Tuesday, February 8

శ్రీ లలితా సహస్రనామం ( ప్రతిపద అర్ధం)(71-90)

71. రాజరాజార్చితా రాజ్గ్యీ రమ్యా రాజీవలోచనా
రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా


రాజరాజార్చితా : చక్రవర్తుల చే పూజింపబడునది
రాజ్గ్యీ : మహారాణి
రమ్యా : అందమైన రూపం కలది
రాజీవలోచనా : తామరపూరేకుల వంటి కనులు కలది
రమణీ : అందమైన రూపం కలది
రస్యా : రస స్వరూపురాలు
రణత్కింకిణి మేఖలా : గల గల శబ్దము చేయు గజ్జెలతో కూడిని ఒడ్డాణము కలది


72. రమా రాకేందువదనా రతిరూపా
రతిప్రియా రక్షాకరీ రాక్షసజ్గ్య రామా రమణలంపట


రమా : లక్ష్మీ ప్రదమైనది
రాకేందువదనా : పున్నమి చందమామ వంటి ముఖము కలది
రతిరూపా : రతీదేవి రూపం కలది
రతిప్రియా : ఆనందమే ప్రియముగా కలిడినది
రక్షాకరీ : రక్షించునది
రాక్షసజ్గ్య : రాక్షసులను సంహరించునది
రామా : రాముని రూపం కలది
రమణలంపట : ఆనందము కలిగించుట యందు ఆసక్తి కలిగినది

73.కామ్యా కామకళారూపా కదంబ కుసుమ ప్రియా
కళ్యాణీ జగతీకంద కరుణారససాగరా


కామ్యా : కోరదగినది
కామకళారూపా : కామ కళా అను బీజాక్షర స్వరూపిణి
కదంబ కుసుమ ప్రియా : కదిమిపూల ను ఇష్టపడేది
కళ్యాణీ : కళ్యాణ గుణములు కలది
జగతీకంద : జగత్తునకు మూలకారణము
కరుణారససాగరా : కరుణారస సాగరము వంటిది
.


74. కళావతీ కలాలాపా కాంతా కాదంబరీ ప్రియా
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా


కళావతీ : సమస్త కళలకు నిలయమైనది
కలాలాపా : కళాత్మక వాక్కు కలిగినది
కాంతా : ప్రియమనినది
కాదంబరీ ప్రియా : కడిమి చెట్లను ప్రీతిగా కలిగినది
వరదా : వరములు ఇచ్చునది
వామనయనా : అందమైన కనులు కలది
వారుణీమదవిహ్వలా : ఉపనిషత్తు లో "వారుణీ" అను పేరుగల ఋషి కుమారునకు కలిగిన ఆనందతన్మయత్వమేస్వరూపంగా కలిగినది


75.విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాశినీ
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ


విశ్వాధికా : విశ్వమునకు అతీతమైనది
వేదవేద్యా : వేదములచేత తెలుసుకొనబడునది
వింధ్యాచల నివాశినీ : వింధ్యాపర్వతములలో వింధ్యవాసినిగా వెలసినది
విధాత్రీ : సృష్టి కర్త్రి
వేదజననీ : వేదములకు మాత (గాయత్రీ మాత)విష్ణుమాయా : విష్ణుమాయ అనగా యోగమాయ
విలాసినీ : విలాసము కలిగినది


76. క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్ర క్షేత్రజ్గ్య పాలినీ
క్షయవృద్ధి వినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా
క్షేత్రస్వరూపా : జీవుల దేహములు అన్నియు తానై ఉన్నది
క్షేత్రేశీ : జీవాత్మ స్వరూపిణి
క్షేత్రజ్గ్య పాలినీ : దేహమును, దేహిని పాలించునది
క్షయవృద్ధి వినిర్ముక్తా : ఎదుగుబొదుగు లేనిది
క్షేత్రపాలసమర్చితా : జీవులచే ఆరాధింపబడుచున్నది
.


77. విజయా విమలా న్ద్యా వందారు జన వత్సలా
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండల వాసిని


విజయా : సమస్తమును జయించునది
విమలా : పరిశుద్దమైనది
న్ద్యా : నమస్కరింపదగినది
వందారు జన వత్సలా : తనకు నమస్కరించు జనులయందు వాత్సల్యము కలిగినది
వాగ్వాదినీ : వాక్స్వరూపిణి
వామకేశీ : అందమైన కురులు కలిగినది
వహ్నిమండల వాసిని : అగ్ని నుండి పుట్టినది
.


