Friday, May 29

లింగాష్టకం

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
బ్రహ్మ = బ్రహ్మ దీవుడు
మురారి
= ముర + అరి = ముర అనే రాక్షసుడి శత్రువైన విష్ణు
సుర
= దేవతలు
అర్చిత
= పూజింపబడిన లింగం = శివ లింగం
బ్రహ్మ , విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం

నిర్మల భాషిత శోభిత లింగం
నిర్మల = నిర్మలమైన
భాషిత = మాట్లాడబడ్డ = మాట
శోభిత = అలంకరింపబడ్డ
లింగం = శివ లింగం
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం …


జన్మజ దుఃఖ వినాశక లింగం
జన్మ = భౌతిక్యమైన ఉజ = పుట్టిన దుఃఖ = బాధలు వినాశక = నాశనం చేసే
లింగం = శివ లింగం
జన్మ వల్ల పుట్టిన బాధల ను నాశనం చేసే లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
తత్ = నీకు
ప్రణమామి = నమస్కారం
సదా శివ లింగం = సదా శివ లింగం ..
ఓ సదా శివ లింగం నీకు నమస్కారం !


దేవముని
ప్రవరార్చిత లింగం
దేవముని = దేవ మునులు ( నారద , తుంబుర మొదలైన వారు )
ప్రవర = మహా పురుషులు ( మహా ఋషులు )
అర్చిత = పూజింప బడ్డ
లింగం = శివ లింగం
దేవమునులు , మహా ఋషులు పూజింప లింగం

కామదహన
కరుణాకర లింగం
కామ = మన్మథ
దహన = కాల్చడం
కరుణాకర = కరుణను చూపే
లింగం = శివ లింగం
మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం
(ఇంకొక అర్ధము .. కామా = తుచ్చమైన ఊరిక్యలను అంతం చేసే , కరుణను చూపే చేతులు అల
లింగం )

రావణ దర్ప వినాశక లింగం
రావణ = రావణుడి
దర్ప = గర్వాన్ని
వినాశక = నాశనం చేసినట్టి
లింగం = శివ లింగం
రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం

తత్ ప్రణమామి సద శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

సర్వ సుగంధ సులేపిత లింగం
సర్వ = అన్ని
సుగంధ = సుగంధాలు
సు = మంచి
లేపిత = పూసిన
లింగం = శివ లింగం
అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం

బుద్ధి వివర్ధన కారణ లింగం
బుద్ధి = జ్ఞానం
వివర్ధన = వికసించడానికి
ఆరన్ = కారణమైన
లింగం = శివ లింగం
మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన
శివ లింగం .

సిద్ధ సురాసుర వందిత లింగం
సిద్ధ
= సిద్ధులు
సుర = దేవతలు
అసుర = రాక్షసులు
వందిత = కీర్తింపబడ్డ
లింగం = శివ లింగం
సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

కనక మహామణి భూషిత లింగం
కనక = బంగారు
మహా మణి = గొప్ప మణులు
భూషిత = అలంకరింప బడ్డ
లింగం = శివ లింగం
బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగం
ఫణిపతి = నాగ రాజు
వేష్టిత = నివాసముండే
శోభిత = విరాజిల్లే , అలంకరింపబడ్డ , శోభించే
లింగం = శివ లింగం
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం ( అంటే శివుడి మెడ చుట్టూ పాము ఉంటుంది కదా .. అలా పాము వల్ల అలంకరింపబడ్డ అని .)


దక్ష సుయజ్ఞ వినాశక లింగం
దక్ష = దక్షుడి
సుయజ్ఞ = మంచిదైన యజ్ఞం
వినాక్షక = నాశనం చేసిన
లింగం = శివ లింగం
దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం ( ఈ సందర్భం లో శివుడి భార్య సతీ దేవి అగ్ని లో పది ఆత్మా హత్య చేసుకొని , పార్వతి గా మళ్ళీ అవతరిస్తుంది )


తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

కుంకుమ చందన లేపిత లింగం
కుంకుమ = కుంకుమ
చందన = గంధము
లేపిత = పూసిన
లింగం = శివ లింగం
కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం

పంకజ హార సుశోభిత లింగం
పంకజ = పద్మం , కమలం
హార = దండ
సు = మంచి గా
శోభిత = అలంకరింప బడ్డ
లింగం = శివ లింగం
కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం

సంచిత పాప వినాశక లింగం
సంచిత = సంక్రమించిన
పాప = పాపం
వినాశక = నాశనం చేసే
లింగం = శివ లింగం
సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

దేవగణార్చిత సేవిత లింగం
దేవగణ = దేవగణాల
అర్చిత = పూజింప బడ్డ
సేవిత = సేవించ బడ్డ
లింగం = శివ లింగం
దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం

భావైర్ భక్తీ భిరేవచ లింగం
భావైర్ భక్తీ = భావ సహితమైన భక్తీ
లింగం = శివ లింగం
చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం

దినకర కోటి ప్రభాకర లింగం
దినకర = సూర్య
కోటి = కోటి
ప్రభాకర = సూర్య
లింగం = శివ లింగం
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు ,ఓ సదా శివ లింగమా ..!

అష్ట దలోపరి వేష్టిత లింగం
అష్ట = ఎనిమిది
దళ = దళాల
ఉపరి = మీద
వేషిత = నివసించు
లింగం = శివ లింగ
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం

సర్వ సముద్భవ కారణ లింగం
సర్వ = అన్నీ
సమ = సమానంగా
ఉద్భవ = జన్మించు
కారణ = కారణం
లింగం = శివ లింగం
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం

అష్ట దరిద్ర వినాశక లింగం
అష్ట = ఎనిమిది
దరిద్ర = దరిద్రం
వినాశక = నాశనం చేసే
లింగం = శివ లింగం
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు ) నాశనం చేసే శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు ,ఓ సదా శివ లింగమా ..!

సురగురు సురవర పూజిత లింగం
సుర = దేవతలు
గురు = గురువు
సురవర = దేవతలు
పూజిత = పూజింప బడ్డ
లింగం = శివ లింగం
దేవ గురువు (బృహస్పతి ), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం

సురవన పుష్ప సదార్చిత లింగం
సుర = దేవతలు
వన = తోటలు
పుష్ప = పువ్వులు
సదా = ఎప్పుడూ
అర్చిత = పూజింప బడు
లింగం = శివ లింగం
దేవతల తోటల్లో పూచే పువ్వులు ( పారిజాతాలు ) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం

పరమపదం పరమాత్మక లింగం

పరమ పదం = చివరి చరణం , చివరి మజిలీ , స్వర్గము
పరమాత్మక = పరమాత్మ కు సంబంధించిన
లింగం = శివ లింగం
ఓ శివ లింగమా , నీ సన్నిధి ఏ ఒక స్వర్గము

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

లింగాష్టక మిదం పుణ్యం
లింగాష్టకం – లింగాష్టకం
ఇదం – ఇది
పుణ్యం - పుణ్యం
ఇది శ్రీ లింగాక్ష్టకం

యః పట్టేత్ శివ సన్నిధౌ
యః పట్టేత్ = ఎప్పుడు చదవబడుతుందో
శివ సన్నిధౌ = శివుడి సన్నిధిలో
ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది

శివ లోక మవాప్నోతి శివ లోకం లభిస్తుంది
శివేన సహమోదతే శివుడి లో నే ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది

అంటే , ఈ లింగాష్టకం అనేది శివుడి సన్నిధిలో ఎప్పుడు చదువుతామో , అప్పుడు మనకు శివ సాయుజ్యం దొరుకుతుంది అని అర్థం …!



4 వినదగు నెవ్వరు చెప్పిన..:

vijaya said...

gayathri,
mee blog chala bagundhi.ligastakam ante naaku chala istam. ikkada meeru prathi padhaniki meaning icharu-adhi chala bagundhi. thanks for sharing.

గాయత్రి said...

dhanyavaadamulu vijaya...

vijaya said...

gayathri, meeku velithe brahmam gari kala gnanam pettandi. Satyanaraya swami vratha vidhanam pedithe kuda baguntundhani naa abhiprayam.

గాయత్రి said...

kalagyaanam gurinchi matter sekarinchi asap, blog dwaara meku adistaanu..