Sunday, November 9

గురుశ్లోకం

గురుబ్రహ్మ గురువిష్ణుర్గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

గురుః --- శ్రీ సద్గురువు , బ్రహ్మ --- బ్రహ్మదేవుడు , గురుః --శ్రీ గురుమూర్తి , విష్ణువు --- విష్ణువు, గురుః -- శ్రీగురుదేవుడు, దేవః..దేవుడగు, మహేశ్వరః--ఈశ్వరుడు, గురుః--శ్రీగురువర్యుడు, సాక్షాత్పరబ్రహ్మ --- ప్రత్యక్షమైన పరబ్రహ్మము, తస్మై--అటువంటి, శ్రీగురవే--శ్రీసద్గురువు కు, నమః--నమస్కారము.

చతుర్వేద సారములను భోదించుటచే శ్రీగురుదేవుడు చతుర్ముఖములతో చతుర్వేదములను ఉపదేశించు బ్రహ్మదేవుడై ఉన్నాడు.
జ్గ్యాన భోదనలు చేసి ఆజ్గ్యానములోకి పడనీయకుండా అందరిని రక్షించిన వాడగుటచే శ్రీగురుదేవుడు విష్ణువై ఉన్నాడు.
శరణు వేడిన వారికి సకల అజ్గ్యానములను హరింప చేస్తునాడు కావున శ్రీగురుదేవుడు సకల జగములను లయ మొనరించు మహేశుడై ఉన్నాడు.
త్రిగుణాతీతమగు ( సత్వ, రజ, తమో గుణాలు ) బ్రహ్మతత్వం అగుటచే శ్రీగురువు సాక్షాత్ పరబ్రహ్మమై ప్రకాశించుచున్నాడు. అట్టి గురుదేవునకు నా నమస్కారము.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: