Thursday, October 30

కార్తీకమాసం

తెలుగు నెలలన్నింటిలో కార్తీక మాసానికి విశిష్టస్థానం ఉంది. ఈ మాసాన్ని త్రిశూల దారుడు, ముక్కంటి అయిన శివునికి ప్రీతి పాత్రమైనదిగా భక్తులు భావించడం వల్ల గరళకందుడికి ఈ మాసమంతా భక్తిప్రపత్తులతో పూజలు చేస్తారు. ఈ మాసంలో పూజలు, ఉపవాసాలు చేయడంవలన మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. మాసం సముద్ర స్నానాలకు, వనభోజనాలకు ప్రసిద్ది. ఈ సంవత్సరం లో అక్టోబర్ 29 నుండి నవంబర్ 27 వరకు కార్తీకమాసం. ఈ మాసం అంతా సాయంత్రంపూట కూడా ఇంటి ముంగిట దీపాలు పెడతారు. కార్తీక మాసం లో రుద్రాభిషేకం కు విశిష్ట ప్రాముఖ్యం వుంది.

కార్తీక మాస ప్రాధాన్యతను పద్మ పురాణం ఉత్తరఖండం లో వివరించబడినది.

కార్తీక మాస ప్రాధాన్యతను శ్రీ కృష్ణుడు, సత్యభామ తో ఇలా చెప్పారు :

వేదాలను దొంగలించి సముద్రం లో దాగిన శంకాశుర అను రాక్షశుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం ధరించి, రాక్షస సంహారం గావించి వేదాలను రక్షించాడు. కార్తీక మాసం లో 11 రోజు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినారు.

మాసం లో తిరుప్పావై (గోదాదేవి గురించినది) చదువుతారు. తెల్లవారుఝామునే లేచి తులసికోట దగ్గర దీపాలు పెట్టి తులశమ్మకి పూజ చేస్తారు. ఈ మాసం చివరి సోమవారం 108 / 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి న శ్రీ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు.

Thursday, October 9

బాబా మహాసమాధి చెందినరోజు,విజయదశమి.

సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా మహాసమాధి చెందిన రోజు.

1918, రామచంద్ర పాటిల్ అనే భక్తుడు తన జబ్బు తగ్గాలని భయం తో బాబాను ప్రార్దించాడు.బాబా అతనికి కలలో కనపడి బయపడాల్సింది నువ్వు కాదు తాత్యా అని చెప్పారు.(బాబా ను ఎప్పుడు మామా, మామా అని పిల్చే వాడు తాత్యా). తాత్యా విజయదమి రోజున మరణించాల్సి వుండి కాని నేను అది జరగనివ్వను అని రామచంద్రపటిల్ కు బాబా చెప్పారు.
నవరాత్రులు రానే వచ్చాయి. తాత్యా కు భయంకరమైన జబ్బు చేసి మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబా విభూది వలన అతను కోలుకొన్నాడు కానీ బాబా అక్టోబర్15,1918 విజయదశమి రోజున తాత్యా కి బదులు తాను మన అందరిని వదిలి మహాసమాధిని పొందారు.అక్టోబర్ 17, న బాబా దేహాని సమాధి చేసి దాని మీద వారి పటం వుంచారు.
సాయి గురుప్రసాదం గా భావించిన ఇటుక ను బాబా సమాధి లో తల కింద వుంచారు. అలాగే బాబా దగ్గర ఎపుడు ఒక మూట వుండేది,అందులో పాత కఫ్ని,టోపీ వుండేవి. అవి కూడా బాబా సమాధి లో ఉంచారు.
బయాజామామి బాబా ని కొడుకు తాత్యని ఒకేలా చూసింది,కాదు కాదు సాయి నే ఎక్కువ చూచుకొన్నది. అందుకనే బాబా తాత్యని తమ మరొక రూపంగా ప్రేమించారు.
ఒకే ఆత్మ రెండు దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణం లో కూడా వేరుకాకుడదు అని బాబా మొదట తలచారు కానీ తాత్యా కుటుంబా ని తలచి తన సంకల్పాన్ని మరల మార్చుకొన్నారు.

