Tuesday, June 8

పురాణములు

జాతి యొక్క ప్రాచీన చరిత్ర, సంస్కృతి, సభ్యత, భాగావాదాచార వివరాలను, దైవస్తుతి ని తెలియచేసేవి పురాణాలు. వేదవ్యాస మహర్షి వేదాల లక్షసిద్ధిని సరళంగా పురాణాల ద్వారా అందిచారు. మొత్తం 18 పురాణాలు ఉండగా, మరో36 ఉప పురాణాలు అదనంగా ఉన్నాయి. శతకోటి శ్లోకాలతో ఇమిడియున్న పురాణాలను వ్యాస మహర్షి నాలుగు లక్షలకు కుదించి, వాటిని 18 పురాణాలలో రూపొందించారని చెప్తారు.
వీటిలో కొన్ని వేదాలకు సమకాలీకం అని, మరికొన్ని వేదాలకు ముందని చెప్తుంటారు.

బ్రహ్మ పురాణం :
ప్రాచీన మొదటి మహా పురాణం. సృష్టి కర్తను స్తుతించిన పురాణం.

పద్మపురాణం :
ఖండాలుగా గల పురాణంలోనూ బ్రహ్మదేవుని స్తుతిస్తూ చెప్పబడినది.

విష్ణు పురాణం:
పురాణంలో విష్ణు భక్తీ ని గురించి ప్రదానంగా భోదించారు.

వాయుపురాణం:
దీనిని శివపురాణం అని కూడా అంటాము. శైవులకు ఆరాధ్య పురాణం.

మార్కండేయ పురాణం:
మార్కండేయ చరిత్ర తో పాటు వేల శ్లోకాలు కల్గిన పెద్ద గ్రంధము.

లింగపురాణం :
లింగ పూజలలోని శక్తిని, పూజ విధానాన్ని విపులంగా వర్ణించబడినది.

స్కంద పురాణం :
పార్వతి పరమేశ్వరుల పుత్రుడైన స్కందుడిచే చెప్పబడిన పురాణం. శివపార్వతుల లీలలు పురాణం లో చెప్పబడ్డాయి.

నారద పురాణం:
నారద మహర్షి చేత చెప్పబడిన పురాణం అనితరమైన విష్ణు భక్తిని ప్రభోదిస్తుంది. వైష్ణవ భక్తులకు అతి ముఖ్యమైనది.

శ్రీ మద్భాగవత పురాణం:
భక్తి తత్వానికి సంబంధించిన పురాణంలో సృష్టి ఆరంభ వర్ణనలు ఉన్నాయి.

బ్రహ్మ వైవక్త పురాణం:
కృష్ణ భక్తిని ప్రభోదిస్తుంది. రాధాకృష్ణుల భక్తి తత్వాన్ని తెలియచేస్తుంది.

మత్స్యపురాణం:
అవతారగాధాలకు సంబంధించిన పురాణం. దాన ధర్మాలు, జపతపాల ప్రాశాస్త్రాన్ని వివరించబడినది.

కూర్మ పురాణం:
విష్ణుమూర్తి అవతారములను తెలియచేసే పురాణం. శివకేశవుల ఏకత్వాన్ని తెలుపుతుంది.

వరాహపురాణం:
విష్ణు వరాహ అవతారం గురించి వివరించబడినది.

వామనపురాణం :
వామనావతార కథే పురాణం.

అగ్ని పురాణం:
భగవంతుని అవతారాలు, దేవాలయ నిర్మాణ శాస్త్రం, విగ్రహ శాస్త్రాలను చెప్పే పురాణం.

భవిష్య పురాణం:
భవిష్యత్ గురించి చెప్పే పురాణం.

బ్రహ్మాండ పురాణం:
విశ్వాన్ని వివరించి వివరంగా చెప్పడం తో పాటు భూగోళ, భూగర్భ, ఖగోళ శాస్త్రాలను వివరించారు.

గరుడ పురాణం:
విద్యనూ గురించి, శాస్త్రాల గురించి, గీతా సారం గురించి చెప్పబడినది.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: