అయిగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్యశిరో ధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే
పర్వతరాజు నందుని యొక్క కుమార్తె, ఈ ప్రపంచానికి సుఖ సంతోషాలను ప్రసాదిస్తున్న , వింధ్య పర్వత నివాసిని, నీలవర్ణ కంఠము గల మహావిష్ణువు యొక్క పత్ని, దేవతలందరి చేత స్తుతించబడుతున్న, మహిషిని సంహరించి మహిషాసురమర్ధిని అయిన ఓ పర్వత పుత్రి నమస్కారము.గిరివర వింధ్యశిరో ధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే
పూర్వము ధనువు అనే రాక్షసరాజుకి రంభుడు , కరంభుడు అనే ఇద్దరు కొడుకులుండేవారు. వారు పెరిగి పెద్దవారై తమకి ఉత్తమ సంతానం లభించాలనే కోరికతో తపస్సు చేయ ప్రారభించారు. వారి ఇద్దరులోను కరంభుడు నీటిలోను, రంభుడు చెట్టు మీద ఎక్కి ఘోర తపస్సు చేయసాగారు. అది చూసి ఇంద్రుడు తన ఇంద్రపదవి కోసము వారిరువురు తపస్సు చేయుచున్నారని పొరబడి మొసలి రూపాన్ని ధరించి నీటిలో తపస్సు చేయుచున్న కరంభుడిని సంహరించెను. అది చూసి రంభుడు తన అన్న మరణానికి బాధపడుచూ, తన అన్న లేని జీవితం వ్యర్ధమని తలచి తన తల తీసి శంకరుడికి సమర్పించెను.
అంత శంకరుడు రంభుడి ఎదురిగా ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడు రంభుడు శంకరుడు తో " స్వామీ ! పుత్ర సంతానం లేని నాకు నీవే మూడు జన్మలలోనూ పుత్రుడిగా జన్మించాలి. నీ వర ప్రభావంతో జన్మిచబోయే నా పుత్రుడు ముల్లోకాలలని జయించేవాడు, ధీర్ఘాయుషమంతుడు, యశోవంతుడు, కామరూపకోవిదుడు వంటి సుగుణాలు ఉన్నవాడు గా నాకు కావాలి " అని కోరుకోగా "తధాస్తు " అని శంకరుడు అంతర్ధనమైనాడు.
అలా వరాలు పొందిన రంభుడు ఉత్సాహంగా అడవి నుండి ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఎదురుగా కామాతురంతో మంచి యవ్వన ప్రాయంలో ఉన్న గేదెను చూసి చలించిపోయి తాను కూడా కామోద్రేకాన్ని పొంది సహజమైన రాక్షస ప్రభావంతో ఆ గేదే తో రమించాడు.
అదే సమయంలో పరమేశ్వరుడు కూడా తన అంశాన్ని ఆ మహిషం లో ప్రవేశ పెట్టాడు. ఇలా కొంత కాలం తర్వాత ఆ మహిషికి ఒక కొడుకు పుట్టాడు, మహిష గర్భ సంజాతుడు కాబట్టి వాడు కూడా మహిష మానవాకారంతో పుట్టాడు. వాడు పెరిగి పెద్దవాడై ఇంద్రున్ని జయించి స్వర్గాధిపత్యాన్ని పొంది సకల భోగాలు అనుభవించసాగాడు.
ఇలా కొంత కాలం గడచిన తర్వాత ఒక రోజు దుర్మార్గుడైన ఆ మహిషిడు స్త్రీ రూపం ధరించి కాత్యాయణ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి ఆయన శిష్యుడిని ఏడిపించసాగాడు. ఆ దృశ్యం చూసి కోపంతో కాత్యాయణ మహర్షి " ఓయీ ! మహిషాసురా ! నా శిష్యుడిని స్త్రీ రూపం ధరించి నీవు భాధించావు , కాబట్టి నువ్వు స్త్రీ వలననే మరణిస్తావు" అని శపించెను.
అయినా మహర్షి శాపాన్ని లెఖ్ఖచేయకుండా మహిషుడు యధా ప్రకారము దేవతలని , ఋషులని , స్త్రీలని సాధువులని పీడించసాగాడు. చివరికి వీడి అకృత్యాన్ని సహించలేక దేవతలంతా భయబ్రాంతులైనారు .
స్త్రీ వలననే మహిషాసురిడికి మృత్యువు వాటిల్లుతుందని గ్రహించి దేవతలందరూ విష్ణువుని శరణు గోరారు. అంతట విష్ణువు వారందరికీ ఒక ఉపాయం చెప్పెను. సకల దేవతాంశలను తేజోశ్శక్తూలను కలబోసికొని ఒక స్త్రీ మూర్తి ఆవిర్భవించినట్లైతే మహిషాసురిడిని ఆ స్త్రీ మూర్తి చేత సంహరించ చేయవచ్చునన్నాడు.
ఆ మాటలకు అందరూ సమ్మతించిరి. ముందుగా బ్రహ్మ ముఖమునుండి ఒక తేజోరాశి ఆవిర్భవించినది. పద్మరాగ మణికాంతులను వెదజల్లుతున్న ఆ తేజోరాశిని దేవతలందరూ చూస్తుందగనే శివుడి నుండి వెండిలాగా ధగధగ లాడుతున్న మరోకాంతి పుంజం అక్కద కనిపించింది. విష్ణుమూర్తి నుంచి నిలం రంగులో మూర్తిభవించిన సత్వగుణంలగా ఉన్న తేజస్సు వెలువడింది యముడు, అగ్ని, కుబేరుడు, వరుణుడు ఇలా ఒక్కరేమిటి సకల దేవతల నుండి అప్పటికప్పుడు తేజస్సులు వెలుబడి ఒక దివ్య తేజోరాశి అయిన స్త్రీ మూర్తి గా రూపుదాల్చినది.
తర్వాత దేవతలందరూ ఆయుధాలు ఆమెకు బహూకరించారు. విష్ణువు సుదర్శన చక్రం నుండి అలాంటిదే మరొకటి సృష్టించి ఇచ్చాడు. శంకరుడు త్రిశూలన్ని, వరుణుడు మంచి శంఖాన్ని, అగ్నిదేవుడు శతఘ్నన్ని, వాయువు ధనస్సును, ఎప్పటికీ తరగిపోని బాణాలతో ఉన్న అంబుల పొదని ఇచ్చాడు.
దేవేంద్రుడు వజ్రాయుధాన్ని పోలిన మరొక ఆయుధం, యముడు తన కాల దండం లాంటి దండాన్ని, బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన కమండలాన్ని ఆ మాతకు సమర్పించారు. వరుణుడు తన పాశాయుధాన్ని, కాలుడు ఖడ్గాన్ని, కుబేరుడు సర తో నిండిన సువర్ణ పాత్రని, కౌమోదకి గద త్వష్ణ సమర్పించారు. ఇలా అనేకానేక ఆయుధాలతో ఆ శక్తి స్వరూపిణి అలరారింది.
ఆ మహిషాసురుడిని సంహరించుట కొరకు ఆ ఆదిపరాశక్తి రోజుకో రూపంతో ఆ మహిషాసురిడితో పోరి చివరికి ఉగ్రరూపంలో ఆ మహిషాసురిడిని సంహరించి " మహిషాసుర మర్ధిని " అయినది. మహిషాసురిడిని సంహరించాక కూడా ఆ తల్లి శాంతించలేదు.
విలయ తాండవం చేస్తున్న ఆ ప్రళయ శక్తిని శాంత పరచుటకు ఎవరికీ సాధ్యపడలేదు .అందరూ శంకరుడిని వేడుకోగా , అంతట శంకరుడే ఆ ఆది శక్తి పాదాలచెంత పరుండినాడు , శివుడికి ఆ తల్లి పాదాలు తగలగానే రౌద్ర వీర ప్రచండ చండిక శృంగార సౌందర్య లహరైన గౌరీ దేవిగా మారినది. అందరికీ విజయాలను కూర్చే " రాజరాజేశ్వరీ దేవి " గా అభయమిచ్చినది.
3 వినదగు నెవ్వరు చెప్పిన..:
article is very nice...
keep going.....
Visleshna chala bagundi
Dhanyavadamulu
Post a Comment