Thursday, December 25

ధనుర్మాసం


మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత ధనుర్లగ్నం నుండి ధనుర్మాసం ప్రారంభమై భోగి నాడు ముగుస్తుంది. పురాణ కాలం లో అంటే ద్వాపరయుగం లో బృందావనం నందు గోపికలు, శ్రీ కృష్ణుడినే పతి గా పొందాలని, కాత్యాయని దేవిని పూజిస్తూ, కాత్యాయని వ్రతం చేసేవారు. ఆ విధంగానే కలియుగం లో శ్రీరంగానికి 90కి.మీ దూరంలో ఉన్న శ్రీవల్లిపుట్టుర్ లో నివిసిస్తూ ఉన్న విష్ణుచిత్తుడనే వైష్ణవ భక్తుడు ఉండేవారు. అతని కుమార్తె పేరు ఆండాళ్
( గోదాదేవి), ఆమె కృష్ణుడికి గొప్ప భక్తురాలు. ఆ శ్రీ కృష్ణ భగవానుడినే పెళ్లాడ దలచినది. శ్రివల్లిపుట్టుర్ లో కృష్ణ మందిరానికి రోజు తండ్రి తో కలిసి ఆండాళ్ కూడా వెళ్లి దర్శనం చేసుకొనేది. వెళ్ళేటప్పుడు పూల మాలలను తనే స్వయంగా కట్టి, ముందుగా తను అలంకరించుకొని, తిరిగి స్వామికి సమర్పించేది. ఒకరోజు గుడిలోని పూజారి పూలమాలలోని వెంట్రుకను చూసి దాన్ని ముందుగా ఎవరో అలంకరించుకోన్నారని గ్రహించి, ఆగ్రహించి మాలను తిరస్కరించారు. గోదాదేవి సాధన ఆ విధంగా కొన్ని రోజులు జరిగాక. శ్రీ రంగనాయక ఆండల్ ను వివాహం చేసుకొన్నారు. తదుపరి ఆండల్ స్వామి వారిలో లీనం ఐనది.ఈ వృతాంతం అంత శ్రీకృష్ణ దేవరాయలు వ్రాసిన ఆముక్త మాల్యద లో వివరించబడినది.
శ్రిరంగానాయక, గోదాదేవి వివాహం భోగి రోజున జరిగింది కావున భోగి కల్యాణం అని వాడుకలోకి వచ్చింది.30
పాసురములతో(పాటలతో) కూడిన తిరుపావై ని గోదాదేవి రాసింది. ప్రతీరోజు ఒక పాటతో రంగానాయకుడిని సేవించేది.


THIRUPPAVAI
( click on this link, you can download Sri ChinnaJeyar Swamy, Thiruppavai Pravachanam audio in telugu, its really very nice )

3 వినదగు నెవ్వరు చెప్పిన..:

Anonymous said...

I wanted to Know do anyone have fala stuti of Lalitha sahasranamam
It is said that when we read Lalitha Sahasranamam we need to end with falaStuti

brakingnews said...

నమస్తే గాయత్రీ గారు మీ గురుగీత అనే బ్లాగ్ ప్రయత్నం చాల బాగుంది మరియు హర్షణీయం. నలుగురికి ఉపయోగపడే విషయాలు అందిస్తున్నందు ముమ్మల్ని అభినందిస్తున్నాను. మీ బ్లాగ్ నిర్వహణ ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మీతో మాట్లాడే అవకాశం ఇవ్వగలరు. నా మైయిల్ ఐడి ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి ఈ మెయిల్ చెయ్యగలరు. వేచిచుస్తుంటాను.
ధన్యవాదములతో.,

ఇట్లు
రాయప్రోలు మల్లికార్జున శర్మ,
అర్చక పురోహితులు, హైదరాబాద్.
mallikarjunasharma@gmail.com

గాయత్రి said...

chaala chaala dhanyavaadamulu...naku telsina peddalu cheppina koddhi vishayaalanu,blog roopamlo pondhuparustunnanu.....
na blog mee andhari aadharana podhutunanduku naku chaala santosham......thnks a lot...