Monday, April 4
ఉగాది -- శ్రీ ఖర నామ సంవత్సరం
ముందుగా అందరికి శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు. ఖర అంటే చురుకైన / సూర్పణక సహోదరుడు / గార్దభం అని అర్ధం. 60 తెలుగు సంవత్సరాలలో 25వ సంవత్సరం ఖర. పురాణల ప్రకారం, శ్రీ మహా విష్ణువు మాయ వలన, నారద మహర్షి మానవ (స్త్రీ) రూపం పొంది ఈ జంఝాటకాలలో పడి వివాహము, పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కొనిపోతుంది, ఒక రాజుని వివాహమాడి 60మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి. కాలగమనంలో యుద్ద సమయమున ఆ పిల్లలను పోగ్గొట్టుకొంటుంది. ఈ మాయ నుండి బైట పడ్డ ఆ యువతి (నారదుడు) ఇది అంతా ఆ మాహా విష్ణు మాయ అని తెల్సుకొంటుంది. ఆ 60మంది కుమారులకు గుర్తుగా, 60 తెలుగు సంవత్సరాలు వారి పేర్లు తో సార్ధకమౌతాయని శ్రీ మహావిష్ణువు అనుగ్రహించారని పురాణాలలో చెప్పారు.
యుగాది కృద్యుగావర్థో నైకమాయో మహాశన:
ఆద్రుశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్
విష్ణువు కు యుగాది అను పేరు కూడ ఉంది. దానిని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు. యుగాది కృద్ అంటే యుగాలను సృష్టించేవాడు, యుగావర్తో అనగా యుగములను పునరావృతం చేయువాడు.
హిందూ సంప్రదాయం ప్రకారం తెలుగు సంవత్సరాది ఉగాది నాడు మొదలవుతుంది. యుగమునకు ఆది (మొదలు) అని అర్ధము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చైత్ర మాసం లో ని పూర్ణ చంద్రోదయ రోజున, శ్రీ కృష్ణుడు నిర్యాణం చెందినాడని, ఆ రోజునే కలియుగ ఆరంభంగా పరిగణించారు. ఆ విధంగా కలియుగం ఆరంభం ఐనది అని వారి భావము.
మన జీవితంలోని ఎగుడు దిగుడులను కూడా మనం సమంగా తీస్కోవాలని తెలిపేదే ఉగాది పచ్చడి. తీపి, వగరు, పులుపు, చేదు, ఉప్పు, కారం కలగలిసినదే ఉగాది పచ్చడి . జీవితం కూడా అంతే, అన్నింటిని ఆస్వాదించినపుడే సంతోషముగా ఉంటాము.
Subscribe to:
Post Comments (Atom)
2 వినదగు నెవ్వరు చెప్పిన..:
మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు
- శి. రా. రావు
ఉగాది ఊసులు
http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html
dhanyavadamulu Rao garu
Post a Comment