Monday, April 25

శనిత్రయోదశి

ఈనెల 30 న శనిత్రయోదశి. ఈరోజు శనీశ్వరునకు తైలాభిషేకము (నువ్వుల నూనె తో) చేయడం వలన జాతకములో శనిదశ ,అంతర్దశలలో శని సంచారములతోను చికాకులు పడుతున్నవారికి దోషములు పరిహారమవుతాయని శాస్త్రవచనము. అలాగే ఈరోజు శివునకు రుద్రాభిషేకము తో పూజలు జరిపించటము వలన జీవితములో కష్టాలు ఎదుర్కొంటున్న వారు వాటిని తొలగించుకోగల శక్తి పొందుతారు. ప్రత్యేకముగా ప్రదోషకాలములో శివార్చన అనంతశుభాలను ప్రసాదిస్తుందని పురాణాదులు తెలుపుతున్నాయి. కనుక శివారాధన చాల ముఖ్యము.

ఈరోజు ఉపవాసం ఉండటం మంచిది. { పెద్దవారు /ఉపవాసం చేయలేని వారు మాత్రం బలవంతంగా చేయొద్దు }. రాత్రి 8 తర్వత భోజనం చేయాలి. సాద్యమైనంత వరకు శివనామస్మరణ చేస్తూఉండాలి. మద్యం / మాంసాహారం తీసుకోకూడదు. ఎవరివద్దనుండి ఇనుము, నువ్వులు, నువ్వుల నూనె, ఉప్పు చేతితో తీసుకోకూడదు. వారిని కిందపెట్టమని అప్పుడు మీరు తీసుకోండి. { మామూలు రోజులలో కూడ ఉప్పు ని వేరొకరి చేతినుండి అందుకోకూడదు }

0 వినదగు నెవ్వరు చెప్పిన..: