ఈ సమయం లో నల్లని పంచలు, మెడ లో రుద్రాక్ష మాలలు, నుదుట గంధం విభూది ల తో మనకు అయ్యప్ప భక్తులు కనిపిస్తారు. 40 రోజుల దీక్ష తీస్కోని, అయ్యప్ప ని పూజించే భక్తులను మనం "స్వామి " గా సంభోదిస్తాం. ఈ అయ్యప్ప దీక్ష అనునది మళయాళ నెలల లో వృశ్చికం ( నవంబర్ 14/15/16 ) నుండి మొదలవుతుంది. మండల పూజ
( సుమారు25 dec ), మకర సంక్రాంతి ( సుమారు 14jan ) ఈ రెండు రోజలలో అయ్యప్ప స్వామి దర్శనం చేస్కొంటారు. ఈ రెండు రోజలలో మకర సంక్రాంతి రోజు దర్శనం ప్రదానమైనది. ఆ రోజు జ్యోతి దర్శనం జరుగుతుంది. జ్యోతి రూపం లో అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తారు.
శబరిమల ఆలయం, మళయాళ నూతన సంవత్సర మొదటి రోజు, ప్రధాన పండగల రోజు తెరుస్తారు. ఉదా : ఓనం, విశు. 41రోజుల దీక్ష తప్పనిసరిగా తీస్కొని అయ్యప్ప దర్శనం చేయవలెను. ఈ అయ్యప్ప దీక్ష అనునది తల్లి ద్వారా కానీ, గురువుగారి ద్వారా కాని, గురుస్వామి ద్వారా కానితీస్కొనవలెను. ఆ రుద్రాక్ష మాల మెడలో పడిన దగ్గర నుండి " స్వామి " అని అందరి చేత పిలువబడుతాడు. అమ్మాయిలు ఈ దీక్ష తీసుకోడానికి నిబంధనలు ఉన్నాయి. అమ్మాయి 1 -9 వయస్సు లోపు వారు, 50 వయస్సు దాటినా వారు దీక్షకు అర్హులు. దీక్ష తీసుకొన్న ఆడువారిని "మాలికాపురం" గా పిలుస్తారు. ( అయ్యప్ప యొక్క శక్తి స్వరూపం).
దీక్ష తీసుకొన్న వారు ఖచ్చితంగా నియమ నిభంధనలను పాటించాలి. తెల్లవారక ముందే లేచి, చన్నీటి స్నానం చేసి, శరణు ఘోష చేసి, నైవేద్యం పెట్టాలి. చెప్పులు, బూట్లు ధరించకూడదు. నలుపు / కాషాయం రంగు మాత్రమే ధరించాలి. జుట్టు కత్తిరింపు, ధూమపానం, మందు తాగటం, మాంసాహారం భుజించడం చేయకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండ పాటించాలి. వేరే వారిని పిలిచేటప్పుడు కూడా స్వామి అనే సంభోదించాలి. ఈ నియామాలు పాటించకుండా శబరిమల దర్శనం వ్యర్ధం.
" ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప "