Sunday, May 16

అక్షయ తృతీయ

అక్షయం అంటే క్షయము లేనిది. జీవితంలో అన్నింటిని అక్షయం చేసే పర్వదినం కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ నాడు పండుగను జరుపుకొంటాము. పండుగ గురించి, ఆచరించాల్సిన విధి విధానాలను గురించి భవిష్య, శివ పురాణాలలో వివరించారు. వైశాఖ శుద్ధ తదియ నాడు కృతయుగం, కార్తీక శుక్ల నవమినాడు త్రేతాయుగం, భాద్రపద బహుళ త్రయోదశి నాడు ద్వాపరయుగం, మాఘబహుళ అమావాస్య నాడు కలియుగం ఆరంభమైనదని విష్ణు పురాణం చెబుతోంది. కృతయుగం ప్రారంభమైన రోజున అక్షయతృతీయగా జరుపుకొంటారు. బదరి నారాయణస్వామి ఆలయాన్ని రోజున తెరుస్తారు. ఉత్తర భారతంలో పండుగనాడు లక్ష్మీదేవి పూజ చేస్తారు. అక్షయతృతీయ నాడు బంగారం కొనుగోలు చేసి ఇంటికి తెచుకొంటే లక్ష్మీదేవి ఆయా గృహాల్లో స్థిరనివాసం ఏర్పరచుకొంటుందని పలువురి నమ్మకం.

4 వినదగు నెవ్వరు చెప్పిన..:

vijaya said...

akshaya truthiya gurinchi chala baga vivarincharu. thanks gayathri

గాయత్రి said...

thank you vijaya..

Seetharam said...

మొదట గా మీ కృషి కి శుభాకాంక్షలు. అక్షరదోషాలు చెప్పమన్నారు కనక, త్రితియ అనరు. తృతీయ లేదా, తదియ. మొదటిది సంస్కృతము, రెండవది తెనుగు పద ప్రయోగము.

ఇప్పుడు విషయములోనికి వస్తే, అక్ష పదము ఎందుకు వాడాలి? ఇది కూడా వ్రాసి ఉంటే బాగుండేది.

ప్రాశస్త్యము మరొక్కటి, శ్రీ సింహాచల స్థిత శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ స్వామి వారి చందనపు ఒలుపు, మరియు నిజ రూప దర్శనము కూడా ఈ రోజునే ఉంటుంది.

బుధజన విధేయుడు

సీతారామం

గాయత్రి said...

chaala danyavadamulu seetharam gaaru,trutiya ane savarimpu chesaanu. akshayam ante kshayamu ane daaniki taavu ledu ani telsu kani..."aksha" ante emito naku avagaahana ledu,ardham telusukoni raayadaniki prayatnam chestanu..