కన్నతల్లి కన్నా తమ భక్తులను ఎక్కువగా కనిపెట్టుకొని వుంటారు బాబా.

జై
సాయినాథ్ మహారాజ్

Monday, October 6

దశర చివరిరోజు ..విజయదశమి

అమ్మవారు మహిషాసురుడుని సంహరించి, దుష్ట సంహారం చేసి సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజు [దశమి తిధి నాడు] పండగ జరుపుకొంటాం. కాబట్టి విజయదశమి గా పిల్చుకొంటున్నాం.

ఈ విజయదశమి ని మన దేశం లో ఉత్తర దిక్కున ఉన్నవారు ఈ రోజున , రాముడు రావణుడి ఫై విజయం సాదించి దుష్ట సంహారం చేసి, సీతమ్మని తిరిగి అయోధ్యకు తీస్కొని వెళ్ళిన సందర్భానికి గుర్తుగా రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి పండుగను జరుపుకొంటారు.

12ఏళ్ళు వనవాసం, 1 ఏడు అఙ్ఞాతవాస కాలం లో పాండవులు తమ మంత్రోపేతమైన ఆయుధాలను జమ్మి వృక్షం ఫై వుంచి,తిరిగి అఙ్ఞాతవాసం తర్వాత జమ్మి వృక్షమునకు పూజ చేసి ఆయుధాలను ధరించారు.కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున "ఆయుధపూజ" ని చేస్తారు. కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొంటారు.

Sunday, October 5

దశర తొమ్మిదవరోజు ...శ్రీ రాజరాజేశ్వరీ అవతారం



అంబా
శాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ

కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవాణీ శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ


Saturday, October 4

దశర ఎనిమిదవరోజు ..శ్రీ మహిషాసురమర్ధిని అవతారం



అయిగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్యశిరో ధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే

పర్వతరాజు నందుని యొక్క కుమార్తె, ప్రపంచానికి సుఖ సంతోషాలను ప్రసాదిస్తున్న , వింధ్య పర్వత నివాసిని, నీలవర్ణ కంఠము గల మహావిష్ణువు యొక్క పత్ని, దేవతలందరి చేత స్తుతించబడుతున్న, మహిషిని సంహరించి మహిషాసురమర్ధిని అయిన పర్వత పుత్రి నమస్కారము.

పూర్వము ధనువు అనే రాక్షసరాజుకి రంభుడు , కరంభుడు అనే ఇద్దరు కొడుకులుండేవారు. వారు పెరిగి పెద్దవారై తమకి ఉత్తమ సంతానం లభించాలనే కోరికతో తపస్సు చేయ ప్రారభించారు. వారి ఇద్దరులోను కరంభుడు నీటిలోను, రంభుడు చెట్టు మీద ఎక్కి ఘోర తపస్సు చేయసాగారు. అది చూసి ఇంద్రుడు తన ఇంద్రపదవి కోసము వారిరువురు తపస్సు చేయుచున్నారని పొరబడి మొసలి రూపాన్ని ధరించి నీటిలో తపస్సు చేయుచున్న కరంభుడిని సంహరించెను. అది చూసి రంభుడు తన అన్న మరణానికి బాధపడుచూ, తన అన్న లేని జీవితం వ్యర్ధమని తలచి తన తల తీసి శంకరుడికి సమర్పించెను.
అంత శంకరుడు రంభుడి ఎదురిగా ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడు రంభుడు శంకరుడు తో " స్వామీ ! పుత్ర సంతానం లేని నాకు నీవే మూడు జన్మలలోనూ పుత్రుడిగా జన్మించాలి. నీ వర ప్రభావంతో జన్మిచబోయే నా పుత్రుడు ముల్లోకాలలని జయించేవాడు, ధీర్ఘాయుషమంతుడు, యశోవంతుడు, కామరూపకోవిదుడు వంటి సుగుణాలు ఉన్నవాడు గా నాకు కావాలి " అని కోరుకోగా "తధాస్తు " అని శంకరుడు అంతర్ధనమైనాడు.
అలా వరాలు పొందిన రంభుడు ఉత్సాహంగా అడవి నుండి ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఎదురుగా కామాతురంతో మంచి యవ్వన ప్రాయంలో ఉన్న గేదెను చూసి చలించిపోయి తాను కూడా కామోద్రేకాన్ని పొంది సహజమైన రాక్షస ప్రభావంతో ఆ గేదే తో రమించాడు.
అదే సమయంలో పరమేశ్వరుడు కూడా తన అంశాన్ని ఆ మహిషం లో ప్రవేశ పెట్టాడు. ఇలా కొంత కాలం తర్వాత ఆ మహిషికి ఒక కొడుకు పుట్టాడు, మహిష గర్భ సంజాతుడు కాబట్టి వాడు కూడా మహిష మానవాకారంతో పుట్టాడు. వాడు పెరిగి పెద్దవాడై ఇంద్రున్ని జయించి స్వర్గాధిపత్యాన్ని పొంది సకల భోగాలు అనుభవించసాగాడు.
ఇలా కొంత కాలం గడచిన తర్వాత ఒక రోజు దుర్మార్గుడైన ఆ మహిషిడు స్త్రీ రూపం ధరించి కాత్యాయణ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి ఆయన శిష్యుడిని ఏడిపించసాగాడు. ఆ దృశ్యం చూసి కోపంతో కాత్యాయణ మహర్షి " ఓయీ ! మహిషాసురా ! నా శిష్యుడిని స్త్రీ రూపం ధరించి నీవు భాధించావు , కాబట్టి నువ్వు స్త్రీ వలననే మరణిస్తావు" అని శపించెను.
అయినా మహర్షి శాపాన్ని లెఖ్ఖచేయకుండా మహిషుడు యధా ప్రకారము దేవతలని , ఋషులని , స్త్రీలని సాధువులని పీడించసాగాడు. చివరికి వీడి అకృత్యాన్ని సహించలేక దేవతలంతా భయబ్రాంతులైనారు .
స్త్రీ వలననే మహిషాసురిడికి మృత్యువు వాటిల్లుతుందని గ్రహించి దేవతలందరూ విష్ణువుని శరణు గోరారు. అంతట విష్ణువు వారందరికీ ఒక ఉపాయం చెప్పెను. సకల దేవతాంశలను తేజోశ్శక్తూలను కలబోసికొని ఒక స్త్రీ మూర్తి ఆవిర్భవించినట్లైతే మహిషాసురిడిని ఆ స్త్రీ మూర్తి చేత సంహరించ చేయవచ్చునన్నాడు.
ఆ మాటలకు అందరూ సమ్మతించిరి. ముందుగా బ్రహ్మ ముఖమునుండి ఒక తేజోరాశి ఆవిర్భవించినది. పద్మరాగ మణికాంతులను వెదజల్లుతున్న ఆ తేజోరాశిని దేవతలందరూ చూస్తుందగనే శివుడి నుండి వెండిలాగా ధగధగ లాడుతున్న మరోకాంతి పుంజం అక్కద కనిపించింది. విష్ణుమూర్తి నుంచి నిలం రంగులో మూర్తిభవించిన సత్వగుణంలగా ఉన్న తేజస్సు వెలువడింది యముడు, అగ్ని, కుబేరుడు, వరుణుడు ఇలా ఒక్కరేమిటి సకల దేవతల నుండి అప్పటికప్పుడు తేజస్సులు వెలుబడి ఒక దివ్య తేజోరాశి అయిన స్త్రీ మూర్తి గా రూపుదాల్చినది.

తర్వాత దేవతలందరూ ఆయుధాలు ఆమెకు బహూకరించారు. విష్ణువు సుదర్శన చక్రం నుండి అలాంటిదే మరొకటి సృష్టించి ఇచ్చాడు. శంకరుడు త్రిశూలన్ని, వరుణుడు మంచి శంఖాన్ని, అగ్నిదేవుడు శతఘ్నన్ని, వాయువు ధనస్సును, ఎప్పటికీ తరగిపోని బాణాలతో ఉన్న అంబుల పొదని ఇచ్చాడు.

దేవేంద్రుడు వజ్రాయుధాన్ని పోలిన మరొక ఆయుధం, యముడు తన కాల దండం లాంటి దండాన్ని, బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన కమండలాన్ని ఆ మాతకు సమర్పించారు. వరుణుడు తన పాశాయుధాన్ని, కాలుడు ఖడ్గాన్ని, కుబేరుడు సర తో నిండిన సువర్ణ పాత్రని, కౌమోదకి గద త్వష్ణ సమర్పించారు. ఇలా అనేకానేక ఆయుధాలతో ఆ శక్తి స్వరూపిణి అలరారింది.

ఆ మహిషాసురుడిని సంహరించుట కొరకు ఆ ఆదిపరాశక్తి రోజుకో రూపంతో ఆ మహిషాసురిడితో పోరి చివరికి ఉగ్రరూపంలో ఆ మహిషాసురిడిని సంహరించి " మహిషాసుర మర్ధిని " అయినది. మహిషాసురిడిని సంహరించాక కూడా ఆ తల్లి శాంతించలేదు.

విలయ తాండవం చేస్తున్న ఆ ప్రళయ శక్తిని శాంత పరచుటకు ఎవరికీ సాధ్యపడలేదు .అందరూ శంకరుడిని వేడుకోగా , అంతట శంకరుడే ఆ ఆది శక్తి పాదాలచెంత పరుండినాడు , శివుడికి ఆ తల్లి పాదాలు తగలగానే రౌద్ర వీర ప్రచండ చండిక శృంగార సౌందర్య లహరైన గౌరీ దేవిగా మారినది. అందరికీ విజయాలను కూర్చే " రాజరాజేశ్వరీ దేవి " గా అభయమిచ్చినది.

దశర ఏడవరోజు ..శ్రీ దుర్గాదేవి అవతారం

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ
సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన
వేల్పుటమ్మల మనంబుల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ
కృపాబ్ధి యీచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదుల్


రోజున అమ్మవారి యొక్క "ఓం దుం దుర్గాయై నమః " అను మంత్రమును 108 సార్లు జపిస్తే మంచి ఫలితం లబిస్తుంది.


దశర ఆరవరోజు ...సరస్వతి అలంకారం



మాణిక్యవీణాం ముపాలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్రనీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాంమనసా స్మరామి
చతుర్భుజే చంద్రకలవతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః

నవరాత్రులలో చివరి మూడురోజులు అత్యంతప్రాముఖం సంతరించుకొన్నవి, శరన్నవరాత్రులలో సరస్వతీపూజ చేయడం సంప్రదాయం.
సరః అంటే శరణం / వ్యాప్తి చెందినది అని, భాషాసారస్వతాలు వ్యాప్తి చెందుతాయి, శబ్దం సర్వవ్యాపితమవుతూనే ఉంటుంది, అమ్మవారు శరత్కాలచంద్రుని వంటి ప్రకాశంతో గౌరవర్ణంతో ఒప్పారుతూ ఉంటుంది. " ఘంటాశూల హలాని, శంఖముసలే చక్రం, ధనుస్సాయకం హస్తాబ్జైర్ధతీం...." అని కూడా వర్ణించారు.
ఏ విద్య నెర్వాలన్నా, ఏ కళలోనైనా ప్రావీణ్యం సంపాదించాలన్నా, అమ్మవారి ఆశీస్సులు, అనుగ్రహం తప్పక ఉండాలి. వ్యక్తిని మంచి శక్తిగా మార్చగల మహత్తు "విద్య" కు మాత్రమే ఉన్నది. అట్టి విద్య కు అధిష్టాన దేవత, పరాశక్తి అంశ, సరస్వతిని ఈ రోజున స్మరించటం ఇహపరసాధనమైనది.