Wednesday, May 18

కల్కి అవతారం


శ్రీమద్భాగవతం ప్రకారం కల్కి అవతారం కలియుగ అంతంలో వస్తుంది. ఎలా వస్తుంది అనేది భాగవతంలో వివరణ ఉంది. ఈ అవతారం ప్రతి కలియుగంలో వస్తుంది కనుకనే వేదవ్యాసుడు కల్కి అవతారం గురించి ప్రస్తావించాడు. ప్రతి మన్వంతరంలో 71 చతుర్యుగాలు వస్తాయి, అంటే 71 కలి యుగాలు. అందులో మనం ఉన్నది 28వ కలియుగం, అంటే 27 కల్కి అవతారాలు ఇది వరకే వచ్చాయని పురాణం చెబుతుంది.

ఇంకో కధనం కూడా ఉంది :
పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు కల్కి అవతారమున "విష్ణుయశస్సుడు" అనే పేరుతో బ్రాహ్మణకులములో జన్మిస్తాడని, హయగ్రీవుడికి వలె ఇతనికి కూడా గుఱ్ఱపు ముఖము ఉంటుందని, చేతిలో ఖడ్గముతో, తెల్లటి అశ్వం మీద వచ్చి దుష్టశిక్షణ చేస్తాడని వివరణ.

4 వినదగు నెవ్వరు చెప్పిన..:

Anonymous said...

sorry,
koddigaa chusi raayandi,
ee rojullio kuda
gurram mukham tho
vishnuyashassudu (ilanti perlu 100 years back vi)
khadgam,
gurram

intha amayakatvam...

Sridhar

గాయత్రి said...

నాకు అర్ధం కాలేదు శ్రీధర్ గారు, పైన తెలిపిన విషయాలలో అమాయకత్వం ఏమిటి? అవి నా సొంత ఊహ కాదుకద, దశావతారాలకు చెందిన ప్రస్తావనలోని ముఖ్యమైన అంశాలు వ్రాశాను. అందులో ఏమైన తప్పులు ఉంటే దయచేసి చెప్పండి, ధన్యవాదములు..

SHANKAR.S said...

శ్రీధర్ గారూ ఇందులో మీరు అమాయకత్వంగా భావించడానికి ఏముందో నాకు అర్ధం కాలేదు. అంతెందుకు శ్రీధర్ అనే పేరు ఇప్పుడు ఆధునికంగా అనిపిస్తోందేమో కానీ శ్రీధరుడు అనే పేరు ఎంత పాతదో మీకు తెలియనిదా? ఇక కత్తి పట్టి అనేదానికంటారా? సమురాయ్ యుద్ధ విద్యలో AK 47 వాడటం మీరు ఎప్పుడైనా చూశారా? మరి సమురాయ్ యుద్ధ కళ ఇప్పటికీ సజీవంగానే ఉందిగా. ఇక గుర్రమెక్కి అంటారా? అది అంత ప్రాచీన కాలంది అనుకున్నప్పుడు చివరికి మన పోలీస్ శిక్షణలో కూడా హార్స్ రైడింగ్ ఒక భాగంగా ఎందుకు ఉందంటారు? ఇక గుర్రం ముఖం అంటారా అప్పటికి జన్యువులలో ఎన్ని మార్పులు వస్తాయో ఎవరు చూడొచ్చారు?

మిమ్మల్ని నొప్పించడం నా ఉద్దేశ్యం కాదు. మీరు అలా భావిస్తే క్షంతవ్యుడను.

TILLAPUDI V V S N RAJU said...

శంకర్ గారు చెప్పంది నిజమె శ్రీధర్ గారు, చిన్నప్పుడు జీరాఫీ మెడ సాగింది అని డార్విన్ సిద్దాంతాన్ని చదివి నిజమే అని ఒప్పుకొన్నప్పుడు దీనిని ఖచ్చితంగ ఒప్పుకోవాలి. ఇప్పటికే ఫాషన్ ప్రపంచం లొ తమ ముఖాక్రుతులు చాల మంది వింతలుగ మార్చుకుంటున్నారు
అలాంటిది భవిష్యత్తులొ మారవచ్చు కద ఏమంటారు.