Thursday, April 21

రుద్రాక్షలు

రుద్రాక్ష :
మమూలుగా మనం రుద్రాక్షని మెడలో లేదా మనికట్టుదగ్గర ధరిస్తాము. రుద్రాక్ష ద్వార నీరు శరీరం పై పడితే మంచిది.శివ భక్తులు రుద్రాక్ష ధారణ తప్పనిసరి. ఈ రుద్రాక్షల గురించి తెల్సుకొందాం.

సాధారణంగా 5ముఖాలనుండి 16ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. పాలలో కాని, నీటిలో కాని రుద్రాక్షలను వేస్తే అవి మునుగుతాయి. బరువులేని, లేతరంగు రుద్రాక్షలను ధరించకూడదు. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నలిపి, అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదిక్షణంగా తిరిగితే అవి మంచి రుద్రాక్షలు అని గమనించాలి. కొన్ని రుద్రాక్షలు అప్రదక్షణంగా తిరుగుతాయి, అటువంటి రుద్రాక్షలను గృహస్థులు ఉపయొగించరాదు.

ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం, ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం, త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రరూపం, షన్ముఖి రుద్రాక్ష కార్తికేయస్వరూపం, సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం, అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం, నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం, ఇది దొరకడం చాల కష్టం. దీనిలో విద్యా, ఙ్ఞాన, క్రియా, శాంత, వామ, జ్యేష్టా, రౌద్రా, అంగ, పశ్యంతీ అను నవ శక్తులు ఉంటాయి. అందుకే నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం. దశముఖి రుద్రాక్ష విష్ణు స్వరూపం, ఏకాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశరూపం, ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్యరూపం. ఈ విధంగా రుద్రాక్షలకు దేవతా స్వరూపములకు దగ్గర సంబందం ఉంది.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: