Tuesday, September 30

దశర మొదటి రోజు ...లక్ష్మి అవతారం


ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం


ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపుజితే, శంఖుచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే
నమస్తే గరుడారుఢే డోలాసుర భయంకరి, సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
సర్వజ్ఞే సర్వ వరదే సర్వదుష్ట భయంకరి, సర్వదుఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
సిద్దిబుద్ది ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయని, మంత్రముర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే
ఆద్యంత రహితే దేవి ఆదిసక్తే మహేశ్వరీ, యోగగ్యే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే
స్తూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే, సర్వ పాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి, పరమేశి జగన్మాతర్మహాలక్ష్మి నమోస్తుతే
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే,జగత్ స్థితే జగన్మాతర్మహాలక్ష్మి నమోస్తుతే
మహాలక్ష్మాష్టక స్తోత్రం యఃపఠే భక్తీ మానరః, సర్వసిద్ది మాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేనిత్యం మహాపాప వినాశనం, ద్వికాలం యః పఠేనిత్యం ధనధాన్య సమన్వితః
త్రికాలే పఠేనిత్యం మహాశత్రు వినాశనం, మహాలక్ష్మిర్భవేనిత్యం ప్రశ్శనవరదో శుభా

దశర / శరన్నవరాత్రులు

దశర , నవరాత్రులు..ఈరోజు నుండి ప్రారంభం. ఈ తొమ్మిదిరోజులు అమ్మవారు మనకు తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తారు. ఈ అవతారాలను వివిధ ప్రాంతాలలో వేర్వేరు రోజులలో పుజిస్తారు ( అన్ని ప్రాంతాలలో ఒకే అలంకారం ఒకే రోజు వుండాలని లేదు )
మొదటిరోజు --శ్రీలక్ష్మి అమ్మవారు
రెండవ
రోజు --శ్రీ గాయత్రి అమ్మవారు
మూడవరోజు
---శ్రీ అన్నపూర్ణ అమ్మవారు
నాల్గవరోజు ---శ్రీ లలిత అమ్మవారు
ఐదవరోజు
---శ్రీ బాలత్రిపురసుందరి అమ్మవారు
ఆరవరోజు ---శ్రీ సరస్వతి అమ్మవారు
ఏడవరోజు --శ్రీ దుర్గాదేవి అమ్మవారు
ఎనిమిదవరోజు
---శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు
తొమ్మిదవరోజు ---శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

దశ అంటే పది, హర అంటే సంహరించడం. ఈ తొమ్మిదిరోజులలో అమ్మవారు "శక్తి"రూపం లో దుష్టసంహారం చేసింది.
పదవరోజు ఐన దశమి ( తెలుగు కాలెండరు ప్రకారం పక్షం(పదిహేనురోజులు) లో పదో రోజు ) నాడు విజయం సాధించింది. దానికి గుర్తుగా మనం విజయదశమి ని జరుపుకొంటాము.

ఈ నవరాత్రులలో కొన్ని ప్రాంతాల వారు బొమ్మలకొలువు కుడా పెడతారు. ( నెల్లూరు,ఒంగోలు....)
మహిషి అనే రాక్షసుని సంహారం కొరకు దుర్గాదేవి కి, దేవతలు అందరు తమ శక్తిని ఇచ్చి, తామూ ఈ తొమ్మిది రోజులు బొమ్మలరూపం లో (వారి శక్తి అంతా అమ్మవారు తీస్కోన్నారు కావున) ఉంటారు.

Monday, September 29

అమ్మవారి నవరాత్రుల అలంకారాలు

మొదటి రోజు .....పాడ్యమి...శ్రీలక్ష్మి
రెండవరోజు....విదియ....శ్రీ గాయత్రిదేవి
మూడవరోజు ....తదియ...శ్రీ అన్నపూర్ణాదేవి
నాల్గవరోజు...చవితి...శ్రీ లలితాదేవి
ఐదవరోజు ...పంచమి...శ్రీ బాలాత్రిపురసుందరి
ఆరవరోజు...షష్టి...శ్రీ సరస్వతీదేవి
ఏడవరోజు..సప్తమి...శ్రీ దుర్గాదేవి
ఎనిమిదవరోజు...అష్టమి...శ్రీ మహిషాసురమర్దని
తొమ్మిదవరోజు..నవమి...శ్రీ రాజరాజేశ్వరీదేవి
పదవరోజు...దశమి....విజయదసమి

ఆదివారం...సూర్యభగవానుడు

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం

శనివారం ..వెంకటేశ్వర స్వామి


శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్దినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

వెంకటేశ్వస్వామి మీద అష్టోత్రము లేక మనకేం చదవడానికి రాదే అనుకోనవసరం లేదు.
వెంకన్న కు ఇష్టమైన "గోవిందా, వెంకట, శ్రీనివాసా " అని తలచుకొంటే చాలు, వెంకన్న ఏడు కొండలు దిగి మనపక్కన ఉంటాడు. భక్తుల పిలుపు కు వెంటనే స్పందిస్తాడు.
ఏడుకొండలవాడ, వెంకటరమణా, గోవిందా, గోవిందా....

శుక్రవారం..లక్ష్మిదేవి

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యమ్బకే దేవి నారాయణీ నమోస్తుతే

సర్వమంగళ మాంగళ్యే.....మంగళప్రదమైన
శివ..చైతన్యము
సర్వార్ధ సాధికే ... నిర్విజ్ఞంగా కార్యసాధన చేకూర్చే
శరణ్యే...శరణార్దులకు రక్షణ ఇచ్చే
త్ర్యమ్బకే దేవి ..మూడు లోకాలకు అమ్మ
నారాయణీ
...శ్రీమన్నారాయణుని ధర్మపత్ని
నమోస్తుతే ...నమస్కారము.

ప్రతి
పనిని మంగళకరంగా [ఎటువంటి ఆటంకాలు లేకుండా ] జరిగేటట్లు చేస్తూ, నిన్నే శరణు కోరిన వారికి రక్షణ కల్పిస్తూ, మూడు లోకాలుకు అమ్మవై , శ్రీమన్నారాయణుని ధర్మపత్ని అయిన లక్ష్మిదేవి నమస్కారము.

గురువారం ..సాయిబాబా


సదానింబవృక్షస్య మూలాదివాసాత్ , సుధాస్రావిణం తిక్త మప్య ప్రియంతం తరుంకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాధం


నింబవృక్షమే { నిమ్మ చెట్టు } నివాసంగా చేసుకొని, రుచికరంగా కాకుండా చేదుగా వున్నా నిమ్మరసాన్ని కుడా అమృతప్రాయం గా చేయగలవాడు, ఎందుకంటే సాయినాధుడు కల్పవృక్షం { కోరిన కోరికలు తీర్చేది } లాంటి వాడు.

బుధవారం..శ్రీవిష్ణువు, హయగ్రీవుడు


శ్రీ విష్ణువు
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హ్రుద్యానగమ్యం వందేవిష్ణుం భవభయహరం సర్వలోకైకనాధమ్








శ్రీ హయగ్రీవుడు జ్గ్యానానన్ద మయం దేవం నిర్మల స్పతికార్పితం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే

మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్య స్వామి

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామాదూతం శిరసానమామి


ఎవరైతే మనస్సు, వాయువు కన్నా వేగంగా ప్రయాణించగల, అమోఘమైన తెలివితేటలు
గల వాడో, అటువంటి వాయుపుత్రుడు మరియు వానరులకు నాయకుడు ఐన ఆంజనేయస్వామి కి నమస్కారము.






సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం - షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం - శంకరపుత్ర సుబ్రహ్మణ్యం
శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం - హర హర హర హర సుబ్రహ్మణ్యం

శివ శివ హర హర సుబ్రహ్మణ్యం - హర హర శివ శివ సుబ్రహ్మణ్యం
శివ శరవణభవ సుబ్రహ్మణ్యం - గురు శరవణభవ సుబ్రహ్మణ్యం







సోమ వారం ...శివుడు , దక్షిణామూర్తి


మృత్యుంజయ మహామంత్రము
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ర్వారుక్ మివబంధనా న్మ్రుత్యో ర్ముక్షీయ మామృతాత్

మంత్రాన్ని బ్రాహ్మి ముహూర్తం లో చదివితే ( తెల్లవారుజ్యామున ) మంచి ఫలితాలు వస్తాయి. దీనినే మార్కండేయ మంత్రం అని కూడా అంటారు.





మేధా దక్షిణామూర్తి
స్పటిక రజితవర్ణం మౌక్తికా మక్షమాలా మమృతకలశ విద్యా ఙ్ఞా ముద్రః ప్రదాయకం
దధతమురగరక్షం చంద్ర చూడం త్రినేత్రమ్ విధృత వివిధ భూషం దక్షిణామూర్తి మీడే

దక్షిణామూర్తి అనగా దక్షిణం ముఖంగా కుర్చున్న వాడు. మేధస్సును, విద్యను,
ఙ్ఞానాన్ని నకు ప్రసాదించేది మేధా దక్షిణామూర్తి.

స్పటికం రజత వర్ణం...ఎటువంటి కల్మషాలు లేకుండా నిర్మలమైన తెలుపు రంగు
మౌక్తికా మక్షమాలా....ముత్యాల వంటి అక్షరాలను మాలగాధరించిన
అమృత కలశవిద్య ....అన్ని విద్యలను అమృతంగా చేసి కలశ రూపం లో ధరించిన
ఙ్ఞాన ముద్రః ప్రదాయకం ...నిత్యంఙ్ఞానముద్ర లో వున్న
చంద్రచూడం త్రినేత్రం ...చంద్రుడిని ధరించిన వాడు ( శివుడు )
విధృత వివిధ భూషం ..అనేక అలంకారాలతో వున్న
దక్షిణామూర్తి మీడే ...దక్షిణామూర్తి కి నమస్కారము.




Thursday, September 25

గణపతి ప్రార్దన


ఓం శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రస్సన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నుప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ముపాస్మహే
ఓం వక్రతుండ మహాకాయ కోఠి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా
ఓం గణానాంత్వాగణపతిగం ఆహయామహే కవీకవీనాముప మస్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం
బ్రహ్మన్నస్పతః
ఆనశ్రుణ్వన్నూ త్రిభిస్సాద సాధనం
ఓం మహా గణపతయే నమః

గురు అను పదానికి అర్ధము

గురు అను మంత్రములో --గు , , అను మూడు అక్షరములు న్నవి.
అనునది విఘ్నేశ్వర బీజాక్షరము
అనునది అగ్నిబీజక్షరము
అనునది విష్ణుబీజాక్షరము

మూడు బీజాక్షరాలు చేరి "గురు " అను మాత్రం ఏర్పడింది.