Friday, January 28

శ్రీ లలితా సహస్రనామం (ప్రతిపద అర్ధము) (27-40)

27. కిరిచక్ర రధారూఢ దండనాధా పురస్కృత
జ్వాలా మాళినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా

కిరిచక్ర రధారూఢ : కిరిచక్రం అనే రధమును అధిరోహించిన
దండనాధ పురస్కృత : దండనాధ (వారాహి) అను సేనానాయకురాలు
జ్వాలామాలినికాక్షిప్త : జ్వాలామాలిని అను శక్తి
వహ్నిప్రాకారమధ్యగా : అగ్ని ప్రాకార మధ్యలో ఉండునది.
28. భండసైన్య వదోద్యుక్త శక్తివిక్రమ హర్షిత
నిత్యా పరాక్రమాటో నిరీక్షణ సముత్సుక

భండ సైన్య : భండాసురుని సైన్యము
వధోద్యుక్త : వధించడానికి
శక్తి విక్రమ హర్షితా : ఉపక్రమించిన శక్తి యొక్క పరాక్రమము
నిత్యా పరాక్రమా టో : నిత్య అను పేరు గల శక్తి యొక్క పరాక్రమము
నిరీక్షణా సముత్సుకా : ఉత్సాహం కలది ( నిత్య చేసే పరాక్రమం చూడటానికి ఉత్సాహం)
29. భండపుత్ర వదోద్యుక్త బాలావిక్రమ నందిత
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా

భండమంత్రిని : మంత్రినిసురుని యొక్క కొడుకులు
వదోద్యుక్త : వధించుటకు
బాలా విక్రమ నందితా : "బాల" పరాక్రమమునకు ఆనందించునది
మంత్రిణ్యంబా విరచిత : " మంత్రిణి " చెప్పినది
విషంగవధతోషితా : విషంగుడు అను రాక్షుడిని వదించడం
30. విశుక్ర ప్రాణహరణా వారాహి వీర్యనందిత
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర

విశుక్ర ప్రాణ హరణ : " విశుక్రుడు " అనే రాక్షసుడిని సంహరించిన
వారాహీ వీర్యనందిత : " వారాహీ " యొక్క పరాక్రమమును చూసి సంతోషించినది
కామేశ్వర ముఖాలోక : కామేశ్వరుని ముఖము చూచుట చేత
కల్పిత శ్రీ గణేశ్వరా : కల్పించబడిన ( సృష్టించబడిన ) శ్రీగణేశుడిని ( లక్ష్మిగణపతి) కలిగినది
31. మహాగణే నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
భండసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ


మహాగణే నిర్భిన్న : మహా గణేశుని చే
విఘ్న యంత్ర ప్రహర్షిత : విఘ్నం చేయబడిన యంత్రమును చూసి హర్షించినది .
(
భండాసురుడి యంత్రమును వినాయకుడు విఘ్నం చేయుట )భండాసురేంద్ర నిర్ముక్త : భండాసురుడుని నిర్మూలించడానికి
శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ : భండాసుర అస్త్రములకు ప్రత్యస్త్రములను సంధించినది
32. కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి:
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దాగ్ధసుర సైనికా

కరాంగుళి నఖోత్పన్న : చేతి గోళ్ళ నుండి ఉద్భవించిన
నారాయణ దశాకృతి: : నారాయణుని దశావతారములను కల్గినది
మహాపాసుపతాస్త్ర : గొప్పదైన పాశుపతాస్త్రం
అగ్ని : అగ్ని
నిర్ధగ్దా సురసైనిక : రాక్షస సైన్యమును దగ్ధం చేసినది
33. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శున్యకా
బ్రహ్మొపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవ

కామేశ్వరాస్త్ర : కామేశ్వరుని అస్త్రము చే
నిర్దగ్ధ : నిర్వీర్యం చేసినది
సభండాసుర : సభండాసురుడి సైన్యము
శూన్యకా : దగ్ధము చేసినది
బ్రహ్మొపేంద్ర మహేంద్రాది : బ్రహ్మ విష్ణు మహేంద్రుడు మొదలైన
దేవ సంస్తుత వైభవ : దేవతల చే స్తుతించబడిన వైభవము కలది
34. హరనేత్రాగ్నిసందగ్ధ కామ సంజీవనౌషది:
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజ

హరనేత్రాగ్ని సందగ్ధ : శివుని మూడవకంటి అగ్ని చే భస్మం ఐన మన్మధుడు
కామ సంజీవనౌషధి: : మన్మధుడిని బ్రతికించిన సంజీవిని మూలిక వంటిది
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ : పద్మము వంటి వాగ్భవ కూటము (అనగా పంచదశి లో ని ఆజ్గ్యా చక్రము,సహస్రార చక్రము మరియు పంచదశి మంత్రములోని మొదటి వాక్యము ముఖముగా కలిగినది
35. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి
శక్తికూటైక తాపన్నకట్యదో భాగధారిణీ

కంఠాధః కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి : కంఠము నుండి నడుము వరకు గల మధ్యకూటము, విశుద్ధి, అనాహత,మణిపూర చక్రములు మరియు పంచదశీ మంత్రములో రెండవాక్యము తన రూపంలో మధ్య భాగంగా కలిగినది
శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణీ : శక్తి కూటము ను నడుము క్రింది భాగంగా కలిగినది
(
మణిపూరమునకు క్రిందుగా స్వాధీష్టాన చక్రమును, వెన్నెముక చివర మూలాధార చక్రము కలదు. రెండుచక్రములను కలిపి శక్తి కూటమి అంటారు )
36. మూలమంత్రాత్మికా మూల కూటత్రయ కళేబరా
కులామృతైక రసిక కులసంకేత పాలిని

మూలమంత్రాత్మికా : పంచాదశీ, షోడశీ మంత్రములను స్వరూపంగా కలిగినది
మూలకూటత్రయ కళేబరా : వాగ్భవ కూటము, మధ్యకూటము, శక్తి కూటము లను స్వరూపంగా కలిగినది
కుళామృతైక రసికా : కుళామృతము (అనగా కుండలినీ యోగమున, సుషుమ్నా మార్గమున సహస్రారము నుండిస్రవించు అమృత బిందువు లు ) చే ఆనందించునది
కుళసంకేత పాలిని : సుషుమ్నా మార్గమును పాలించునది

37. కులాంగన కులాంతస్థ కౌళినీ కులయోగినీ
అకులా సమయాంస్థ సమయచార తత్పర

కులాంగనా : సుషుమ్నా మార్గమున సంచరించునది
కుళాంతస్తా : సుషుమ్నా మార్గమున ఉండునది
కౌళినీ : కుండలిని శక్తి
కుళయోగినీ : కుండలినీయోగ స్వరూపిణి
అకుళా : కులము లేనిది
సమయాంస్థా : శివ శక్తులకు సమాన ప్రతిపత్తిని కలిగి ఉన్నది
సమయాచారతత్పర : సమయాచారము నందు ఇష్టము కలిగినది
38. మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదిని
మణిపురాంతరుదిత విష్ణుగ్రంధి విభేదిని

మూలాదారైకనిలయా : మూలాధార చక్రమే నివాసంగా
బ్రహ్మగ్రంధి విభేదినీ : అనాహత చక్రమునందు గల బ్రహ్మ గ్రంధిని భేదించునది
మణిపూరాంత : మణిపూర చక్రము
రుదితా : బయలుదేరునది
విష్ణుగ్రంధి : అనాహత చక్రమందు కల విష్ణుగ్రంధి
విభేదినీ : భేదించునది

39. ఆజ్గ్యా చక్రంతరాలస్థ రుద్రగ్రంధి విభేదిని
సహస్రారాంబుజారూఢా సుధాసారాభి వర్షిణి

ఆజ్గ్యాచక్రంతరాలస్థా : ఆజ్గ్యా చక్రం నందు ఉండునది
రుద్రగ్రంధి విభేదినీ : విశుద్ధ చక్రమునందు కల రుద్రగ్రంధి ని భేదించునది
సహస్ర : సహస్రారము
అంబుజా రూఢా : పద్మమును అధిరోహించునది
సుధాసారాభి వర్షిణి : అమృతమును కురిపించునది

40. తటిల్లతా సమరుచి ట్చక్రోపరి సంస్థితా
మహాశక్తి: కుండలిని బిసతంతు తనీయసీ

తటిల్లతా : మెరుపు తీగ
సమరుచి : సమానమైన కాంతి కలిగినది
ట్చక్రోపరి : ఆరు చక్రములు కల సహస్రారము పైన
సంస్థితా : ఉండునది
మహా శక్తి : : గొప్పదైన శక్తి కలిగినది
కుండలిని : కుండలిని
బిసతంతు తనీయసీ : తామరతూడు లోని దారము కంటే సన్నదైనది ( అతి సన్నదైన సుషుమ్నా మార్గం )

0 వినదగు నెవ్వరు చెప్పిన..: