Wednesday, August 4

నవగ్రహాలు

ఆదిత్యుడు :
కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకే ఆదిత్యుడు అని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రధం అతని వాహనం. సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ప్రతీకలు.
( మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆఙ్ఞ చక్రం , సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్య దోషం మొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యుని పూజించటం వలన ఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది. అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.

ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి


చంద్రుడు :
చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకు కంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటి గుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రి కి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అని పేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు, ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమ తల్లి తారక.

అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారు చంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.
కర్కాటక రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.

అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం


మంగళ :
అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం. ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకి అధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగ విద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.
భార్య / పిల్లలు / అన్నదమ్ముల వల్ల సమస్యలు ఉండేవారు, స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటం వలన సత్ఫలితాలను పొందుతారు.

అధిదేవత : భూదేవి
ప్రత్యదిదేవత : క్షేత్ర పాలకుడు
వర్ణం: ఎరుపు
ధాన్యం : కందులు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం

బుధుడు :
తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్ర దోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధుని పూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి, సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలో రానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి.
మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు - ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసలు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసలతో కూడిన అన్నం


గురు :
బృహస్పతి అని కూడా అంటాము.. దేవతలకు, దానవుల గురువైన శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణ సంపన్నుడు. పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.
పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకు గురువు ని పూజించాలి
ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడై ఉంటాడు.

అధిదేవత : బ్రహ్మ
ప్రత్యధిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : శెనగలు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం :
శెనగల తో కూడిన అన్నం

శుక్రుడు :
ఉషన, బృగు మహర్షి సంతానం. అసురులకు గురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణం తో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె / గుఱ్ఱము / మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.
అనుకోని పరిస్థితుల వల్లన కుటుంబాలు విడిపోవడం లేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారి మద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కర పరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయట పడే అవకాశం ఉంది.

వృషభ, తులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : బొబ్బర్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : బొబ్బర్లు తో కూడిన అన్నం


శని :
ఛాయా దేవి, సూర్యభగవానుడి పుత్రుడు శని. నల్లని వర్ణం తో, నలుపు వస్త్రధారణతో, కాకి వాహనంగా కలిగి ఉంటాడు.
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలాoటి బాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టి కష్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసి వెళ్తాడు.
కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.

అదిదేవత : యముడు
ప్రత్యధిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
పుష్పం : నల్లని తామర
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం


రాహువు :
సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడే రాహువు ను ఒక పాము రూపం లో వర్ణిస్తారు. ఒక కత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటి గుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.
పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవి రాహు ప్రభావములే.
పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.
అదిదేవత : దుర్గ
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం :
నలుపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం


కేతువు :
భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషం మొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.
ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.

అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.

12 వినదగు నెవ్వరు చెప్పిన..:

Megafan said...

chandrudu kumbha rasiki adhipati ani porapatuga vrasaru, chandrudu karkataka rasiki adhipati kada.

గాయత్రి said...

avunu megafan, meru cheppindi corect,thank u so much na mistake cheppinanduku, i will corect it now.
for reference : http://sakalapoojalu.com/NavagrahaluOPg.aspx?id=89

Sunil said...

Meeru ichina samaacharam chaala baagunthi kaani indulo Tamilnadu lo unna navagraha devaalayamula samaacharam jodiste inkaa baguntunthi.

oka devaalayam lo navagraha devatalu untaru kaani devaalayame navagrahaalalo okarithi ante visheshame kadaa.

Ref:http://kumbakonam-temples.com/navagraha-temples.php

గాయత్రి said...

thanks for the info. sunil

gopi said...

hai gayathri iam gopikrishna mee blog nenu ide first time chadavadam adi kuda maa frd dwara chusanu mee blog ni chala bagundi

గాయత్రి said...

dhanyavadamulu..

Anonymous said...

Chala manchi info icharu, thanks.
Oka chinna mistake undi info lo. Sani devuni ki Mother CHAAYA DEVI.

Sani devuni slokam lo kooda ade chepparu. Sani is the son of Sun and Chaaya.

"Neelanjana samabhasam ravi puthram yamagrajam,
Chaayamarthanda sambhootham tham namami sanyscharam".

Let me know if I am wrong.

గాయత్రి said...

అవునండి సూర్యదేవుని భార్య ఛాయాదేవి. నేను అదే ఉద్దేశ్యంతో రాసాను. కాని వ్యక్తీకరణ సరిగ రాలేదు. ఇప్పుడు సరిచేసాను. ధన్యవాదములు @ anonymous

Unknown said...

Gayatri garu dhanyamulanu kanudulu,pesalu ani maatrame vrayandi pappulu ani maatramu vrayaskandi. yendukante pappuku pranamundadu pranamu kevalamu ginjalone untumdi. gamanichagalaru.

D.V.R.
Date.29-08-2012.

గాయత్రి said...

కందులు, మినుములె సరైనవి. తప్పుని సవరించాను. ధన్యవాదములు D.V.R gaaru.

Unknown said...

Gayathri garu nijamuga meeru sahrudayulu. yendukante? meeru sreyobhilashula salahala loni vasthavalanu sweekarinchi velugu choopu chunnaru yentho santoshamu. Amma oka soochimpabadina amshame kaka vati anubandha amshalanu kooda pariganaloniki teesukonagalaru. dhanyamula vishayamulo Bruhaspati koraku veru shenagalu kadu MANCHI SHENAGALU ani, Shukruni vishayamulo Chikkudu ginjalaku badulu BOBBARALU ga marpu cheya galaru. Loka hithamu jarugalanna mee thapanaku abhinandanalu.

D.V.R

గాయత్రి said...

ధన్యవాదములు డి.వి.ఆర్ గారు.
తెలియక మరెక్కడైన పొరపాటులు దొర్లిఉంటే తెలియపరచగలరు.