78. భక్తిమత్కలతికా పశుపాశ విమోచినీ
సంహృతాశేషపాషణ్డా సదాచారప్రవర్తికా

భక్తిమత్కలతికా : భక్తుల కోర్కెలు తీర్చు కల్పవృక్షం
పశుపాశ విమోచినీ : ఐహిక బంధములను తొలగించునది
సంహృతాశేషపాషణ్డా : నాస్తిక భావములను తొలగించునది
సదాచారప్రవర్తికా : మంచి ఆచారములను అనుసరించునది


79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా


తాపత్రయాగ్ని సంతప్త : తాపత్రయములు అను అగ్ని చే తపించుచ్చున్న జనులుకు
సమాహ్లాదన చంద్రికా : ఆనందమను వెన్నెల వంటిది
తరుణీ : నిత్య యవ్వని
తాపసారాధ్యా : ఋషులచే రాదించబడునది
తనుమధ్యా : సన్నని నడుము కలిగినది
తమోపహా : అజ్గ్యానము అనే చీకటిని తొలగించునది


80. చితి తత్పద లక్ష్యార్దా చిదేక రసరూపిణి
స్వాత్మానందలవీ భూత బ్రహ్మాద్యానంద సంతతి

చితి: : జ్గ్యానస్వరూపిణి
తత్పద లక్ష్యార్దా : పరబ్రహ్మ స్వరూపిణి
చిదేక రసరూపిణి : చైతన్య స్వరూపిణి
స్వాత్మానందలవీ భూత బ్రహ్మాద్యానంద సంతతి : బ్రహ్మానందమును మించిన పరామానంద స్వరూపిణి


81. పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవత
మాధ్యమా వైఖరీ రూపా భక్త మానస హంసికా

పరా : పరమాత్మ స్వరూపిణి
ప్రత్యక్చితీరూపా : ఉద్భవించుటకు జరుగు పరిణామక్రమము అంతయు తానై యున్నది
పశ్యంతీ : కంటికి కనపడునది
పరదేవత : పరాశక్తి
మాధ్యమా : వాక్కు యొక్క మధ్యమరూపము
వైఖరీ రూపా : వాక్కు యొక్క బహిర్గత రూపం
భక్త మానస హంసికా : భక్తుల మనసు అనేది మానస సరోవరమునకు హంస వంటిది


82. కామేశ్వర ప్రాణనాడి కృతజ్గ్యా కామపూజితా
శృంగార రససంపూర్ణ జయా జాలంధరస్థితా

కామేశ్వర ప్రాణనాడి : కామేశ్వరుని ప్రాణ నాడి
కృతజ్గ్యా : జీవుల కర్మలనెరిగినది
కామపూజితా : కోర్కెలు కల వారి చే పూజిపబడునది
శృంగార రససంపూర్ణ : శృంగార రస సంపూర్ణ
జయా : జయమును కలిగినది
జాలంధరస్థితా : జాలంధర యోగముద్ర ముందు ఉండునది


83. ఓఢ్యాణ పీనిలయా బిందుమండలవాసినీ
రహొయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా

ఓఢ్యాణ పీనిలయా : మూలాధారమున ఉండునది
బిందుమండలవాసినీ : శ్రీచక్రమున మద్య ఉన్న బిందువునందు నివసించునది
రహొయాగక్రమారాధ్యా : అంతర్యాగమున మానసిక విధానముచే ఆరాధింపబడుచున్నది
రహస్తర్పణతర్పితా : మానసిక పూజా విధానమున చేయబడు తర్పణములచే తృప్తి చెందునది


84. సద్యః ప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా
షడంగదేవతా యుక్తా షాడ్గుణ్యపరిపూరితా

సద్యః ప్రసాదినీ : వెంటనే వారములు ప్రసాదించునది
విశ్వసాక్షిణీ : ప్రపంచ సృష్టి, స్థితి, లయలకు సాక్షిగా ఉండునది
సాక్షివర్జితా : సాక్షిగా ఉండునది
షడంగదేవతా యుక్తా : ఆరుగురు అంగదేవతలతో కూడియుండునది
షాడ్గుణ్యపరిపూరితా : సర్వగ్నత్వము మొదలగు ఆరు దివ్య గుణములతో నిండినది


85. నిత్యక్లిన్నానిరుపమా నిర్వాణసుఖదాయినీ
నిత్యా షోడ శికారూపా శ్రీ కంఠార్ధ శరీరిణీ

నిత్యక్లిన్నా : ఎల్లప్పుడు కరుణ తో ఉండునది
నిరుపమా : సాటిలేనిది
నిర్వాణసుఖదాయినీ : మోక్షము ఇచ్చునది
నిత్యా షోడ శికారూపా : షోడసీ (పదహారు సంవత్సరాల వయస్సు కలది )

శ్రీ కంఠార్ధ శరీరిణీ : శ్రీకంఠుడైన ఈశ్వరుని అర్ధాంగి

86. ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ
మూలప్రకృతిరవ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణి

ప్రభావతీ : ప్రకాశము కలిగినది
ప్రభారూపా : ప్రకాశమే రూపంగా కలిగినది
ప్రసిద్ధా : ప్రసిద్ధురాలు
పరమేశ్వరీ : సమస్తమునకు అధికారినీ
మూలప్రకృతి : ప్రకృతికి (సృష్టి) కి మూలమైనది
వ్యక్తా : వ్యక్తము కానిది ( నిర్గుణ, నిరాకార స్వరూపము)వ్యక్తావ్యక్త స్వరూపిణి : సృష్టికి పూర్వము తెలియబడకుండా ఉండునది


87. వ్యాపినీ వివిధాకార విద్యా విద్యా స్వరూపిణీ
మహాకామేశనయన కుముదాహ్లాద కౌముదీ

వ్యాపినీ : సృష్టి అంతయు వ్యాపించి యున్నది
వివిధాకార : అనేక ఆకారములు కలిగినది
విద్యా అవిద్యా స్వరూపిణీ : జ్గ్యానము, జ్గ్యానము రెండు తానై ఉన్నది
మహాకామేశ : కామేశుడు
నయన : కనులు
కుముద : కలువ
ఆహ్లాద కౌముదీ : ఆహ్లాదమును కలిగించే వెన్నెల వంటివి


88. భక్తహార్ద తమోభేద భానుమద్బాను సంతతి:
శివదూతీ శివారాధ్యా శివమూర్తి శివంకరీ

భక్తహార్ద తమోభేద : భక్తుల హృదయమందలి అజ్గ్యానము చీకటి
భానుమద్బాను సంతతి: : ప్రకాశవంతమైన సూర్యకాంతి
శివదూతీ : శుభములను తెచ్చునది
శివారాధ్యా : శివునిచే ఆరాధింపబడునది
శివంకరీ : శుభములను కలిగించునది
శివమూర్తి: : శివుని రూపం కలది

89. శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా
ప్రమేయ స్వప్రకాశా మనోవాచామగోచరా

శివప్రియా : శివునకు ప్రియమైనది
శివపరా : శివుని యందే మనస్సు లగ్నమైనది
శిష్టేష్టా : సజ్జనుల యందు ప్రీతీ కలిగినది
శిష్టపూజితా : సజ్జనులచే పూజింపబడునది
ప్రమేయ : ప్రమేయము లేనిది
స్వప్రకాశా : స్వప్రకాశము కలిగినది
మనోవాచామగోచరా : మనస్సుకు, వాక్కునకు అందనిది

90. చిచ్చక్తి చేతనారూపా జడశక్తి: జడాత్మికా
గాయత్రీ వ్యాహృతి:సంధ్యా ద్విజబృందనిషేవితా


చిచ్చక్తి : జ్గ్యాన శక్తి
చేతనారూపా : చైతన్యరూపిణీ
జడశక్తి: : జడ పదార్ధములందు ఉండు శక్తి ప్రాణములే
జడాత్మికా : జడపదార్ధము కూడా తానై యున్నది
గాయత్రీ : గాయత్ర్హి మాత
వ్యాహృతి: : గాయత్రి మంత్రమునకు ముందుగల బీజాక్షరములు ( ఓం, భూ:, సః, అనునవి వ్యాహృతులు )సంధ్యా : సంధ్యా సమయం
ద్విజబృందనిషేవితా : బ్రాహ్మణులచే గాయత్రీ రూపమున ఉపాసించబడునది

0 వినదగు నెవ్వరు చెప్పిన..: