Sunday, June 10

శ్రీకృష్ణుని జననం గురించి కొన్ని అంశాలు (1)

(శ్రీకృష్ణుని జననం పై వేదవ్యాస్ గారు వ్రాసిన ఆర్టికల్ నుండి సేకరించిన సంక్షిప్త వివరణ)

శ్రీకృష్ణుని చరిత్ర చదివిన, తెలిసిన వాళ్ళందరికీ అలాంటి మనిషి నిజంగానే పుట్టి ఉంటారా లేక కల్పితమా అన్న సందేహం కలుగక మానదు. కాని, శ్రీకృష్ణుడు కేవలం వ్యాసమహాముని ఊహాజనిత పాత్ర కాదని, చారిత్రక పురుషుడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి.
ఈ విషయాలన్నిటికంటే ముందు శ్రీకృష్ణుడు జీవించిన కాలం గురించి ప్రస్తావించుకోవాలి.
మహాభారతం ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటేనే చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా ఏర్పడిన ఇతివృత్తం గల గ్రంధం అని అర్ధం. కొందరు మహాభారతం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో రాసిందని, లేక 1000 బి.సి లో రాసిందని వాదిస్తారు. వాళ్ళంతా ఇంకా పాశ్చాత్యుల బానిసత్వం పోని చరిత్రకారులే. వారి వాదనకు ఖచ్చితమైన ఆధారాలు ఉండవు.

చరిత్రలో ఒక విషయానికి సంబందించి కాల నిర్ణయం చేయాలంటే కొన్ని శాస్త్రీయ పద్దతులు ఉన్నాయి. అందులో
రేడియొ ధార్మిక పద్దతి, పురావస్తు పరిశోధనలో ఉపయోగిస్తారు. అయితే, మహాభారతం ఈ శాస్త్ర పరిశోధన కిందకు రాదు. రెండోది, గ్రహస్థితులను బట్టి, ఖగోళ శాస్త్రం ఆధారంగా కూదా కాలనిర్ణయం చేయవచ్చు అని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నిరూపించారు.

ఈ విషయంలో అతి ప్రాచీనమైన ప్రమాణ గ్రంధాలు చరిత్రకి ఆధారంగా పనికి వచ్చేవి. సంస్కృత మహాభారతం, విష్ణు పురాణం (సంహిత), భాగవతం, హరివంశం. ఇందులో సంస్కృత భాగవత నుండి మనకు తెలిసే విషయం ఏమిటంటే, ఏ రోజైతే శ్రీకృష్ణుడు తనువు త్యజించారో, సరిగ్గా ఆ రోజునే "కలియుగం" ప్రారంభమైంది. ఆరోజు ఏదై ఉంటుంది?


ఇక రెండో విషయం, శ్రీకృష్ణుని జనన కాలనిర్ణయం, భాగవతం దశమస్కంధం 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజున "ప్రజాపతి" నక్షత్రం ఉన్నదని తెలుస్తోంది. ప్రజాపతి నక్షత్రం అంటే, రోహిణి నక్షత్రం. విష్ణుపురాణం ఆధారంగా శ్రీకృష్ణ భగవానుడు శ్రాణమాసంలో, బహుళపక్షంలో, అష్టమి తిధి ఉండగా జన్మించాని తెలుస్తోంది. ఈ వివరాలు తిధి, వార, నక్షత్రాలను తెలుపుతున్నాయి. మరి సంవత్సరం మాటేంటి? హరి వంశం, విష్ణు పురాణం నుండి కొన్ని ఆధారాలను బట్టి చూస్తే, కృష్ణుని తిధి, వారం, నక్షత్రం అన్నీ కూడా సరిగ్గా సరిపోతాయి. భాగవతం ప్రకారం అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు.

“సప్తర్షీణాంతు యవ్ పూర్వే, దృశ్యే తేహ్యుదితేదివి

తేతుపారిక్షితే కలె మాఘాస్వాసన్ మహర్షయః”

ఆనాడు మరో ఖగోళ విశేషం ఏంటంటే, సప్తమహర్షుల నక్షత్రాలు. యుధిష్టురుడి కాలంలో మఖా నక్షత్రంలో ఉన్నట్లు, శతాబ్దకాలం అనగా యుధిష్టరుడు రాజ్యపాలన పూర్తి చేసే కాలం దాక నిలిచి ఉన్నట్లు ఈ శ్లోకం మనకు తెలుపుతుంది
ఇదే విషయం విష్ణుపురాణంలోనూ రుజువవుతోంది. శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన సంవత్సరమే పరీక్షిత్తు మహారాజు పట్టాభిషేకం జరిగింది. అదే ఏడు ధర్మరాజు రాజ్యపరిత్యాగం చేయడం జరిగింది

4 వినదగు నెవ్వరు చెప్పిన..:

కమనీయం said...

భారతం చారిత్రకమైనది (అతిశయోక్తులు,మహిమలు,మినహాయించి)అని చాలామంది చరిత్ర కారులు ఆమోదిస్తారు.పాశ్చాత్యులు శాస్త్రీయ పద్ధతుల ద్వారా రుజువయితేనే అంగీకరిస్తారు.వాళ్ళ సంగతి వదిలిపెట్టినా ,మీరు వేదవ్యాస్ గారి వ్యాసాన్ని ప్రచురించడమేగాని ముఖ్యమైన విషయాలు clarify చెయ్యలేదు.మీ సిద్ధాంతం ప్రకారం మనం అనుసరిస్తున్న క్రీస్తుశకం (లేకపోనీ విక్రమశకం )ప్రకారం క్రితం శ్రీకృష్ణ జననం,భారతయుద్ధం, ఎప్పుడు జరిగాయో వివరిస్తే బాగుంటుంది.మన సంప్రదాయం ప్రకారం ఇవన్నీ క్రీ.పూ.3000సం;జరిగాయి అంటారు.మీ article సమగ్రంగా లేదు .

గాయత్రి said...

వేదవ్యాస్ చెప్పిన దానిలో, శ్రీకృష్ణుని జననం క్రీ.పూ.3228 అనే చెప్పినారు. గమనించగలరు.

Anonymous said...

మహాభారత కాల వివరాలు: http://www.hindunet.org/hindu_history/ancient/mahabharat/mahab_patnaik.html

Unknown said...

అసలు క్షత్రియులలో చంద్రవంశం ఉందా?ఉంటే ఎలా వచ్చింది