36 సంవత్సరాల తరువాత అంటే, శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన సంవత్సరంలోనూ ఇదే విపరీతం చూసి శ్రీకృష్ణుడు యాదవుల వినాశనాన్ని, రానున్న కలియుగాన్ని మహాభారతంలో తెలిపినట్లు కొన్ని శ్లోకాలు స్పష్టీకరిస్తున్నాయి.
అలాగే, భీష్మ నిర్యాణం శోభాకృత నామ సంవత్సరం. శుక్రవారం, రోహిణి నక్షత్రం, తృతీయ పాదం పగలు 2ఝాములకు జరిగింది.
మహాభారతం మొదలైన 67వ రోజు భీష్మ నిర్యాణం జరిగింది. అనగా కలి పూర్వం 36 వ సంవత్సరం (3138 బి.సి). ఆ సంవత్సరంలోనే ధర్మరాజు భారతవర్ష చక్రవర్తిగా పటాభిషిక్తుడయ్యాడు. ధర్మరాజు రాజ్యకాలం 64ఏళ్ళు. కలిపూర్వం 36సంవత్సరాలు..
ఈ ఆధారాలను బట్టి చూస్తే ఈ అంశాలన్ని సరిపోయే సంవత్సరం, నెల, తేది, ఖగోళ రీత్య లెక్కకట్టవచ్చు
ఇలా గణించి చూసినట్లైతే, శ్రీకృష్ణుడు జన్మించిన తేది 19.జూలై.3228 బి.సి(ఇప్పటి క్యాలెండర్ ప్రకారం) అని తెలుస్తుంది. తిధుల ప్రకారం ఆ రోజు అంటే జూలై 19, 3228 బి.సి నాటికి శ్రీముఖ నామ సంవత్సరం నడుస్తోంది. శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, చతుర్ధ చరణం
అనేక సంస్కృత మూల గ్రంధాలలో ఉన్న శాస్త్రాధారాలు అన్నింటిలోనూ తేడాలు లేకుండా ఈ కాలం సరిగ్గా సరిపోతోంది. ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి...శ్రీకృష్ణుడు మహాపురుషుడు అనడానికి మరియు ఆయన ఎంతకాలం క్రితం ఈ గడ్డపై నివసించాడో తెలుసుకోడానికి?
****************హరే కృష్ణ***************
3 వినదగు నెవ్వరు చెప్పిన..:
పట్టాభిషేకం,తిథుల ప్రకారం,చివరలొ శ్రీకృష్ణుడు పదాలు సవరించగలరు ...
మీ 2వ పోస్టులో వివరణ ఇచ్చారు .మంచిదే.కాని 36 సం.పరిపాలన చేసాక పరీక్షిత్తుకిపట్టాభిషేకం చేసి పాండవులు యాత్రలకి బయలుదేరుతారు.64 సం. ధర్మరాజు పరిపాలనకాలం ఎలా అయింది?బహుశా అరణ్య వాసం కి ముందు ఇంద్రప్రస్థలో పాలించిన కాలం కలుపుకొని చెప్పారా?(నన్నయ భారతంలో సభాపర్వంలో పాండవులు ఇంద్రప్రస్థంలో 23 సం.పాలించినట్లు స్పష్టంగా ఉంది.) అంటే 36+23= 59 సం రెండు విడతలగా మొదట 23 ఏళ్ళు,ఇంద్రప్రస్థంలో,చివర 36 ఏళ్ళు హస్తినాపురంలోను ధర్మరాజు పరిపాలించినట్లు తెలుస్తున్నది.
మరొక్కవిషయం ;సముద్రంలో మునిగిపోయిన ద్వారక అవశేషాలు కొన్ని ఆమధ్య బయట పడినట్లు తెలిసింది.కాని దానిపై ఇంకా పరిశోధనలు ,త్రవ్వకాలు ,carbon dating వంటివి ప్రభుత్వంగాని ఇతర సంస్థలు గాని చేస్తున్నట్లు లేదు.ఇది చాలా శోచనీయం.అభినందనలు.
ప్రాజ్ఞులైన తమకు అనేక నమస్కారములు.
మీ అంశం చదివిన తరువాత నాదొక చిన్న సంశయం. ధర్మరాజు కలి యుగమునందు కొంతకాలం పరిపాలించాడా అన్నది. అదేవిధముగా శ్రీకృష్ణుని నిర్యాణ సమయముకూడ చెప్పెదరని మిక్కిలి విన్నవించుచున్నాను. -బొంగి శ్రీధర్
Post a Comment