Wednesday, March 16

శివలింగోద్భవం

శివలింగోద్భవం గురించి స్కంద పురాణం లో వివరించబడినది. ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరు గొప్పో తేల్చుకొనేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రాలను ప్రయోగించుకొన్నారు. దీనిని గమనించిన పరమేశ్వరుడు మరో మారు ప్రళయం జరుగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేసి అందులో అందరికి దివ్య దర్శనం ఇచ్చాడు. పుష్కలా వర్తక మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి ఆ శాంభవనల స్తంభాన్ని చల్లార్చాడు. అదే శివలింగం. మాఘ బహుల చతుర్దశినాడు అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకొనేందుకు వెళ్లి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుడ్నే శరణు వేడుకొంటారు. అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు. శివరాత్రి నాడు ఈ లింగోధ్బవ కాలం ముఖ్యమైనది. కావున అన్ని శివాలయాలలో ఆ రోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

సాదారణంగా ప్రతీనెలా వచ్చే చతుర్దశి తిధిని మాసశివరాత్రి అంటాము, మాఘమాసంలో బహుళ చతుర్ధశినాడు వచ్చేది మహా శివరాత్రి.

2 వినదగు నెవ్వరు చెప్పిన..:

Sunil said...

Mahaa siva ratri gurinchi unna ikkade Lingodbhava prantamu gurinchi kudaa unte baguntundi.

Tiruvannamalai.(Pancha bhutatmaka lingaalalo agni lingam)

గాయత్రి said...

dhanyavaadamulu sunil