Friday, May 9

జై శ్రీరాం

అనర్ఘ్య మాణిక్య విరాజమాన
శ్రీపాదుకాలంకృత శోభనాభ్యాం
అశేష బృందారక వందితాభ్యాం
నమో నమో రామ పదాంబుజాభ్యాం

ధ్వజాంబుజచ్ఛత్ర రధాఙ్ఞ శంఖ
దంభోళి పాశాంకుశ మత్స్య చిహ్నం
బ్రహ్మేంద్ర దేవాది కిరీట కోటి
సంఘృష్ట పాదాంబుజ యుగ్మ మీళే 


అమూల్య మణులతో ప్రకాశిస్తున్న పాదుకలను అలంకరించుకున్నదీ, సమస్త దేవతల చేత నమస్కరింపబడుతున్నదీ ఐన శ్రీరాముని పాదపద్మాల జంటకు నమస్సులు.
ధ్వజ, పద్మ, ఛత్ర, శంఖ, వజ్ర, పాశ, అంకుశ, మత్య్స..చిహ్నములతో కూడినది, బ్రహ్మేంద్రాది దేవతల కిరీటాల అంచులు తాకినదీ ఐన శ్రీరాముని పాదపద్మాల జంటకు నమస్సులు. (శ్రీరామ కర్ణామృతం)