అన్ని మాసాలలో కల్లా మాఘమాసానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఆ మాసంలో నదీనదాలో చేసే స్నానానికి ఎంతో పవిత్రత ఉంది. ఈ స్నానాలనే మాఘస్నానాలు అంటారు. సాధారణంగా నీటికి గల శక్తులు పరమపావనమైనవి. కల్మషాలు, మలినాలను కడిగివేయడంతో పాటు దాహాన్ని తీర్చేది నీరు. జలం మానవులకు యెంతో ఉపయుక్తమైనది. సాధారణం స్నానం దేహాన్ని శుద్ధి చేసి ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని స్థిరత్వన్ని కలిగిస్తుంది. స్నానం నిత్యవిధి. అలాంటి స్నానాలను నిత్యస్నానం, నైమిత్తిక స్నానం, కామ్య స్నానం, క్రియాంశ స్నానం, అభ్యంగన స్నానం, క్రియా స్నానం అను ఆరు రకాలుగా చెప్తారు. మిగిలిన మాసాలలో కెల్ల వైశాఖం, కార్తీకం, మాఘమాసాలలో చేసే స్నానాలు, ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు. చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘమాసం.
మాఘం అంటే యఙ్ఞం. కళ్యాణ కారకమైన స్నానం పరమ పవిత్రం. ఈ మాసంలో సూర్యుడి గమనాన్ని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ కిరణాలలో గల అతినీలలోహిత కిరణాలు నదులు, తటాకాల్లోని నీటిపై ప్రసరించడం వలన ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది. మాఘస్నానం విధులను మాఘపురాణంలో వివరించగా, మాఘస్నానం మహత్యాన్ని బ్రహ్మండ పురాణంలో పేర్కొన్నారు. గృహస్నానం 6సంవత్సరాల పుణ్యాన్ని, బావి స్నానం 12ఏల్ల పుణ్యాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణాలను, మహానది స్నానం శతగుణాన్ని, గంగాస్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం శత సహస్ర గుణాల ఫలాలను అందిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.
కాలం దేవతా స్వరూపం. కాలానుగుణంగా కర్మలన్నీ జరుగుతాయి. మాఘమసంలో చేసే స్నానం వలన శరీరంలోని మలినాలు తొలగడంతోపాటు ఓషధ గుణాలు లభిస్తాయి. ఆరోగ్యాన్ని, పుణ్యఫలాలను అందించే మాఘస్నానం ఆచరించడం మంచిది అని పురాణాలు చెప్తున్నాయి.
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment