Monday, October 6

దశర చివరిరోజు ..విజయదశమి

అమ్మవారు మహిషాసురుడుని సంహరించి, దుష్ట సంహారం చేసి సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజు [దశమి తిధి నాడు] పండగ జరుపుకొంటాం. కాబట్టి విజయదశమి గా పిల్చుకొంటున్నాం.

ఈ విజయదశమి ని మన దేశం లో ఉత్తర దిక్కున ఉన్నవారు ఈ రోజున , రాముడు రావణుడి ఫై విజయం సాదించి దుష్ట సంహారం చేసి, సీతమ్మని తిరిగి అయోధ్యకు తీస్కొని వెళ్ళిన సందర్భానికి గుర్తుగా రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి పండుగను జరుపుకొంటారు.

12ఏళ్ళు వనవాసం, 1 ఏడు అఙ్ఞాతవాస కాలం లో పాండవులు తమ మంత్రోపేతమైన ఆయుధాలను జమ్మి వృక్షం ఫై వుంచి,తిరిగి అఙ్ఞాతవాసం తర్వాత జమ్మి వృక్షమునకు పూజ చేసి ఆయుధాలను ధరించారు.కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున "ఆయుధపూజ" ని చేస్తారు. కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొంటారు.

3 వినదగు నెవ్వరు చెప్పిన..:

Unknown said...

Great work yar.Well said about our festival greatness.

Sunny said...

amma vaaru champindi narakaasuruduni kaademo andi...bahusha mahisasurudu anukunta.
koncham correct cheyandi

గాయత్రి said...

అవునండి, నరకుడిని దీపావళి రోజు సంహరించారు, విజయదశమి రోజు మహిషుడిని సంహరించారు అమ్మవారు. సరిచేసాను. ధన్యవాదములు.