Saturday, October 27

కోజాగరి వ్రత విధానం

ఆశ్వీయుజ పూర్ణిమనాడు ముక్యంగా స్త్రీలు బ్రాహ్మే ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని ఇంటిని శుభ్రపరచుకుని, పూజామందిరంలో కాని లేదా పూజ చేయదలాం చుకున్న చోట మండపమును ఏర్పరుచుకుని అందులో శ్రీలక్ష్మి విగ్రహమును గాని, పతమును గాని ప్రతిష్టించుకుని ముందుగా గణపతి పూజచేసి అనంతరం శ్రీలక్ష్మిదేవిని షోడశోపచారాతో, అష్టోత్తరశతనామములతోనూ పూజచేయాలి.

శక్తికొలది నైవేద్యం పెట్టి, తిరిగి చంద్రోదయం అయిన తరువాత లక్ష్మీదేవిని పూజించాలి. పాలు, పంచదార, పలకపొడి, కుంకుంపువ్వు, బియ్యం వెసి క్షీరాన్నం వండి, నైవేద్యంగా పెట్టాలి. తరువాత క్షీరాన్నాన్ని ఆరుబట వెన్నెలలొ పెట్టి కొద్దిసేపు తరువాత ప్రసాదముగా తీసుకోవాలి.

ఇలా ఆరుబయట ఉంచడంవలన చంద్రకిరణాల ద్వారా అమృతం వచ్చి అందులో పడుతుందని నమ్మకం. తరువాత రాత్రి జాగరం చేయాలని శాస్త్రం చెబుతోంది.


జాగరణ సమయంలో పాచికలు లేదా గవ్వలు ఆడుతూ గడపాలని ఆచారం. ఆశ్వయుజ పూర్ణిమనాటి రాత్రి శ్రీమహాలక్ష్మి భూలోకమంతా తిరుగుతూ ఎవరైతే జాగరణ చేస్తూంటారో వారికి సిరిసంపదలను చేకూరుస్తుందని కధనం. మరుసటి రోజు పునః పూజ చేసి వ్రతం పరిసమాప్తి చేయాలి.


అంతేకాకుండా ఇదేరోజు మనరాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో "గొంతెమ్మ పండుగ"ను చేస్తారు. కుంతీమహేశ్వరిని పూజిస్తారు. అరిసెలు, అప్పములు, కూరలను నైవెద్యముగా సమర్పిస్తారు.


ఆశ్వయుజ పూర్ణిమనాడు నారదీయ పురాణమును దానం చేయడం వల్ల మరణాంతరం ఇష్టలోకప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: