చండికాశ్వేత వర్ణాసా శివరూపాచ సింహగా
జటిలా వర్తులాత్ర్యక్షా వరదా శూలధారిణీ
కర్త్రికాంబిభ్రతీం దక్షా పాశపాత్రా భయాన్వితా
చండిమాత తెల్లని దేహం, శుభకరమగు రూపంతో విరాజిల్లుచున్నది. సింహ వాహన ధారీయై, జడలు దాల్చి, బొద్దుగా నున్నది, సూర్య చంద్రాగ్నులను, మూడుకన్నులను కలిగియున్నది. ఆమె కుడి వైపునున్న చేతులలో కింది నుండి పైకి వరుసగా వరముద్ర, శూలం, కత్తెర మున్నగు వాటిని, అలానే ఎడమవైపు అభయ ముద్ర, పానపాత్ర, పాసం మొదలైన వాటిని ధరించియున్నది. ఆమె శిరస్సుపై చంద్రరేఖ నెలకొనియున్నది.
Sunday, December 30
Subscribe to:
Posts (Atom)