ఆంగ్ల సంవత్సరం ప్రకారం మనకు వచ్చే మొదటి పండగ. మేము ఐతే ఈ పండగను పెద్దపండగ అని పిలుస్తాము.
సంక్రాంతి నాల్గురోజుల పండగ. మొదటి రోజు భోగి. తెలవార్జామునే లేచి ఇంటి ముంగిట భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఉన్నపాత / వాడని వస్తువులు, తాటాకులు బోగిమంటలో వేస్తారు. రైతులకు పంట చేతికి వచ్చి ఇల్లు చేరుస్తున్న సమయంలో ఇంటిని శుభ్రం చేస్తూ ఇంట్లో ఉన్నచెత్త అంతా భోగి మంటల రూపం లో వేసి ఇంటిని కొత్త ధాన్యానికి అనుగుణంగా మలుస్తారు. భోగిమంటలో కాల్చిన తేగలు ఎంత రుచిగా ఉంటాయి అంటే మాటలలో చెప్పలేను.
దారిద్ర్యాన్ని నశింప చేస్తూ శ్రీ మహా లక్ష్మి ని మన ఇంటికి ఆహ్వానిస్తున్నమనే ఈ భోగి యొక్క అర్ధము.
ఈ నాల్గు రోజులు పార్వతి దేవిని గొబ్బెమ్మ రూపంలో పూజిస్తారు. కనుమ పక్కరోజు గొబ్బెమ్మను దగర్లో ఉన్న నదిలో కాని చెరువులో కాని, ఏ వసతి లేకపోతే పెరటిలోని బావిలో కాని వాలాడిస్తారు ( నిమర్జనం చేయడం).
రెండవ రోజు సంక్రాంతి...సంక్రాంతి అనగానే మనకు ముందుగ గుర్తు వచ్చేది ముఖ్యంగా ....
కొత్త అల్లుళ్ళు ,తెలవార్జామున వచ్చే జంగమ దేవరులు (సంక్రాంతి నెలలో మాత్రమే వస్తారు) , హరిదాసులు, బుడబుక్కలవాడు, గంగిరెద్దువాళ్లు ,కోడి పందేలు, గాలిపటాలు, పిండివంటలు ముఖ్యంగా అరిసెలు, మణుగుపూలు(జంతికలు ).
రైతులకు పంట చేతికి వచ్చి ధాన్యాని ఇంటికి చేర్చే వేళ అందరు సంతోషం తో పొద్దునే లేచి వాకిట్లో కళ్ళాపి చల్లి రంగుల ముగ్గుల మద్యలో గొబ్బెమ్మలను (పార్వతిదేవి) పెట్టి, తలంటు స్నానాలు చేసి, పాలు పొంగించి కొత్త ధాన్యం తో పొంగలి వండి, దేవుడికి నైవేద్యం పెడతారు. సంక్రాంతి రోజు బొమ్మలకొలువు పెట్టే సంప్రదాయం కూడా చాలామందికి ఉంది.
మూడవరోజు కనుమ. రైతులు తమ దగ్గర ఉన్నపశు సంపదకు (ఆవులు, ఎద్దులు ....) పూజ చేస్తారు. అవి తమ ధాన్య సంపాదనకు ఎంతగానో సహాయం చేసినందుకు వాటిని గౌరవిస్తూ పూజిస్తారు. నాల్గవరోజు ముక్కనుమగా జరుపుతారు.
కనుమ రోజు ఎటువంటి సందర్భం లోను ప్రయాణాలు చేయరు.
6 వినదగు నెవ్వరు చెప్పిన..:
very nice description of the festival.
dhanyavaadamulu
try to put-in some details on various regions within AP.
As they celebrate sankranthi differently in diff regions, viz kodipandhaalu is not common in north andhra, similarly edla pandhaalu is not common in coastal andhra.
neither i'm telangana nor andhara, i'm pure telugu (telugu lo poor)
sure, will try sometime. thank you
http://saamavedam.org/NewDiscourses.html
@anonymous....thank you for the link. am already following Sharmagaari pravachanams on that site. thank you
Post a Comment