Saturday, January 22

లలిత సహస్రనామం ( ప్రతి పద అర్ధం )(14-26)

14. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి
కామేశ్వర ప్రేమ : కామేశ్వరుని ప్రేమ కు
రత్న మణి ప్రతిపనస్తనీ : రత్నములు, మణులతో
అలకరించబడిన చనుదోయి కలది
నాభ్యాలవాల : నాభి నుండి మొదలైన
రోమాళిలతా : నూగారు అనే లత (తీగ )
ఫలకుచద్వయి : ఫలములు వంటి చనుదోయి కలిగినది

15. లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ
స్తనభార దలన్మధ్య పట్టబంధవళిత్రయా

లక్ష్యరోమలతాధారతా : నూగారు (రోమాళి) ఉనికి వలన
సమున్నేయ మధ్యమా : పలుచని (సన్నని) నడుము కలది
స్తనభారదళన్మధ్య : స్తన భారము వలన
పట్టబంధవళిత్రయ : మూడు వరుసలు గల పట్ట ( నడుము పై భారము పడకుండా పట్టీ ధరించడం)

16. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కతీతటీ
రత్నకింకిణి కారమ్య రశనా దామ భూషిత
అరుణారుణ కౌసుంభ : ఎర్రని కౌసుంభ పూలు
వస్త్ర : వస్త్రముభాస్వత్ : ప్రకాసించుచున్న
కతీతటీ : కటి భాగం (తుంటి భాగం) కలిగినది.
రత్నకింకిణి కారమ్య : రత్నములతో, చిన్నచిన్న మువ్వలు కల
రసనాదామ భూషితా : వడ్డాణం తో అలకరించిన నడుము

17. కామేశజ్గ్యాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత
కామేశజ్గాత సౌభాగ్య : కామేశ్వరునికి మాత్రమే తెల్సిన
మార్దవోరు ద్వయాన్విత : మృదువైన ఊరువులు కలది
మాణిక్య : మణులు
మకుటాకార : కిరీటములను పోలిన
జానుద్వయ విరాజితా : మోకాళ్ళతో విరాజిల్లుతున్నది

18. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక
గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత

ఇంద్రగోప పరిక్షిప్త : ఇంద్రగోప (ఎర్రన్ని మణులు) పొదిగిన
స్మరతూనాభ జంఘికా : అమ్ముల పొదల వంటి పిక్కలు కలది
గూఢ గుల్ఫా : కనుపించని చీలమండలు కలది
కూర్మపృష్ట జయిష్ణు : తాబేలు వీపు ను గెలువజాలిన
ప్రపదాన్వితా : మీగాళ్ళు (పాదముల పై భాగము) కలది

19. నఖదీదితి సంచ్చన్న నమజ్జన తమోగుణా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ

నఖదీధితి సంఛన్న : కాలి గోళ్ళ యొక్క కాంతి చే తొలగించబడిన
సమజ్జన తమోగునా: భక్తుల అజ్గ్యానాంధకారం
పరాకృత : ఓడిపోయిన
సరోరుహా : పద్మములు
పదద్వయ ప్రభాజాల : పాదముల యొక్క కాంతి

20. శింజాన మనిమంజీర మండితశ్రి పదాంబుజ
మరాళి మందగమనా మహాలావణ్య శేవధి:

శింజానమణి మంజీర : మ్రోగుచున్న అందెలు
మండిత శ్రీ పదాంబుజా : అందమైన పాదములు
మరాళి మందగమన : హంస నడక వంటి మందగమనము కల్గినది
మహా లావణ్య శేవధి: : అందమునకు పరమావధి

21. సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషిత
శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ
సర్వారుణ : సంపూర్ణమైన ఎరుపు వర్ణంతో
అనవద్యాంగీ : ఎట్టి లోపము లేనట్టి అవయవములు కలిగినది
సర్వాభరణభూషిత : అన్ని రకముల ఆభరణములు ధరింపచేసినది
శివకామేశ్వరాంకస్దా : శివకామేశ్వరుని ఒడిలో కూర్చొని ఉన్నదీ
శివా : శివుని అర్ధాంగి
స్వాధీన వల్లభా : స్వాధీనంలో ఉంచుకొన్నది

22. సుమేరు మధ్య శ్రుంగస్థ శ్రిమన్నగర నాయిక
చింతామణి గృహాన్తస్త పంచబ్రహ్మాసనస్తిత

సుమేరశృంగ మధ్యస్ధా : మేరు పర్వత శిఖర మధ్యలో ఉండునది ( మేరు శిఖరమనగా సహస్రార పద్మం)
శ్రీమన్నగర నాయికా : శ్రీపురం (లలితాదేవి లోకము) నాయకురాలు
చింతామణి గృహంతస్దా : చింతామణుల చే నిర్మించిన గృహం
పంచబ్రహ్మాసనస్ధితా : బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు ఐన ప0చబ్రహ్మలను ఆసనంగా కలది

23. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని
సుదాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయినీ

మహా పద్మాటవీ సంస్దా : వేయి రేకులు కలిగిన సహస్రాపద్మమున ఉండునది
కదంబవనవాసిని : కడిమి చెట్ల వనం లో ఉండేది
సుధా సాగర మధ్యస్దా : అమృత సాగరమున ఉండేది
కామాక్షీ : తన చూపుతోనే కోర్కెలు తీర్చునది
కామదాయినీ : కోరిన కోర్కెలు తీర్చేది

24. దేవర్షి ఘనసంఘాతా స్తుయమానాత్మ వైభవ
భండాసుర వదోద్యుక్త శక్తిసేన సమన్విత

దేవర్షి గణ సంఘాత : దేవర్షి గణములచే
స్తూయమానాత్మవైభవా : స్తుతించబడే వైభవం కలది
భండాసుర వధోద్యుక్త : భండాసురుడు అనే రాక్షసుడిని వధించుటకు
శక్తి సేనా సమన్వితా : శక్తీ సైన్యములతో కూడినది

25. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత
అశ్వరూఢ దిష్టితాశ్వ కోటికోటిభిరావృత
సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవితా : సంపత్కరి అనే సేనా నాయకురాలిచే సేవించబడినది
అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటిభిరావృతా : కోటానుకోట్ల అశ్వ సైన్యముకు నాయకురాలు ఐన అశ్వారూఢ అను శక్తి చే సేవించబడుచున్నది

26. చక్రరాజ రధా రూఢ సర్వాయుధ పరిష్కృత
గేయచక్ర రధా రూఢ మంత్రిణీ పరిసేవిత

చక్రరాజ రధా రూఢ : చక్రరాజమను రధమును అధిష్టించినది
సర్వాయుధ పరిష్కృతా : అన్ని ఆయుధములను ధరించినది
గేయచక్ర రధారూఢ : గేయచక్రం అనే రధమును అధిష్టించినది
మంత్రిణి పరిసేవిత : మంత్రిణి ( శ్యామల) చే సేవించబడునది.


0 వినదగు నెవ్వరు చెప్పిన..: