Thursday, February 17

శ్రీ లలితా సహస్రనామం (ప్రతి పద అర్ధము) (131-161)

అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైత వర్జితా

అష్టమూర్తి: : 8రూపములు కలిగినది (పంచేంద్రియాలు, చిత్తము, బుద్ధి,అహంకారము)
అజా : పుట్టుకలేనిది
జైత్రీ : సర్వమును జయించినది
లోకయాత్రావిధాయినీ : లోకములను నియమించునది
ఏకాకినీ : ఏకస్వరూపిణీ
భూమరూపా : భూదేవిరూపము ధరించునది
నిర్ద్వైతా : అద్వైతము కలిగినది (రెందవది అనునది లేకుండుట)
ద్వైత వర్జితా : ద్వైతభావము లేనిది

అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మత్మైక్యస్వరూపిణీ
బృహతి బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా

అన్నదా : సర్వజీవులకు ఆహారము ఇచ్చునది
వసుదా : సంపదలిచ్చునది
వృద్ధా : ప్రాచీనమైనది
బ్రహ్మత్మైక్యస్వరుపినీ : ఆత్మ, పరమాత్మల ఐక్యస్వరూపిణి
బృహతీ : అన్నిటికన్న పెద్దది
బ్రాహ్మణీ : బ్రహ్మఙ్ఞాన స్వరూపిణీ
బ్రాహ్మీ : సరస్వతీ
బ్రహ్మానందా : బ్రహ్మానందస్వరూపిణీ
బలిప్రియా : బలి(త్యాగము) యందు ప్రీతి కలిగినది

భాషారూపా బృహత్సేనా భావాభావ వివర్జితా
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభా గతి:

భాషారూపా : సమస్తభాషలు తన రూపముగా కలిగినది
బృహత్సేనా : గొప్ప సైన్యము కలిగినది
భావాభావ వివర్జితా : భావము, అభావము రెండింటినీ లేనిది
సుఖారాధ్యా : సుఖులైనవారిచే(నిత్యతృప్తులు) ఆరాధింపబడునది
శుభంకరీ : శుభములను కలిగినది
శోభనా : వైభవములను కలిగినది
సులభాగతి: : తేలికగా చేరతగినది

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా
రాజత్కృపా రాజపీథ నివేశితనిజాశ్రితా

రాజరాజేశ్వరీ : ఈశ్వరుని హృదయేశ్వరీ
రాజ్యదాయినీ : రాజ్యములను ఇచ్చునది
రాజ్యవల్లభా : రాజ్యమునకు అధికారిణీ
రాజత్కృపా : అధికమైన కరుణ కలది
రాజపీఠనిశేవితనిజాశ్రితా : తనను ఆశ్రయించినవారిని సిం హాసనము పైన కూర్చొండపెట్టునది

రాజ్యలక్ష్మి: కోశనాధా చతురంగబలేశ్వరీ
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా

రాజ్యలక్ష్మి: : రాజ్యలక్ష్మీ రూపిణీ
కోశనాధా : కోశాగారముకు అధికారిణీ
చతురంగబలేశ్వరీ : చతురంగ బలాలకు (రధ,గజ,తురగ,పదాదులు) అధిపతి
సామ్రాజ్యదాయినీ : సామ్రాజ్యమును ఇచ్చునది
సత్యసంధా : సత్యస్వరూపిణి
సాగరమేఘలా : సముద్రములే వడ్డాణముగా కలిగినది

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ
సర్వార్ధదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ

దీక్షితా : భక్తులను రకించుట యెందు దీక్ష వహించినది
దైత్యశమనీ : రాక్షసులను సం హరించునది
సర్వలోకవశంకరీ : సమస్తలోకములను వశము చేసుకొనునది
సర్వార్ధదాత్రీ : కోరిన కోర్కెలన్నిటినీ తీర్చునది
సావిత్రీ : గాయత్రీ మాత
సచ్చిదానందరూపిణీ : సత్,చిత్, ఆనందములే రూపముగా కలిగినది

దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ

దేశకాలపరిచ్ఛిన్నా : దేశకాలములచే మార్పు చెందినది
సర్వగా : సర్వవ్యాపిని
సర్వమోహినీ : అందరిని మోహింప చేయునది
సరస్వతీ : విద్యాస్వరూపిణి
శాస్త్రమయీ : శాస్త్రస్వరూపిణి
గుహాంబా : కుమారస్వామి తల్లి
గుహ్యరూపిణి : రహస్యమైన రూపము కలిగినది

సర్వోపాధి వినిర్ముక్తా సదాశివపతివ్రతా
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ

సర్వోపాధివినిర్ముక్తా : ఏరకమైన శరీరము లేనిది
సదాశివపతివ్రతా : శివుని భార్య
సంప్రదాయేశ్వరీ : అన్ని సంప్రదాయములకు అధీశ్వరి
సాధ్వీ : సాధుస్వభావము కలిగినది
గురుమండలరూపిణీ : గురుప్రంపరాస్వరూపిణి

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా

కులోత్తీర్ణా : సుషుమ్నా మార్గమున పైకిపోవునది
భగారాధ్యా : త్రికోణ యంత్రమును ఆరాధింపబడునది
మాయా : మాయాస్వరూపిణీ
మధుమతీ : మధురమైన మనస్సు కలది (ఆనందస్వరూపిణీ)
గణాంబా : గణములకు తల్లి
కుహ్యకారాధ్యా : గుహ్యాదులచే ఆరాధింపబడునది
కోమలాంగీ : మృదువైన శరీరము కలిగినది
గురుప్రియా : గురువునకు ప్రియమైనది

స్వతంత్రా సర్వతంత్రేశే దక్షిణామూర్తి రూపిణీ
సనకాదిసమారాధ్యా శివఙ్ఞానప్రదాయినీ

స్వతంత్రా : తన ఇష్టప్రకారము ఉండునది
సర్వతంత్రేశీ : తాను ఉపదేసించిన తంత్రమునకు తానె దేవతైయున్నది
దక్షిణామూర్తిరూపిణీ : దక్షిణామూర్తి రూపము ధరించినది
సనకాది సమారాధ్యా : సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాత సనాతనులు అను దేవఋషులచే ఆరాధింపబడునది
శివఙ్ఞానప్రదాయినీ : ఆత్మఙ్ఞానమును ఇచ్చునది

చిత్కళానందకలికా ప్రేమరూపా ప్రియంకరీ
నామపారాయణాప్రీతా నందివిద్యా నటేశ్వరీ

చిత్కళానందకలికా : ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణీ
ప్రేమరూపా : ప్రేమమూర్తి
ప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునది
నామపారాయణప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినది
నందివిద్యా : అమ్మవారికి సంబందించిన ఓక మంత్ర విశెషము
నటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి

మిధ్యాజగదధిష్తాన ముక్తిదా ముక్తిరూపిణీ
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా

మిధ్యాజగదధిష్టానా : మాయాజగత్తునందు చైతన్యరూపిణియై యుండునది
ముక్తిదా : విముక్తి నిచ్చునది
ముక్తిరూపిణీ : మోక్షరూపిణీ
లాస్యప్రియా : లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది
లయకరీ : జగత్తును లయము చేయునది
లజ్జా : లజ్జాస్వరూపిణీ
రంభాదివందితా : రంభ మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకొనునది

భవదావసుధావృష్టి: పాపారణ్యదవానలా
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా

భవదావసుధావృష్టి: : జన్మపరంపరలు అను దావాగ్నిని చల్లార్చుటకు అమృతవర్షము వంటిది
పాపారణ్యదవానలా : పాపములు అనెడి అరణ్యమునకు కార్చిచ్చు వంటిది
దౌర్భాగ్యతూలవాతూలా : దారిద్ర్యము, దురదృష్టము అనెడి పక్షి ఈకలకు హోరుగాలి వంటిది
జరాధ్వాంతరవిప్రభా : ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది

భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా
రోగపర్వతదంభొళి ర్మృత్యుదారుకుఠారికా

భాగ్యాబ్ధిచంద్రికా : సంపద అనెడి సముద్రమునకు వెన్నెల వంటిది
భక్తచిత్తకేకిఘనాఘనా : భక్తుల మనస్సులు అనే నెమళ్ళకు వర్షాకాలపు మేఘము వంటిది
రోగపర్వతదంభొళి : పర్వతములవంతి రోగములకు వజ్రాయుధము వంటిది
ర్మృత్యుదారుకుఠారికా : మృత్యువనెడి వృక్షమునకు గొడ్డలి వంటిది

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా
అపర్ణా చండికా చండముండాసురనిషూదిని

మహేశ్వరీ : మహేశ్వరుని ప్రియురాలు
మహాకాళీ : కాళికాదేవిరూపము దాల్చినది
మహాగ్రాసా : అధికమైన ఆహారమును కోరునది
మహాశనా : లయకారిణి
అపర్ణా : పార్వతీ దేవి
చండికా : చండికాస్వరూపిణి
చండముండాసురనిషూదిని : చండుడు, ముండుడు అను రాక్షసులను సమ్హరించినది

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా

క్షరాక్షరాత్మికా : నశించునట్టి జగత్తు, శాశ్వతమైన చిన్మయ తత్వము రెండూను తానె రూపంగా ఐనది
సర్వలోకేశీ : అన్ని లొకములకు అధీశ్వరి
విశ్వధారిణీ : విశ్వమును ధరించినది
త్రివర్గదాత్రీ ; దర్మ, అర్ధ, కామములను ఇచ్చునది
సుభగా : సౌభాగ్యవతి
త్ర్యంబకా : మూడు కన్నులు కలది
త్రిగుణాత్మికా : సత్వ, రజో, తమో గుణములను ఇచ్చునది

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్ప నిభాకృతి:
ఓజోవతీ ద్యుతిధరా యఙ్ఞరూపా ప్రియవ్రతా

స్వర్గాపవర్గదా : స్వర్గమును, మోక్షమును కూడా ఇచ్చునది
శుద్ధా : పరిశుద్ధమైనది
జపాపుష్ప నిభాకృతి: : జపాపుష్పములవలె ఎర్రని ఆక్ర్తి కలది
ఓజోవతీ : తేజస్సు కలిగినది
ద్యుతిధరా : కాంతిని ధరించినది
యఙ్ఞరూపా : యఙ్ఞము రూపముగా కలిగినది
ప్రియవ్రతా : ప్రియమే వ్రతముగా కలిగినది

దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా

దురారాధ్యా ; కష్ట సాధ్యమైన ఆరాధన కలిగినది
దురాధర్షా : చుచూటకు కష్ట సాధ్యమైనది
పాటలీకుసుమప్రియా : పాటలీపుష్పమునందు ప్రీతి కలిగినది
మహతీ : గొప్పదైనది
మేరునిలయా : మేరుపర్వతము నివాసముగా కలిగినది
మందారకుసుమప్రియా : మందారపువ్వులు అంటే ప్రీతి కలిగినది

వీరారాధ్యా విరాద్రూపా విరజా విశ్వతోముఖీ
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రణదా ప్రాణరూపిణీ

వీరారాధ్యా : వీరులచే ఆరాధింపబదునది
విరాద్రూపా : అన్నింతికీ మూలమైనది
విరజా : రజోగుణము లేనిది
విశ్వతోముఖీ : విశ్వం అంతటినీ ఒకేసారి చూడగల్గిన ముఖము కలిగినది
ప్రత్యగ్రూపా : నిరుపమానమైన రూపము కలిగినది
పరాకాశా : భావనామాత్రమైన ఆకాశ స్వరూపిణి
ప్రణదా : సర్వజగత్తుకూ ప్రాణము ను ఇచ్చునది
ప్రాణరూపిణీ : జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్య స్తరాజ్యధూ:
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా

మార్తాండభైరవారాధ్యా : మార్తాండభైరవునిచే ఆరాధింపబడునది (శివుని యొక్క ఒకరూపం మార్తాండభైరవుడు)
మంత్రిణీ : శ్యామలాదేవి
న్య స్తరాజ్యధూ: రాజ్యాధికారము ఇచ్చునది
త్రిపురేశీ ; త్రిపురములకు అధికారిణి
జయత్సేనా : అందరినీ జయించగల సైన్యము కలది
నిస్త్రైగుణ్యా : త్రిగుణాతీతురాలు
పరాపరా : ఇహము, పరము రెండునూ తానై యున్నది

సత్యఙ్ఞానానందరూపా సామరస్యాపరాయణా
కపర్ధినీ కళామాలా కామధుక్ కామరూపిణీ

సత్యఙ్ఞానానందరూపా : సచ్చిదానందరూపిణీ
సామరస్యాపరాయణా : జీవుల యెడల సమరస భావముతో ఉండునది
కపర్ధినీ : జటాజూటము కలిగినది (జటాజూటధారీఇన శివునకు కపర్ధి అను పేరు కలదు)
కళామాలా : కళల యొక్క సమూహము
కామధుక్ : కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది
కామరూపిణీ : కోరిన రూపము ధరించునది

కళానిధి: కావ్యకళా రసఙ్ఞా రసశేవధి:
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా
కళానిధి: : కళలకు నిధి వంటిది
కావ్యకళా : కవితారూపిణి
రసఙ్ఞా : సృష్టి యందలి సారము తెలిసినది
రసశేవధి: : రసమునకు పరాకాష్ట
పుష్టా : పుష్ఠి కలిగించునది
పురాతనా ; అనాదిగా ఉన్నది
పూజ్యా ; పూజింపదగినది
పుష్కరా : పుష్కరరూపిణి
పుష్కరేక్షణా ; విశాలమైన కన్నులు కలది

పరంజ్యోతి: పరంధామ పరమాణు: పరాత్పరా
పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదినీ

పరంజ్యోతి: : దివ్యమైన వెలుగు
పరంధామ : శాశ్వతమైన స్థానము కలిగినది
పరమాణు: : అత్యంత సూక్ష్మమైనది
పరాత్పరా : సమస్తలోకములకు పైన ఉండునది
పాశహస్తా : పాశమును హస్తమున ధరించినది
పాశహంత్రీ : జీవులను సంసార బంధము నుంది విడిపించునది
పరమంత్ర విభేదినీ : శత్రువుల మంత్రప్రయోగములను పటాపంచలు చేయునది

మూర్తామూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ

మూర్తామూర్తా : రూపం కలది, రూపం లేనిది రెందూ తానే ఐనది
నిత్యతృప్తా : ఎల్లప్పుదు తృప్తితో ఉండునది
మునిమానసహంసికా : మునుల మనస్సులనెడి సరస్సులందు విహరించెడి హంసరూపిణి
సత్యవ్రతా : సత్యమే వ్రతముగా కలిగినది
సత్యరూపా : సత్యమే రూపముగా కలిగినది
సర్వాంతర్యామినీ : సృష్టీ అంతటా వ్యాపించినది
సతీ : దక్షప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి ఐన సతీదేవి

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా
ప్రసవిత్రీ ప్రచండాఙ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి:

బ్రహ్మాణీ : సరస్వతీ దేవి (బ్రహ్మదేవుని భార్య)
బ్రహ్మజననీ : బ్రహ్మడేవుడిని సృస్టించినది
బహురూపా : సమస్త రూపములు తానై ఉన్నది
బుధార్చితా : ఙ్ఞానులచే పూజింపబదునది
ప్రసవిత్రీ : జగజ్జనని
ప్రచండాఙ్ఞా : తీవ్రమైన ఆఙ్ఞ కలది
ప్రతిష్టా : కీర్తియే రూపముగా కలిగినది
ప్రకటాకృతి: : బహిరంగమైన ఆకారము కలిగినది

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూ:

ప్రాణేశ్వరీ : ప్రాణములకు అధీశ్వరి
ప్రాణదాత్రీ : ప్రాణములు ఇచ్చునది
పంచాశత్పీఠరూపిణీ : శక్తిపీఠముల రూపమున వెలసినది
విశృంఖలా : యధేచ్ఛగా ఉండునది
వివిక్తస్థా : ఏకాంతముగా ఉండునది
వీరమాతా : వీరులకు తల్లి
వియత్ప్రసూ: : ఆకాశమును సృష్టించినది

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ
భావఙ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ

ముకుందా : విష్ణు రూపిణీ
ముక్తినిలయా : ముక్తికి స్థానమైనది
మూలవిగ్రహరూపిణీ : అన్నింటికీ మూలమైనది
భావఙ్ఞా : సర్వజీవుల మానసిక భావములను తెల్సినది
భవరోగఘ్నీ : జన్మపరంపర అను రోగమును పోగొట్టునది
భవచక్రప్రవర్తినీ : లోకచక్రమును నదిపించునడి

ఛంద:సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ
ఉదారకీర్తి రుద్దమవైభవా వర్ణరూపిణీ

ఛంద:సారా : వేదముల సారము
శాస్త్రసారా : వేదాంతాది సమస్త శాస్త్రముల సారము
మంత్రసారా : మంత్రముల యొక్క సారము
తలోదరీ : పలుచని ఉదరము కలిగినది
ఉదారకీర్తి : గొప్ప కీర్తి కలిగినది
రుద్దమవైభవా : అధికమైన వైభవము కలిగినది
వర్ణరూపిణీ : అక్షరరూపిణి

జన్మమృత్యుజరాతప్త జన విశ్రాంతిదాయినీ
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా

జన్మమృత్యుజరాతప్త : చావు, పుట్టుకలు, ముసలితనము మొదలైన వాటితో బాధపడు
జన : జనులు
విశ్రాంతిదాయినీ : విశ్రాంతి ని ఇచ్చునది
సర్వోపనిషదుద్ఘుష్టా : అన్ని ఉపనిషత్తులచే చాటిచెప్పబడినది
శాంత్యతీతకళాత్మికా : శాంతికంటే అతీతమైన చిదానందస్వరూపిణి (సంకల్ప, వికల్ప, రాగద్వేషములు లేని మానసిక స్థితి "శాంతి", ఆనందము దానిని మించినది)

గంభీరా గగనాంతస్తా గర్వితా గానలోలుపా
కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధ విగ్రహ

గంభీరా : లోతైనది (అమ్మణ్ణి తత్వము తెల్సుకొనుట కష్టము)
గగనాంతస్తా : ఆకాశమునందు ఉండునది
గర్వితా : గర్వము కలిగినది
గానలోలుపా : సంగీతమునందు ప్రీతి కలిగినది
కల్పనారహితా : ఎట్టి కల్పన లేనిది
కాష్ఠా : కాలపరిగణన లో అత్యంత స్వల్పభాగము (రెప్పపాటుకన్న తక్కువ సమయం)
కాంతా : కాంతి కలిగినది
కాంతార్ధ విగ్రహ ; కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము

0 వినదగు నెవ్వరు చెప్పిన..: