Thursday, February 17

శ్రీ లలితా సహస్రనామం ( ప్రతిపద అర్ధం) (91-130)

తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్ఠితా
నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ

తత్త్వాసనా : తత్వమే అసనంగా కలిగినది
తత్
: పరమాత్మ
త్వం : జీవాత్మ
యీ : ఐక్యత
పంచాకోశాంతరస్థితా : పంచకోశములు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విఙ్ఞాన మయ, ఆనందమయ ) లో ఉండునది
నిస్సీమమహిమా : హద్దులు లేని మహిమ కలిగినది
నిత్యయౌవనా : ఎల్లప్పుడు తరుణ వయస్సులో ఉండునది
మదశాలినీ : ఆనంద తన్మయత్వమున ఉండునది

మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూ:
చందనద్రవదిగ్దాంగీ చాంపేయకుసుమప్రియా

మదఘూర్ణిత రక్తాక్షీ : యోగసమాధి వలన ఎర్రనైన కన్నులు కలిగినది
మదపాటలగండభూ: : యోగసమాధి వలన ఎర్రనైన చెక్కిళ్ళు కలది
చందనద్రవదిగ్ధాంగి : చందన తైలము పూయబడిన శరీరము కలది
చాంపేయకుసుమ ప్రియా : సంపెంగ పూలయందు ఇష్టము కలది

కుశలాకోమలాకారా కురుకుళ్ళా కుళేశ్వరీ
కుళకుండలయా కౌళమార్గతత్పరసేవితా

కుశలా : నేర్పు కలది
కోమలాకారా : మృదువైన రూపము కలిగినది
కురుకుళ్ళా : సుషుమ్నా మార్గమున విహరించు కుండలినీ శక్తి
కుళేశ్వరీ : కుండలినీ శక్తీ
కుళకుండాలయా : మూలాధారము నివాసంగా కలిగినది
కౌళమార్గతత్పరసేవితా : కౌళమార్గ తత్పరులచే సేవించబడినది
(కౌళమార్గము, సమయమార్గము అను రెండు పూజా విధములు కలవు)

కుమారగణనాధాంబా తుష్టి: పుష్టి ర్మతి ర్ద్ధృతి:
శాంతి: స్వస్తిమతీ కాంతి ర్నందినీ విఘ్ననాశినీ

కుమారగణనాధాంబా : కుమారస్వామి, గణపతుల యొక్క తల్లి
తుష్టి: : తృప్తి
పుష్టి: : శక్తి
మతి: : బుద్ధి
ధృతి: : ధైర్యము
శాంతి: : మనశ్శాంతి
స్వస్తిమతీ : నిర్వికల్పమైన మనస్సు
కాంతి: : వెలుగు
నందినీ : ఆనందపరచునది
విఘ్ననాశినీ : విఘ్నము లేకుండా చేయునది

తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ

తేజోవతీ : తేజస్సు కలిగినది
త్రినయనా : మూడు కన్నులు కలది
లోలాక్షీకామరూపిణీ : కదులుచున్న కన్నులతో కోరిన రూపం ధరించకలిగినది
మాలినీ : పుష్పమాలికలను ధరించునది
హంసినీ : జీవుల ఉచ్చ్వాస నిశ్వాసాల రూపిణి
మాతా : సర్వోకములకు తల్లిమలయాచల నివాసినీ : మలయ పర్వతములను నివాసంగా చేసుకొన్నది

సుముఖీ నళినీ సుభ్రూ: శోభనా సురనాయికా
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ

సుముఖీ : మంచి ముఖము కలది
నళినీ : పద్మమునందు నివసించునది
సుభ్రు: : అందమైన కనుబొమ్మలు కలది
శోభనా : వైభవము కలిగినది
సురనాయికా : దేవతలకు అధీశ్వరి
కాలకంఠీ : కాలమును కంఠము ధరించునది
కాంతిమతీ : కాంతి కలిగినది
క్షోభిణీ : కష్టములు కలుగచేయునది (రాక్షసులను బాధించునది)
సూక్ష్మ రూపిణీ : సూక్ష్మరూపం కలది

వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్ఠా వివర్జితా
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ

వజ్రేశ్వరీ : వజ్రాయుధమును ధరించినది
వామదేవి : వామదేవుని శక్తి
వయోవస్థా వివర్జితా : వయసుచే కలుగు మార్పులు లేనిది (నిత్యయవ్వనవతి)
సిద్దేశ్వరీ : సిద్దులచే ఆరాదింపబడునది
సిద్ధమాతా : సిద్ధులకు తల్లివంటిది
యశస్వినీ : కీర్తి కలిగినది.

విశుద్ధిచక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనా
ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా

విశుద్ధచక్ర నిలయా : విశుద్ధ చక్రమున నివసించునది
రక్తవర్ణ : ఎర్రని రంగు కలది
త్రిలోచనా : మూడు కన్నులు కలది ( ఈశ్వరీ)
ఖట్వాంగాది ప్రహరణా : ఖట్వాంగము మొదలైన ఆయుధములు ధరించినది
వదనైక సమన్వితా : ఒకే ముఖము కలిగినది

పాయసాన్నప్రియా త్వక్ స్థా పశులోకభయంకరీ
అమృతాదిమహాశక్తి సంవృతా డాకినీశ్వరీ

పాయస్సన్నప్రియా : పాయసము (పరమాన్నము) అంటే ఇష్టం కలిగినది
త్వక్ స్థా : చర్మము నందు ఉండునది
పశులోక భయంకరీ : పశులోకమునకు (అజ్గ్యానులకు ) భయమును కలిగించునది
అమృతాదిమహాశక్తి సంవృతా : అమృతము మొదలగు శక్తి గుణములచే కూడియున్నది
డాకినీశ్వరీ : విశుద్ధ చక్రముకు అధిదేవత "డాకినీ" దేవత

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా
దం ష్ట్రోజ్జ్వలా క్షమాలాదిధరా రుధిర సంస్థితా

అనాహతాబ్జనిలయా : అనాహత చక్రము నందు ఉండునది
శ్యామాభా : చామనఛాయ కాంతి కలది
వదనద్వయ : రెండు ముఖములు కలది
దంష్ట్రోజ్జ్వలా : కాంతి కలిగిన దంతములు (కోరలు) కలది
అక్షమాలాదిధారా : జపమాల ధరించినది
రుధిరసంస్థితా : రక్తము స్థానముగా కలిగినది

కాలరాత్రాది శక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్రవరా రాకిన్యాంబస్వరూపిణీ

కాళరాత్ర్యాది శక్త్యౌ ఘవృతా : కాళరాత్రి మొదలైన శక్తుల సమూహముచే పరివేష్టింపబడునది
స్నిగ్దౌదనప్రియా : నేతి అన్నం అంటే ఇష్టపడేది
మహావీరేంద్రవరదా : మహావీరులకు వరములు ఇచ్చునది
రాకిన్యంబాస్వరూపిణీ : రాకిని అమ్మణ్ణి స్వరూపం కలిగినది

మణిపూరాబ్జనిలయా వదనత్రయసమ్యుతా
వజ్రాదికాయుధొపేతా డామర్యాదిభిరావృతా

మణిపూరాబ్జ నిలయా : మణిపూరక చక్రం (నాభి స్థానం) నందు నివసించునది
వదనత్రయ సంయుతా : మూడు ముఖములు కలది
వజ్రాదికాయుదోపేతా : వజ్రము మొదలగు ఆయుధములు ధరించినది
డార్యాదిభిరావృతా : డామరి మొదలగు శక్తులచే పరివేష్టించబడినది

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా
సమస్తభక్త సుఖదా లాకిన్యాంబస్వరూపిణీ

రక్తవర్ణా : ఎర్రనిరంగు కలిగినది
మాంసనిష్ఠా : మాసమునందు ఉండునది
గూడాన్నప్రీతమానసా : చక్కెరపొంగలి ఇష్టముగా కలిగినది
సమస్తభక్తసుఖదా : భక్తులకు సమస్త సుఖములను ఇచ్చునది
లాకిన్యాంబస్వరూపిణీ : లాకిన్యాంబస్వరూపము కలిగినది

స్వాధిష్టానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాతిగర్వితా

స్వాదిష్ఠానంబుజగతా : స్వాధిష్టా పద్మమున ఉండునది
చతుర్వక్త్ర మనోహరా : అందమైన నాలుగు ముఖములు కలది
శూలాద్యాయుధ సంపన్న : త్రిశూలము మొదలగు ఆయుధములు కలిగినది
పీతవర్ణా : పసుపుపచ్చని రంగు
అతిగర్వితా : గర్వము (ఠీవి) ఎక్కువగా కలది

మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా
దధ్యన్నసక్తహృదయా కాకినీరూపధారిణీ

మేధోనిష్ఠా : నిష్టపరాయణురాలు
మధుప్రీతా : తేనె ని ఇష్టపడేది
బందిన్యాదిసమన్వితా : "బందిని" మొదలగు శక్తులచే కూడియున్నది
దధ్యన్నా సక్త హృదయా : పెరుగన్నం(దద్దోజనం) అన్న ఇష్టముగా ఉండునది
కాకినీ రూపధారిణీ : కాకినీ రూపం ధరించినది

మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థిసంస్థితా
అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా

మూలాధారాంబుజారూఢా : మూలాధార చక్రమునండు స్థిరముగా ఉండునది
పంచవక్త్రా : ఐదు ముఖములు కలిగినది
అస్థిసంస్థితా : ఎముకల యందు ఉండునది
అంకుశాదిప్రహరణా : అంకుశము మొదలగు ఆయుధములను ధరించునది
వరదాదినిషేవితా : వరద మొదలగు శక్తుల చే సేవించబడునది

ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యాంబస్వరూపిణీ
ఆఙ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా

ముద్గౌదనాసక్త చిత్తా : పెసరపప్పు పులగం మొదలైన వాటి యందు ఇష్టము కలిగినది
సాకిన్యాంబస్వరూపిణీ : శాకిని అమ్మణ్ణి రూపం ధరించినది
ఆజ్గ్యాచక్రాబ్జ నిలయా : భ్రూమధ్యమున కల ఆజ్గ్యా చక్రమున నివసించునది
శుక్లవర్ణా : తెల్లని రంగు కలిగినది
షడాననా : ఆరు ముఖమూ కలిగినది

మజ్జసంస్ఠా హంసవతీ ముఖ్యశక్తిసమన్వితా
హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ

మజ్జాసంస్థా : ఎముకలలోని మూలుగు నందు ఉండునది
హంసవతీముఖ్యశక్తి సమన్వితా : హంసవతి మొదలగు శక్తులతో కూడినది
హరిద్రాన్నైక రసికా : పులిహోర అనిన ఇష్టము కలిగినది
హాకినీరూపదారిణీ : హాకినీరూపము ధరించునది

సహస్రదళపద్మస్ఠా సర్వవర్ణోపశోభితా
సర్వాయుధదరా శుక్ల సంస్ఠితా సర్వతోముఖీ

సహస్రదళ పద్మస్థా : సహస్రార చక్రమను పద్మమున నివసించునది
సర్వవర్ణోప శోభితా : అనేక రంగులతో శోభిల్లుచున్నది
సర్వాయుధధరా : అన్ని ఆయుధములను ధరించినది
శుక్లసంస్థితా : శుక్ల దాతువునందు ఉండునది
సర్వతోముఖీ : అన్నివైపులా ముఖము కలిగినది

సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యాంబాస్వరూపిణీ
స్వాహా స్వధా మతిర్మేధా శ్రుతి: స్మృతి రనుత్తమా

సర్వౌదన ప్రీతచిత్తా : అన్నిరకముల అన్నములందు ప్రీతీ కలిగినది (పాయసాన్నము,చిత్రాన్నము మొదలగున్నవి)
యాకిన్యంబాస్వరూపిణీ : యాకినీ అమ్మవారి రూపం కలిగినది
స్వాహా : స్వాహా దేవి (అగ్ని దేవుని భార్య)
స్వధా : స్వధారూపిణీమతి: : మనస్సు
మేధా : బుద్ధి
శ్రుతి: : ఙ్ఞాపకము
స్మృతి: : వేదముల యెందు సూత్రప్రాయంగా వివరించు ధర్మములను, వివరించు గ్రంధములు
అనుత్తమ : శ్రేష్టురాలు

పుణ్యకీర్తి: పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలుకా

పుణ్యకీర్తి: : పుణ్యకార్యములు చేయువానిచే కీర్తించపడునది
పుణ్యలభ్య : పుణ్యముచే లభించునది
పుణ్యశ్రవణ కీర్తన : పుణ్యప్రదమైన శ్రవణ కీర్తనలు కలది
పులోమజార్చితా : పులోముని కుమర్తె సచీదేవి చే పూజింపబడునది
బంధమోచనీ : భవబంధములనుండి విడిపించునది
బంధురాలకా : దట్టమైన కురులు కలది

విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూ:
సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ

విమర్శరూపిణీ : విమర్శనాత్మకమైన రూపము కలది
విద్యా : శ్రీ విద్య
వియదాది జగత్ర్పసూ: : పంచభూతాత్మికమైన ఈ జగత్తుకు తల్లి
సర్వవ్యాధి ప్రశమనీ : అన్ని వ్యాధులను పొగ్గొట్టునది
సర్వమృత్యు నివారిణీ : జన్మపరంపర లేకుండ చేయునది

అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా

అగ్రగణ్యా : అందరికన్నా ముందు పూజింప దగునది
అచింత్యరూప : ఊహకు అందని రూపు కలిగినది
కలికల్మషనాశిణీ : కలియుగం లో ని పాపములను నాశనము చేయునది
కాత్యాయని : పార్వతీ దేవి
కాలహంత్రీ : కాలప్రభావమునకు లోనుకానిది
కమలాక్షనిషేవితా : మహా విష్ణువు చే పూజింపబడుచున్నది

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ

తాంబూలపూరిత ముఖీ : తాంబూలముతో కూడిన నోరు కలది
దాడిమీకుసుమప్రభా : దాన్నిమ్మ పువ్వు కంటే యెర్రని కాంతి కలది
మృగాక్షి : సోగ కన్నులు కలది
మోహినీ : మొహింపచేయునది
ముఖ్యా : ముఖ్యురాలు
మిత్రరూపిణీ : భక్తుల యెడల మిత్రభావము కలది

నిత్యతృప్తా భక్తనిద్ధి ర్నియంత్రీ నిఖిలేశ్వరీ
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ

నిత్యతృప్తా : ఎల్లప్పుడూ తృప్తిగా ఉండునది
భక్తనిధి: : భక్తులకు నిధి వంటిది
నియంత్రి : దేవాధిదేవతలను తన ఆధీనములో ఉంచుకొనునది
నిఖిలేశ్వరీ : అన్నింటికి అధికారిణీ
మైత్ర్యాదివాసనాలభ్యా : ఆప్తభావముచే లభించునది
మహాప్రళయ సాక్షిణీ : మహాప్రళయమందు బ్రహ్మాది దేవతలతో పాటు సమస్త సృష్టి అంతరించుటను చూసిన ఏకైక సాక్షి

పరాశక్తి: పరానిష్టా ప్రఙ్ఞాన ఘనరూపిణీ
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ

పరాశక్తి : మూలకారణశక్తి
పరానిష్టా : పరతత్వమునందలి నిష్ట
ప్రఙ్ఞానఘనరూపిణీ : ఆత్మ ఙ్ఞానస్వరూపిని
మాధ్వీపానాలసా : సమాధి స్ఠీతి ఎందు దేహభావము నశించి ఆత్మభావము కలిగినది
మత్తా : బ్రహ్మానందమును పొందునది
మాతృకావర్ణరూపిణీ : "ఆ"నుండి "క్ష" వరకు కల అక్షరములను మాతృకలు అంటారు. అమ్మణ్ణి అక్షరరూపిణీ

మహాకైలాసనిలయా మృణాళమృదుదోర్లతా
మహనీయా దయామూర్తి ర్మహాసామ్రాజ్యశాలినీ

మహాకైలాసనిలయా : సహస్రారమే (కైలాసము) నివాసముగా కలది
మృణాళమృదుదోర్లతా : తామరతూడులు వంటి మృదువైన బాహువులు కలది
మహనీయా : మహిమ కలది
దయామూర్తి: : రూపుదాల్చిన దయ
మహాసామ్రాజ్యశాలినీ : గొప్ప సామ్రాజ్యము కలది

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా
శ్రీ షోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా

ఆత్మవిద్యా : వేదాంత విద్య
మహావిద్యా : బ్రహ్మవిద్య
శ్రీవిద్యా : శ్రీవిద్యా స్వరూపిణీ
కామసేవితా : మన్మధుని చే సేవించబడుచున్నది
శ్రీషోడశాక్షరీవిద్యా : 16అక్షరములు కల శ్రీవిద్యా మంత్రమే స్వరూపముగా కలది
త్రికూటా : మూడు కూటములు కలిగినది (వాగ్భవ, మధ్య, శక్తి)
కామకోటికా : మోక్షమునందు కోరిక కలిగినది

కటాక్షకింకరీభూత కమలాకోటిసేవితా
శిర:స్థితా చంద్రనిభా ఫాలస్థేంద్ర ధను:ప్రభా

కటాక్షకింకరీభూత : అమ్మవారి క్రీకంతి చుపుకై ఎదురుచుస్తున్న కోటిమంది లక్ష్మీ దేవులచే సేవించబదుచున్నది
శిర:స్థితా : శిరస్సునందు ఉండునది
చంద్రనిభా : చంద్రునివంటి కాంథి కలిగినది
ఫాలస్థా : నుదుటి యెందు ఉండునది
ఇంద్రధను:ప్రభా : ఇంద్రధనుస్సు వంటి కాంతి కలిగినది

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా
దాక్ష్యాయణీ దైత్యహంత్రీ దక్షయఙ్ఞవినాశినీ

హృదయస్ఠా : హృదయస్ఠానమున ఉండునది
రవిప్రఖ్యా : సూర్యుని కాంతి కలిగినది
త్రికోణాంతరదీపికా : మూలాధార చక్రమును వెలిగించునది
దాక్ష్యాయణీ : దక్ష్యప్రజాపతి కూతురు
దైత్యహంత్రీ : రాక్షసులను సం హరించునది
దక్షయఙ్ఞ వినాశినీ : దక్షుడి యఙ్ఞ వినాశమునకు కారకురాలు

దరాందోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ
గురుమూర్తి ర్గుణనిధి ర్గోమాత గుహజన్మభూ:

దరాందోళితదీర్ఘాక్షీ : ఒక కొననుండి మరొక కొన కు కదులుచున్న విశాలమైన నేత్రములు కలది
దరహాసోజ్వలన్ముఖీ : చిరునవ్వుచే ప్రకాశవంతమైన ముఖము కలిగినది
గురుమూర్తి : జగత్తునకు గురుస్ఠానమైనది
గుణనిధి: : అన్ని గుణములకు నిధివంటిది
గోమాతా : గోమాత
గుహజన్మభూ: : సుబ్రహ్మణ్యేశ్వరుని తల్లి

దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ
ప్రతిపన్ముఖ్యరాకాంత తిధి మండలపూజితా

దేవేశీ : దేవతలకు అధికారిణి
దండనీతిస్ఠా : దండనీతి యెందు ఉండునది
దహరాకాశరూపిణీ : దహరాకాశమే రూపముగా కలిగినది
ప్రతిపన్ముఖ్యరాకాంతతిధిమండల పూజితా : కృష్ణపాడ్యమి నుండి పూర్ణిమ వరకు గల అన్ని తిధులలొ పూజింపబడునది

కళాత్మికా కళానాధా కావ్యాలాపవినోదినీ
సచామరారమావాణీ సవ్యదక్షిణ సేవితా

కళాత్మికా : షోడశకళాప్రపూర్ణమైనది
కళానాధా : కళలకు అధికారిణి
కావ్యాలాపవినోదినీ : కావ్యములు చదువుట, వినుటయందు ఆసక్తి కలిగినది
సచామర : వింజామర
రమావాణీ : లక్ష్మీదేవి, సరస్వతీదేవి
సవ్యదక్షిణసేవితా : ఇరుప్రక్కలా విసురుచుండగా సేవించబడుచున్నది

ఆదిశక్తి రమేయాత్మా పరమాపావనాకృతి :
అనేకకోటి బ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా

ఆదిశక్తి: : సృష్టి ఆరంభమునకు మూలకారణమైన శక్తి
అమేయ : అనంతమైనది
ఆత్మా : ఆత్మస్వరూపిణె
పరమా : సర్వాధికురాలు
పావనాకృతి: : పవిత్రమైన రూపము కలిగినది
అనేకకోటిబ్రహ్మండ జననీ : కోటానుకోట్ల బ్రహ్మండములకు తల్లి
దివ్య విగ్రహా : దివ్యమైన రూపము కలిగినది

క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి స్త్రి దశేశ్వరీ

క్లీంకారీ : క్లీం అనే బీజాక్షర రూపిణి
కేవలా : సమస్త సృష్టి లయమైనను మిగిలియున్నది
గుహ్యా : గుప్తమైనది
కైవల్యపదదాయినీ : మోక్షమును ఇచ్చునది
త్రిపురా : త్రిపురసుందరి
త్రిజగద్వంద్యా : ముల్లోకములచే పూజింపబడుచ్చున్నది
త్రిమూర్తి: : త్రిమూర్తిస్వరూపిణీ
త్రిదశేశ్వరీ : బ్రహ్మాది దేవతలకు అధికారిణి

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచింతా
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వ సేవితా

త్ర్యక్షరీ : ఐం, హ్రీం, శ్రీం అను బీజాక్షర స్వరూపిణి
దివ్యగంధాఢ్యా : దివ్యమైన వాసన కలిగినది
సిందూరతిలకాంచితా : ఎర్రని తిలకమును ధరించునది
ఉమా : పార్వతీదేవి
శైలేంద్రతనయా : శైలపుత్రి (పార్వతి)
గౌరీ : గౌరవర్ణము కలిగినది (పార్వతి)
గంధర్వసేవితా : గంధర్వులచే పూజింపబడుచ్చున్నది

విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ
ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా ఙ్ఞానదా ఙ్ఞానవిగ్రహా

విశ్వగర్భా : విశ్వమును గర్భమునందు ధరించినది
స్వర్ణగర్భా : బంగారమును గర్భమున ధరించినది
వరదా : వరములు ఇచ్చునది
వాగధీశ్వరీ : వాక్కులకు అధీశ్వరీ
ధ్యానగమ్యా : ద్యానముచే చేరదగినది
అపరిచ్చేద్యా : భాగింపరానిది
ఙ్ఞానదా : ఙ్ఞానమును ఇచ్చునది
ఙ్ఞానవిగ్రహా : ఙ్ఞానమే స్వరూపముగా కలిగినది

సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ
లోపాముద్రార్చితా లీలాక్లుప్తబ్రహ్మాండమండలా

సర్వవేదాంతసంవేద్యా : సమస్త వేదాంతములచే తెలియబడునది
సత్యానందస్వరూపిణీ : సత్యము, ఆనందము స్వరూపముగా కలిగినది
లోపాముద్రార్చితా : అగస్త్యుని భార్యైన లోపాముద్రచే పూజింపబడునది
బ్రహ్మాండమండలా: బ్రహ్మాండములను సృస్టించి లయము చేయుటయే క్రీడగా కలిగినది

ఆదృశ్యాదృశ్యరహితా విఙ్ఞాత్రీ వేద్తవర్హుతా
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా

ఆదృశ్యా : కంటికి కనపడునది
దృశ్యరహితా : ఆకారము లేనిది
విఙ్ఞాత్రీ : సమస్తమూ తేలిసినది
వేదవర్జితా : సర్వమూ తెలిసినది
యోగినీ : యోగమున ఉండునది
యోగదా : యోగములను ఇచ్చునది
యోగ్యా : యోగమే రూపముగా కలిగినది
యోగానందా : యోగమునందు లభించు ఆనందము
యుగంధరా : యుగములను ధరించునది

ఇచ్ఛా శక్తి ఙ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ
శర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ

ఇఛ్చాశక్తి : చేయవలెను అనే సంకల్పము
ఙ్ఞానశక్తి : ఙ్ఞానము (ఆలోచన) కలిగిన
క్రియాశక్తి : ఆచరించే సామర్ధ్యము
స్వరూపిణీ : స్వరూపంగా కలది
సర్వాధారా : అన్నింటికీ ఆధారభూతమైనది
సుప్రతిష్టా : స్ఠిరముగా ఉండునది
సదసద్రూపధారిణీ : బ్రహ్మపదార్ధము, జగత్తూ తానై ఉన్నది

1 వినదగు నెవ్వరు చెప్పిన..:

Unknown said...

మంచి ప్రయత్నం అమ్మా..!