Saturday, January 29

శ్రీ లలితా సహస్రనామం (ప్రతిపద అర్ధం) (41-70)

41. భవాని భావనాగమ్యా భవారణ్య కుఠారికా
భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని

భవాని : పుట్టుకలేనిది
భావనాగమ్యా : భావన చేతనే చేరదగినది
భవారణ్య కుఠారికా : జన్మపరంప అను అరణ్యమును ఛేదించు గొడ్డలి వంటిది
భాద్రప్రియా : భక్తులను రక్షించుటయందు ఆసక్తి కలిగినది
భద్రమూర్తి : భక్తులకు అభయములు ఇచ్చు రూపము కలిగినది
భక్త సౌభాగ్య దాయినీ : భక్తులకు సౌభాగ్యములు ఇచ్చునది.

42. భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ
శాంభవి శారదారాధ్యాశర్వాణి శార్మదాయిని

భక్తప్రియా : భక్తుల యందు ప్రీతీ కలిగినది
భక్తిగమ్యా : భక్తి చేత చేరదగినది
భక్తివశ్యా : భక్తికి వశము కలిగినది
భయాపహా : భయమును పోగ్గొట్టునది
శాంభవీ : శంబుని రాణి
శారదారాధ్యా : సరస్వతి దేవి చేత ఆరాధింపబడునది
శర్వాణి : శర్వుని పత్ని
శర్మదాయిని : శాంతి చేకూర్చునది

43. శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభానన
శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన
శాంకరీ : శంకరుని పత్ని
శ్రీకరి : సౌభాగ్యములు ప్రసాదించేది
సాద్వీ : సాధు స్వభావము కలది
శరచ్చంద్ర నిభాననా : శరత్ కాల చంద్రుని వంటి ముఖము కలది
శాతోదరీ : పలుచని ఉదరము కలది
శాంతిమతీ : శాంతస్వభావురాలు
నిరాధార : ఆధారము లేనిది
నిరంజనా : నిర్మలమైన మనస్సు కలది

44. నిర్లేపా నిర్మలా నిత్యానిరాకారా నిరాకుళ
నిర్గుణా నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ

నిర్లేపా : బంధము లేనిది
నిర్మలా : పరిశుద్దురాలు
నిత్యా : శాశ్వతంగా ఉండునది
నిరాకారా : ఆకారము లేనిది
నిరాకులా : వ్యాకులత లేనిది
నిర్గుణా : సత్వ, రజో, తమో గుణములకు అతీతురాలు )నిష్కళా : పూర్ణస్వరూపిని
శాంతా : శాంత స్వభావం కలది
నిష్కామా : కోరికలు లేనిది
నిరుపప్లవా : స్థిరమైనది

45. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ
నిత్యశుద్దా నిత్యబుద్దా నిరవద్య నిరంతర .
నిత్యముక్తా : జంఝాటము లేనిది
నిర్వికార : మార్పులు లేకుండా ఉన్నది
నిష్ప్రపంచా : పంచాభూతాత్మికమైన ప్రపంచమునకు అతీతురాలు
నిరాశ్రయా : ఎత్తి ఆశ్రయము అవసరం లేనిది
నిత్యశుద్దా : ఎల్లప్పుడూ పరిశుద్దురాలు
నిత్యబుద్దా : ఎల్లప్పుడూ జ్గ్యాన స్వరూపిణి
నిరవద్యా : సర్వస్వతంతురాలు
నిరంతరా : శాశ్వతంగా ఉండునది

46. నిష్కారణ నిష్కళంక నిరుపాదిర్నిరీశ్వర
నీరాగా రాగామధనీ నిర్మద మదనాషిని

నిష్కారణ : కారణరహితురాలు
నిష్కళంకా : ఎత్తి కళంకము లేనిది
నిరుపాధి: : ఉపాధి (శరీరము ) లేనిది
నిరీశ్వరా : తన పైన ఎవరికి అధికారము లేనిది
నీరాగా : ఎటువంటి బంధములు లేనిది
రాగమధనీ : భక్తుల యొక్క ప్రాపంచికవ్యామోహాలను పోగ్గొట్టునది
నిర్మదా : గర్వము లేనిది
మధనాశినీ : గర్వము, ధన, బల, కుల, అధికార వ్యామోహాలను నశింప చేయునది.
47. నిశ్చింతా నిరహంకారా నిర్మోహ మోహనాశినీ
నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశిని

నిశ్చింతా : చింతలూ లేనిది
నిరహంకారా : అహంకారము లేనిది
నిర్మోహ : కోరికలు లేనిది
మోహనాశినీ : మోహమును పోగ్గొట్టునది
నిర్మమా : మమకారము లేనిది
మమతాహంత్రీ : "నేను, నాది" అనే భావములనుండి జీవులను కాపాడుతున్నది
నిష్పాపా : పాపము లేనిది
పాపనాశినీ : భక్తుల పాపములను పోగ్గొట్టునది

48. నిష్క్రోధ క్రోధశమని నిర్లోభా లోభనాశిని
నిస్సంశాయా సంశాయఘ్ని నిర్భవ భవనాశిని

నిష్క్రోధా : క్రోధము లేనిది
క్రోధశమనీ : భక్తుల కోపమును పోగ్గొట్టునది
నిర్లోభా : లోభము లేనిది
లోభనాశినీ : భక్తుల లోభ గుణమును నశింపచేయునది ( ధన,కనక,వస్తు వాహనాములను వదలలేకుండా ఉండటాన్ని లోభం అంటారు )నిస్సంశయా : ఎట్టి సందేహము లేనిది
సంశయఘ్నీ : భక్తుల సందేహాలను తీర్చునది ( అనగా..భగవంతుడు ఉన్నాడా/లేడా? పూర్వజన్మలు ఉన్నాయా లేవా?? మొదలైన ఆద్యాత్మిక సందేహాలు )నిర్భవా : పుట్టుకలేనిది
భావనాశనీ : జన్మపరంపరలను తొలగించి మోక్షమును ఇచ్చునది

49. నిర్వికల్పా నిరాబాధా నిర్భేద భేదనాశిని
నిర్నాశా మృత్యుమదనీ నిష్క్రియ నిష్పరిగ్రహ

నిర్వికల్పా : వికల్పములు లేనిది
నిరాబాధా : బాధలు లేనిది
నిర్భేదా : భేదభావములు లేనిది
భేదానాశినీ : భక్తుల యొక్క భేదాభావములను నశింపచేయునది
నిర్నాశా : నాశనము లేనిది
మృత్యుమధనీ : మృత్యువును లేకుండా చేయునది ( అకాల మృత్యువునుండి భక్తులను కాపాడి వారికి జన్మపరంపర లేకుండా చేయును)నిష్క్రియా : పని లేకుండా ఉండునది ( అమ్మవారి ఆజ్గ్య చే సృష్టి, స్థితి, లయములు జరుగును. త్రిమూర్తులు కూడా అమ్మణ్ణి ఆజ్గ్యను శిరసావహింతురు. కనుక తానుగా చేయాల్సిన పనులు ఏమి ఉండవు అని భావము)నిష్పరిగ్రహా : సమస్త సృష్టి తనే కనుక.. సృష్టి లో ని వస్తువులలో ఆమెకు ప్రయోజనము లేదు

50. నిస్తులా నిలచికురా నిరపాయ నిరత్యయా
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహన్త్రీ సుఖప్రదా

నిస్తులా : తనతో సరిసమానులు ఎవ్వరు లేరు
నీలచికురా : నల్లని ముంగురులు కలది
నిరపాయా : దేనివలను అపాయము లేనిది
నిరత్యయా : తనను మించిన వారు ఎవరు లేనిది
దుర్లభా : దుర్లభం ఐనది ( సాధం కానిది)దుర్లమా : చేరుటకు కష్టమైనది
దుర్గా : దుర్గా రూపిణి
దుఃఖహంత్రీ : దుఃఖమును దూరం చేయునది
సుఖప్రదా : సుఖములను కలిగించునది
51. దుష్టదూరా దురాచార శమనీ దోష వర్జితా
సర్వగ్యా సాంద్రకరుణా సమానాధిక వర్జితా

దుష్టదూరా : దుష్టులకు దూరమైనది
దురాచారశమనీ : దురాచారములను పారద్రోలునది
దోషవర్జితా : దోషము లేనిది
సర్వజ్గ్యా : అన్ని తెలిసిన
సాంద్రకరుణా : అధికమైన కరుణ కలది
సమానాధికవర్జిత : తనకు సరిసమానులు కానీ అధికులు కాని లేనిది

52. సర్వశక్తి మయి సర్వ మంగళ సద్గతి ప్రదా
సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి

సర్వశక్తిమయీ : సమస్త శక్తులూ కలది
సర్వమంగళా : సర్వ శుభములు చేకూర్చునది
సద్గతిప్రదా : సద్గతులను ప్రసాదించునది
సర్వేశ్వరీ : అన్ని లోకములకు అధిపతి
సర్వమయీ : సర్వము తన యందే కలిగినది
సర్వమంత్రస్వరూపిణీ : అన్ని మంత్రములను స్వరూపంగా కలిగినది

53. సర్వ యంత్రాత్మికా సర్వతంత్రరూప మనోన్మనీ
మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మి మృడ ప్రియ
సర్వయంత్రాత్మికా : సర్వ యంత్రములు తానై యున్నది
సర్వతంత్రరూపు : అన్ని తంత్రములు తానై యున్నది ( యంత్రము, మంత్రము, తంత్రము దేవతా ఉపాసనకు అవసరము)మనోన్మనీ : ఏకాగ్రమైన మనస్సుతో ద్యానించునది
మాహేశ్వరీ : సర్వాధికారిణీ
మహాదేవి : మహాదేవుని అర్ధాంగి
మహాలక్ష్మీ: : మహాలక్ష్మి స్వరూపురాలు
మృడప్రియా : మృడునకు ( శివునికి ) ప్రియమైనది

54. మహారూప మహాపూజ్య మహాపాటక నాశినీ
మహామాయా మహాసత్త్వా మహాశక్తి: మహారతి:

మహారూపా : గొప్ప రూపము కలది
మహాపూజ్యా : అందరిచే పూజలు అందుకొనేది
మహాపాతక నాశనీ : మహాపాపములను పోగ్గొట్టునది
మహామాయా : మాయ మాయం ఇన సృష్టి కి కారణభూతురాలు
మహాసత్వా : బలవంతురాలు
మహాశక్తి : గొప్ప శక్తి కలది
మహారతి: : ఆనందస్వరూపిణీ

55. మహాభోగ మహైశ్వర్య మహావీర్యా మహాబలా
మహాబుద్ధి: మహాసిద్ధి: మహాయోగేశ్వరేశ్వరీ

మహాభోగా : గొప్పభోగములు కలది
మహైశ్వర్యా : గొప్ప శ్వర్యములు కలది
మహావీర్యా : గొప్ప శౌర్యము కలది
మహాబలా : గొప్ప సైన్యము కలది
మహాబుద్ధి : సద్బుద్ధి ఇచ్చునది
మహాసిద్ధి : మోక్షమును ఇచ్చునది
మహాయోగేశ్వరేశ్వరీ : గొప్ప యోగీశ్వరులచే పూజింపబడునది
56. మహాతంత్రా మహామంత్రా మహాయంత్ర మహాసనా
మహాయాగా క్రమారాధ్య మహాభైరవ పూజితా

మహాతంత్రా : శ్రీవిద్యా తంత్ర స్వరూపిణి
మహామంత్రా : షోడషీ మంత్రము
మహాయంత్రా : శ్రీ చక్రస్వరూపిణీ
మహాసనా : అత్యున్నాట్ స్థానము కలది
మహాయాగ క్రమారాధ్యా : కుండలినీ యోగమున అంతర్యాగముచే ఆరాధింపబడునది
మహాభైరవ పూజితా : మహా భైరవునిచే పూజించా బడునది

57. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షినీ
మహాకామేశ మహిషీ మహాత్రిపుర సుందరీ

మహాకల్ప : మహాకల్పాంతమున
మహేశ్వర : మహేశ్వరుడు చేయు
మహాతాండవ : మహా తాండవమునకు
సాక్షినీ : సాక్షిగా నిలిచినది
(
మహాప్రలయములో బ్రహ్మాది దేవతలతో సహా అన్ని లోకములు నశించును, కాని ప్రళయానికి సాక్షిగా అమ్మవారు ఒక్కరే నిలిచియుండును )మహాకామేశ : మహాకామేశుని
మహిషీ : పట్టమహిషి
మహాత్రిపురసుందరీ : త్రిపురములందు సంచరించునది

58. చతుష్షష్ట్యుపచారాడ్యా చతుష్షష్టి కళామయి
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా

చతుష్షష్టి : అరవై నాలుగు
ఉపచారాడ్యా : ఉపచారముల చే పూజింపబడునది
చతుష్షష్టి కళామయి : అరవై నాలుగు కళలకు మూలం
మహాచతుష్షష్టి కోటి యోగినీ గణ సేవితా : అరవై నాలుగు మహా యోగినీ గణముల చే సేవించబడునది

59. మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండల మధ్యగా
చారురూపా చారుహాస చారుచంద్ర కళాధర

మనువిద్యా : శ్రీ విద్యా
చంద్రవిద్యా : కుండలనీ యోగము
చంద్రమండల మధ్యగా : చంద్రమండలం అనగా శిరస్థానము, శిరస్సు మధ్య ససస్రార పద్మము కలది
చారురూపా : అందమైన రూపము కలది
చారుహాసా : అందమైన నవ్వు కలది
చారుచంద్ర కళాధరా : అందమైన చంద్రుడిని
అలంకారంగా కలది

60. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన
పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ

చరాచర జగన్నాధా : చర, అచరములైన జీవులకు అధీశ్వరీ
చక్రరాజనికేతనా : శ్రీ చక్రమునే ఆవాసంగా చేసుకొన్నది
పార్వతీ : పర్వత పుత్రి పార్వతి
పద్మనయనా : పద్మము వంటి కనులు కలది
పద్మరాగ సమప్రభా : పద్మరాగముల కాంతితో సమానమైన కాంతి కలది

61. పంచాప్రేతసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి
చిన్మయి పరమానంద విజ్గ్యాన ఘనరూపిణీ
పంచప్రేతాసనాసీన : పంచాప్రేతములపైన ఆసీనురాలు ఐనది
పంచబ్రహ్మ స్వరూపిణి : పంచబ్రహ్మల స్వరూపము కలిగినది
చిన్మయి : చైతన్య స్వరూపిణి
పరమానందా : బ్రహ్మానంద స్వరూపిణి
విజ్గ్యానఘన రూపిణి : సమస్తమైన శాస్త్రవిజ్గ్యానము రూపంగా కలిగినది
62. ధ్యాన ధ్యాత్రు ద్యేయరూప ధర్మాధర్మ వివర్జితా
విశ్వరుపా జాగరిణి స్వపంతీ తైజసాత్మికా
ధ్యానధ్యాత్రు ధ్యేయ రూపా : ధ్యానము, ధ్యానము చేయువాడు, ధ్యానము చేయునది అను మూడు క్రియలు తానై యున్నది
ధర్మాధర్మ : ధర్మ, అధర్మములు
వివర్జితా : అతీతురాలు
విశ్వరూపా : విశ్వమే రూపంగా కలిగినది
జాగరిణీ : జాగురుకత తో ఉండునది
స్వపంతీ : స్వయం ప్రకాశం కలిగినది
తైజసాత్మికా : తేజోరూపిణీ
63. సుప్తా ప్రాగ్యాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ
సుప్తా : నిద్రించుచున్నది
ప్రాజ్గ్యాత్మికా : మెలుకువతో ఉండునది
తుర్యా : తురీయ (సమాధిస్థితి) స్థితి లో ఉండునది
సర్వావస్థ : అన్ని అవస్థలకు ( జాగృతి, స్వప్న, సుషప్తీ, సమాధి ) అతీతమైనది
సృష్టి కర్త్రీ : సృష్టి కి మూలమైనది
బ్రహ్మరూపా : సృష్టి కర్త ఐన బ్రహ్మ రూపము తానైనది
గోప్త్రీ : రక్షించునది
గోవిందరూపిణీ : జగత్ రక్షణ కొరకు గోవింద రూపం ధరించినది
64. సంహారిణీ రుద్రరూప తిరోధాన కరీశ్వరీ
సదాశివనుగ్రహద పంచకృత్య పరాయణా
సంహారిణీ : సంహరించునది
రుద్రరూపా : జగత్హును ఉపసంహరించుటకై రుద్రరూపం దాల్చినది
తిరోదానకరీ : తిరిగి తనలో ఐక్యము చేసుకోనునది
ఈశ్వరీ : జగదీశ్వరీ
సదాశివా : నిర్గుణ, నిరాకార రూపం ( సదాశివుడు )అనుగ్రహదా : పునః సృష్టికి కారణం
ఐనది
పంచకృత్య పరాయణా : సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహము అను ఐదు కార్యములు నిర్వహించునది
65. భానుమండల మధ్యస్తా భైరవీ భగమాలినీ
పద్మాసనా భగవతీ పద్మనాభ సహొదరీ

భానుమండల : సూర్య మండలము
మధ్యస్తా : మద్య ఉండునది
భైరవీ : ఓం కార శబ్ద రూపిణి
భగమాలినీ : సుర్యమండలములను మాలగా ధరించినది
పద్మాసనా : పద్మము ఆసనముగా కలది ( సహస్రారం అనే పద్మం)భగవతీ : భవత్ స్వరూపిణి
పద్మనాభ సహొదరీ : విష్ణువు కి సోదరి ( వైష్ణవీ దేవి)
66. ఉన్మేష నిమిషోత్పన్నవిపన్న భువనావళి:
సహస్రశీర్ష వదనా సహస్రాక్షీ సహస్రపాత్
ఉన్మేష నిమిషోత్పన్న విప్పన్న భువనావళి: : రెప్పపాటు కాలం లో లోకాన్ని సృష్టించి, తనలో లయము చేసుకొనేది
సహస్రాక్షీ : అనంతమైన కన్నులు కలది
సహస్రశీర్ష వదనా : అనంతమైన తలలు, ముఖములు కలది
సస్రపాత్ : అనంతములైన పాదములు కలది
67. అబ్రహ్మకీట జననీ వర్ణశ్రమా విధాయినీ
నిజాగ్యరూ నిగమా పుణ్యాపుణ్య ఫలప్రదా

అబ్రహ్మ కీట జననీ : బ్రహ్మ నుండి చీమ వరకు అనంత జీవులకు తల్లి ఐనది
వర్ణాశ్రమవిధాయినీ : వర్ణాలను ఏర్పరిచినది ( బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు)నిజాజ్గారూపు నిగమా : వేదములు తన ఆజ్గాలుగా కలిగినది
పుణ్యాపుణ్య ఫలప్రదా : జనుల పుణ్య పాపముకు తగిన ఫలమును ఇచ్చునది
68. శృతి సీమంత సిందురీక్రుత పాదాబ్జ దూళికా
సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా
శృతిసీమంత : వేదమాత యొక్క పాపటి
సిందూరీకృత : సింధూరము
పాదాబ్జ ధూళికా : అమ్మవారి పాదముల యొక్క ధూళి
సకలాగమ సందోహా శుక్తి సంపుటి మౌక్తికా : అన్ని వేదములు సారాంశము ఆమె ( ముత్యపు చిప్పలోని ముత్యము వంటిది )
69. పురుషార్ధ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరీ
అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా

పురుషార్ధప్రదా : ధర్మ, అర్ధ, కామ, మోక్షములనే నాలుగు పురుషార్ధములు ప్రసాదిన్చునది
పూర్ణా : ఎట్టి లోపము లేనిది..పూర్ణ
భోగినీ : భోగములు కలది
భువనేశ్వరీ : సమస్త భువనములకు అధికారి
అంబికా : అమ్మ
అనాదినిధనా : ఆది అంతములు లేనిది....
హరిబ్రహ్మేంద్ర సేవితా : విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుని చే సేవించబడునది

70. నారాయణీ నాదరూప నామరూప వివర్జితా
హ్రీంకారీ హ్రీమతీ హృద్య హేయోపాదేయ వర్జితా
నారాయణీ : నారాయణ స్వరూపురాలు
నాదరూప : ఓం కార రూపిణి
నామరూప వివర్జితా : నామరూపాలు లేనిది
హ్రీంకారీ : "హ్రీం" అను బీజాక్ష స్వరూపిణి
హ్రీమతీ : ఆనందదాయినీ
హేయోపాదేయవర్జితా : చెడు సంప్రదాయాలకు దూరమైనది ( మంగళప్రద లక్షణములు కలది)