Wednesday, June 29

దీపారాధన

  • దీపారాధన చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయకూడదు. దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.
  • వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్దతి కాదు.
  • కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో నిర్వహిస్తే చాలా మంచిది. సర్వరోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి.
  • కుందుని ఒక పళ్ళెం లో కాని తమలపాకు మీద కాని పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు.
  • దీపారాధన చేసేముందు దేవుడి ముందు పెట్టే కుందుల్లో నూనె, 2 వత్తులు వేసుకొని ఉంచుకోవాలి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో ( హారతి ఇచ్చే వస్తువు) కర్పూరం వెలిగించి దానితో కాని లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధనని చేయాలి. అగరొత్తులు, ఏకహరతి, కర్పూర హారతి ఇవ్వవలసి వచ్చినప్పుడు దీపారాధన నుండి వెలిగించకూడదు.
  • దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. దీప పీఠభాగము బ్రహ్మాతో సమానం. స్ధంబము విష్ణురూపము, ప్రమిద పరమేశ్వరుడు, దీపతైలం నాదం, వత్తి అగ్ని, వెలుగుశక్తి స్వరూపం.
  • ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి అశుభ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు.
  • అమ్మవారిముందు బియ్యంపోసి దానిమాద వెండి కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.
  • దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీమహాలక్ష్మి కి , నువ్వుల నూనె శ్రీమహావిష్ణువు, శ్రీసుబ్రహ్మణ్యస్వామి, కొబ్బరి నూనె శ్రీమహాగణపతి కి ముఖ్యము. అలాగే ఆవు నెయ్యి, విప్పనూనె, వేపనూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తి కి చాలా ముఖ్యము.
  • ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, ఆముదం గాని ఏదో ఒక తైలము శ్రేష్ఠము. ఎట్టి పరిస్ధితులలో శనగనూనె వాడరాదు.
నెయ్యి --------మహాలక్ష్మి కటాక్షం (ఆవు నెయ్యి, విప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది.)
ఆముదం ------కష్టాలు తొలుగుట, ఏకాగ్రత ,కీర్తి ప్రతిష్టలు పొందుతారు
నువ్వులనూనె ------ మద్యమం(దుష్ట శక్తి , శతృ బాధలు తొలుగుతాయి)

దీపం కొండెక్కింది అనాలి. దీపారాధన పూర్తయింది, ఆరిపోయింది అని అనకూడదు.
తెల్లవారుఝామునే లేచి స్నానాదులు ముగించుకొని దైవారాధన చేయాలి. తెల్లారి 5 గంటల లోపు స్నానం చేస్తే దానిని బుషిస్నానం, 5-6 గంటల వేళ స్నానం చేస్తే దైవస్నానం, 6-7 గంటల మధ్య చేస్తే మానవ స్నానం అంటారు. (ఇప్పుడు మిట్టమధ్యాహ్నం వరకు స్నానాదులు చేయకుండా మిగిలిన పనులు పూర్తిచేస్తున్నారు. అది ఇంటికి, మనకి కూడా మంచిది కాదు.)

4 వినదగు నెవ్వరు చెప్పిన..:

Janardhana Sharma said...

మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి .. దీపారాధన చేశాక చెప్పవలసిన మంత్రాన్ని కూడా ఇవ్వగలరు ( భో దీప దేవి రూపస్త్వం.... )
మీరు చెప్పిన విషయాలు మీరు ఎక్కడనుండి ( పురాణాలు.. ఇతర వేద భాగాలు...ఇలా ) తీసుకున్నారో చెప్పడం మీరు రాసిన విషయాల ఆమోదానికి చాలా ముఖ్యం అని నా అభిప్రాయం . ఎందుకంటే నెట్ లో ఎవరికి తోచింది వారు రాస్తారు అన్న వదంతి ఉంది కాబట్టీ. అన్యధా భావించవలదు
జనార్దన శర్మ

గాయత్రి said...

మీ అభిప్రాయం బాగుంది జనార్ధన్ గారు, తప్పకుండా మీ సూచనను దృష్టిలో ఉంచుకొంటాను.

, said...

sadguru kaabatti
u can visit this site
http://bhagavanmemories.blogspot.com

గాయత్రి said...

sure sridhargaaru