Wednesday, December 8

మార్గశిర మాస ప్రాశస్త్యము

డిసెంబర్ 6 తేది నుండి జనవరి 4 తేది వరకు
ఒక్కప్పుడు సంవత్సర ఆరంభం మార్గశిర మాసం తో ప్రారంభం నట్లు కనిపిస్తుంది. మాసానికి అగ్రహాయణిక అనే పర్యాయ నామం ఉన్నట్లు అమరం.
శ్రీ కృష్ణ భగవానులు గీత లో " మాసానాం మార్గశీర్షోహం " అని చెప్పారు. వాక్యము మాసపు త్క్రుష్టతను చెప్పుచున్నది. ఇది సంవత్సరంలో తొమ్మిదో మాసం. దీని తర్వాత మాసమగు పుష్యం... రెండు మాసములను కలిపి హేమంత ఋతువు అంటారు. ఋతువును భాగవత దశమ స్కంధంలో వర్ణిస్తూ పోతరాజు " గోపకుమారి రేపకడ లేచి, కాక్ష్మిళింటి జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి...........మాస వ్రతంబు సలిపిరి." అని కవి మాస వ్రతము అంటున్నాడు. ఆరోగ్యం కోసమే వ్రత నిష్ట. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశీర్షం. కార్తీకమాసం లో ని నాగుల చవితి నాడు ప్రవేసించే చలి మార్గశిరం వరకు బాగా ప్రబలుతుంది.

మార్గశిర శుద్ధ పాడ్యమి : రోజు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది.
మార్గశిర శుద్ధ పంచమి : రోజుని నాగ పంచమిగా దాక్షిణాత్యులలో ప్రసిద్ధికెక్కి ఉందని, ఈనాడు నాగ పూజ చేయాలనీ స్మృతికౌస్తుభం.
మార్గశిర శుద్ధ షష్టి : సుబ్రహ్మణ్య షష్టి ని సుబ్బరాయుడి షష్టి అని కూడా అంటారు....

0 వినదగు నెవ్వరు చెప్పిన..: