సందర్భంలో గ్యానసిద్ధుడనే యోగీంద్రుడు సత్కర్మలకు దూరమై లోకాలు అతలాకుతలం అవుతున్నాయని రక్షించి తరించే మార్గం ఉపదేశించమని కోరగా చాతుర్మాస వ్రతాన్ని గురించి సాక్షాత్తు మహావిష్ణువే వివరించాడని పురాణ కధనం. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ప్రజలలో జాగరూకత, నిశ్యలత, నిర్మలత కలుగుతాయి. విష్ణు మూర్తి కి ఎంతో ఇస్టమైన వ్రాత విధానం గురించి కార్తీక పురాణం వివరించబడినది.
పుణ్యప్రదమైన ఈ వ్రతాన్ని ఆచరించే వారు మొదటి నెల ఐన ఆషాడశుద్ధ దశమి నుండి శాకము, రెండవ నెల ఐన శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు, మూడవ నెల ఐన భాద్రపద దశమి మొదలు పాలు, నాల్గ నెల ఐన ఆశ్వీయుజ దశమి మొదలు పప్పుదినుసులు విడిచిపెట్టాలి. ఒక్కో నెల ఒక్కో పదార్ధాన్ని విడిచి పెడ్తు, మితాహారం తీసుకొంటూ పూజా పునస్కారాలతో నాలుగు నెలలు భక్తి తత్పరులై సేవించిన వారికి పాపాలు తొలగి పుణ్యం, ముక్తి లభిస్తుందని పండితుల ఉవాచ.
చాతుర్మాస వ్రతంలో ని నాల్గవ నెల కార్తీకం. దామోదర రూపం వహించే కృష్ణ భగవానునికి అత్యంత ప్రియమైనది కనుక దీనికి దామోదర మాసం అని కూడా పేరుంది.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: